భారత్‌కు మారో ఆశాకిరణం.. వీరేంద్రుడి వారసుడి విధ్వంసం
టీమ్ ఇండియాకు మరో ఆశా కిరణం దొరికింది. ఇప్పటికే వైభవ్ సూర్యవంశీ భారత్ తరపున దడదడ లాడిస్తుండగా.. ఇప్పుడు భారత్ మాజీ క్రికేటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ మెదానంలో రెచ్చిపోతున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తిస్తున్నాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు.

Aryaveer Sehwag Century
టీమ్ ఇండియాకు మరో ఆశా కిరణం దొరికింది. ఇప్పటికే వైభవ్ సూర్యవంశీ భారత్ తరపున దడదడ లాడిస్తుండగా.. ఇప్పుడు భారత్ మాజీ క్రికేటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ మెదానంలో రెచ్చిపోతున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తిస్తున్నాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. అండర్-19 ఆసియా కప్ 2026లో భాగంగా యూఏఈతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆర్యవీర్(Aryaveer Sehwag Century) 160 పరుగులతో చెలరేగాడు. 168 బంతులు ఎదుర్కొని భారీ ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ ప్రారంభంలో ఆచితూచి ఆడిన ఆర్యవీర్ తర్వాత ఆకాశమే హద్దుగా బౌలర్లపై రెచ్చిపోయాడు. సెంచరీతో భారత్ స్కోర్‌ను పరుగులు పెట్టించాడు. జూనియర్ సెహ్వాగ్ మొత్తంగా 168 బంతుల్లో 17 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 160 పరుగులు సాధించి చివరకు పెవిలియన్ చేరాడు. 153 పరుగుల దగ్గర ఈ టోర్నీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును అధిగమించాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 309 పరుగులు సాధించింది. యూఏఈ బౌలర్లలో నసీం ఖాన్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. హదాయతుల్లా ఖాన్, నూరుల్లా అయోబి, కెప్టెన్ అయాన్ మిస్బా తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత యువ జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 309 పరుగుల భారీ స్కోర్ చేసింది.
Aaryavir Sehwag celebrates his landmark 150 with a towering six. 🥵
Watch #INDvUAE in the DP World Men’s U19 Asia Cup, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.
#SonySportsNetwork #SonyLIV https://t.co/kkBShecWuh
— Sony Sports Network (@SonySportsNetwk) November 10, 2026
అయితే ఆర్య వీర్ తండ్రి వీరేంద్ర సెహ్వాగ్ క్రీజ్‌లో అడుగుపెట్టింది మొదలు.. తొలి బంతి నుంచే బౌలర్లకు చుక్కులు చూపించే వాడు. ప్రతి బంతిపై దాడి చేసేవాడు. అయితే ఆర్యవీర్(Aryaveer Sehwag Century) తన ఆటతీరులో తండ్రి దూకుడుతో పాటు విరాట్ కోహ్లీ నుంచి స్ఫూర్తి పొందినట్లు చెప్పాడు. తన తండ్రిలాగా ఫస్ట్ బాల్ నుంచి ఎటాకింగ్ చేయడం ఇష్టమని, సెహ్వాగ్ శైలితో పాటు కోహ్లీ తరహాలోనూ క్రికెట్ ఆడాలనుకుంటున్నానని చెప్పాడు. ప్రత్యర్థి జట్లపై ఆధిపత్యం చెలాయించి భారత్‌కు విజయాలు అందించడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. దాన్ని ఆచరణలో పెడుతున్నట్లు తాజా ఇన్నింగ్స్‌తో స్పష్టమవుతోంది.
రెండో సెమీ ఫైనల్
ఒమన్ వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియా వన్డే టోర్నీలో భారత్ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. యూఏఈని యువ భారత్ 70 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో యూఏఈ సరిగ్గా 50 ఓవర్లలో 239 పరుగులకు ఆలౌటైంది. యూఏఈ బ్యాటర్లలో అహ్మద్ ఖుదాదాద్ (74; 74 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), నూరుల్లా అయోబీ (39; 25 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు) రాణించారు. ఏడో వికెట్‌కు ఖుదాదాద్, నూరుల్లా 52 బంతుల్లో 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి పోరాడినా యూఏఈకి ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో ఇషాన్ సోద్ (4/37) అదరగొట్టాడు. గురువారం జరగనున్న రెండో సెమీ ఫైనల్‌లో అఫ్గాన్‌తో భారత్ తలపడనుంది.



