ఓ ఇంటివాడు కాబోతున్న భారత్ బౌలర్
టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. తన చిరకాల ప్రేయసి సమ్రీన్ కౌర్‌తో అతడు నిశ్చితార్థం చేసుకున్నాడు. ప్రస్తుతంన్యూజిలాండ్ పర్యటనలో ఉన్న అర్ష్‌దీప్.. అక్కడే సమ్రీన్‌కు ప్రపోజ్ చేశాడు. నిశ్చితార్థపు ఉంగరం తొడిగి తన ప్రేమను వ్యక్తం చేశాడు.

Arshdeep Singh Engagement
కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు పుట్టాడని తెలుగులో ఫేమస్ సామెత ఉంటుంది. ఇది ఇప్పుడు టీమ్ ఇండియా పేస్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌కు బాగా యాప్ట్ అవుతోంది. క్రికెట్ మైదానంలో తన బౌలింగ్‌తో అభిమానులను అలరిస్తున్న టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. వ్యక్తిగత జీవితంలో నవంబర్ 11న కొత్త అధ్యాయం మొదలైంది. ఒకవైపు పంజాబ్ జట్టు నుంచి ముంబైకి మారడం..మరోవైపు తన ప్రేయసి సమ్రీన్ కౌర్‌తో నిశ్చితార్థం చేసుకోవడం. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటన ఉన్న అర్షదీప్ అక్కడే తన ప్రేయసి సమ్రీన్‌కు ప్రపోజ్ చేశాడు. ఆమె వేలికి నిశ్చితార్థపు ఉంగరం తొడిగి (Arshdeep Singh Engagement)తన ప్రేమను వ్యక్తం చేశాడు. ఈ శుభవార్తను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
ఇన్‌స్టా పోస్ట్
ఈ మధురమైన క్షణాలను సమ్రీన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి హాయ్ ఫియాన్సీ(Arshdeep Singh Engagement) అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో అర్ష్‌దీప్ అభిమానులు ఒక్కసారిగా ఆనందంలో మునిగిపోయారు. దీంతో క్రికెట్ అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. అర్ష్‌దీప్ జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభం కావడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అర్ష్‌దీప్ సహచర ఆటగాళ్లు సైతం జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆటైంలో డేటింగ్
అర్ష్‌దీప్ సింగ్, సమ్రీన్ కౌర్ ప్రేమకథ ఐపీఎల్ 2026 సమయంలో క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లకు సమ్రీన్ హాజరవడం, ధర్మశాలలో వీరిద్దరూ కలిసి కనిపించడంతో డేటింగ్ వార్తలు మొదలయ్యాయి. ఈ ఊహాగానాలకు తెరదించుతూ జులై 26న అర్ష్‌దీప్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సమ్రీన్(Arshdeep Singh Engagement)తో ఉన్న ఫొటోలను షేర్ చేసి ‘My Person’ అంటూ తమ ప్రేమను అధికారికంగా ప్రకటించాడు. అంతేకాదు, ఈ జంట తమ అనుబంధానికి గుర్తుగా ఒకరి చేతిరాతలో మరొకరి పేరులోని మొదటి అక్షరాలను టాటూలుగా వేయించుకున్నారు. అర్ష్‌దీప్ చేతిపై సమ్రీన్ చేతిరాతతో ‘SK’, సమ్రీన్ చేతిపై అర్ష్‌దీప్ చేతిరాతతో ‘AS’ టాటూలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక న్యూజిలాండ్‌లో నిశ్చితార్థంతో తమ ప్రేమ ప్రయాణాన్ని మరో మైలురాయికి చేర్చారు.
సినిమా నటిగా..
సమ్రీన్ కౌర్ జమ్మూ కశ్మీర్‌కు చెందిన నటి, మోడల్, సోషల్ మీడియా వ్యక్తిత్వం. 2018లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో ఆమె జమ్మూ కశ్మీర్ తరఫున ఫైనలిస్ట్‌గా నిలిచారు. రణ్‌వీర్ సింగ్ నటించిన ’83’ సినిమాలో సమ్రీన్(Arshdeep Singh Engagement) కనిపించారు. ‘నెయిల్ పాలిష్’ వెబ్ ప్రాజెక్టులో నటించారు. పంజాబీ చిత్రం ‘సర్దార్ జీ 2’లోనూ భాగమయ్యారు. గురు రంధావా, బాద్‌షా, జుబిన్ నౌటియాల్ వంటి గాయకుల మ్యూజిక్ వీడియోల్లో కనిపించారు.
11•11•26 – A truly special date for Arsh!
Congratulations Samreen & Arshdeep 💙💍 https://t.co/Fo7dWEW56Q
— Mumbai Indians (@mipaltan) November 11, 2026



