Vaibhav Suryavanshi Double Century

క్రికెట్ ప్రపంచాన్ని మరోసారి ఆశ్చర్యపరిచాడు భారత యువ సంచలనం, బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ.ఖతార్ రాజధాని దోహోలో UAEతో జరిగిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌ వన్డే మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. బ్యాట్‌తో బౌండరీల వర్షం కురిపించాడు. ఔరా అంటూ ఆశ్చర్యపరిచాడు. వచ్చిన బాల్‌ను వచ్చినట్లు స్టాండ్స్‌కు తరలిస్తూ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 53బంతుల్లో 204 పరుగులు సాధించి క్రికెట్ చరిత్రలో(Vaibhav Suryavanshi Double Century) సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు.

రికార్డుల రారాజు
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో రికార్డులన్నింటినీ తిరగరాశాడు వైభవ్ సూర్యవంశీ. యూఏఈ నిర్దేశించిన 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా-ఏ జట్టుకు ఓపెనర్‌గా వచ్చిన వైభవ్ మొదటి బాల్‌ నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సిక్సర్లు, ఫోర్లతో మైదానంలోని అన్ని వైపులా పరుగుల వరద పారించాడు.కేవలం 16 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. అక్కడితో ఆగకుండా మరో 12 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. అంటే కేవలం 28 బంతుల్లోనే 100 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ పేరిట ఉన్న 29 బంతుల సెంచరీ రికార్డును (Vaibhav Suryavanshi Double Century)చెరిపేశాడు. దక్షిణాఫ్రికా దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ 2015లో వెస్టిండీస్‌పై 31 బంతుల్లో సాధించిన సెంచరీ రికార్డును కూడా అధిగమించాడు.

వైభవ్ ఊచకోత
సెంచరీ తర్వాత కూడా ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు వైభవ్. ఏమాత్రం జోరు తగ్గించకుండా 40 బంతుల్లోనే 150 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఆ తర్వాత కేవలం 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. పురుషుల లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 200 పరుగులు సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.ఇంతకుముందు ఈ రికార్డు 103 బంతుల్లో డబుల్ సెంచరీ చేసిన చాడ్ బోవ్స్ పేరిట ఉండేది. ఇప్పుడు వైభవ్ ఆ రికార్డును ఏకంగా 51 బంతుల తేడాతో అధిగమించాడు.మొత్తంగా 53బాల్స్ ఆడిన వైభవ్(Vaibhav Suryavanshi Double Century).. 28 సిక్సర్లు.. 7 ఫోర్లుబాధి 204 పరుగులు చేశాడు. UAE బౌలర్లను ఊచకోత కోశాడు.384.91 స్ట్రైక్ రేట్‌తో ఆడాడు.

14.2 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్‌
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఆ జట్టు తరఫున హర్‌ప్రీత్ సింగ్ భాటియా 130 పరుగులతో రాణించాడు. అనంతరం 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా-ఏ జట్టు వైభవ్ విధ్వంసంతో కేవలం 14.2 ఓవర్లలోనే 254 పరుగులు చేసి విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వైభవ్(Vaibhav Suryavanshi Double Century) ఒక్కడే 204 పరుగులు చేయడం ఈ మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది.