మరోసారి ఫైనల్‌ల్లో పాక్‌తో ఢీ.. ప్రతీకారం తీరుతుందా..!
అండర్-19 ఆసియా కప్-2026లో భారత్ యువ జట్టు అదరగొట్టింది. అల్ అమెరత్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో అఫ్గానిస్థాన్‌పై ఘన విజయం సాధించి ఫైనల్‌కి దూసుకెళ్లింది. సెమీ ఫైనల్‌ల్లో ఆఫ్గానిస్తాన్‌ను 8 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది.

U19 Asia Cup 2026 Final
అండర్-19 ఆసియా కప్-2026లో భారత్ యువ జట్టు అదరగొట్టింది. అల్ అమెరత్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో అఫ్గానిస్థాన్‌పై ఘన విజయం సాధించి ఫైనల్‌కి(U19 Asia Cup 2026 Final) దూసుకెళ్లింది. సెమీ ఫైనల్‌ల్లో ఆఫ్గానిస్తాన్‌ను 8 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. తొలుత బౌలింగ్ చేసిన భారత్.. ఆఫ్గాన్‌ను కట్టడి చేశారు. భారత కుర్రాళ్లు బౌలింగ్ సత్తా చాటారు. దీంతో అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. నోమన్ సలార్‌జాయ్, షా ఫైసల్ రహీమీ చెరో 51 పరుగులతో అర్ధశతకాలు సాధించారు. సుభాన్ జఖైల్ 31, సోహైల్ ఖాన్ 36 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో ఇషాన్ సూద్ మూడు వికెట్లతో అదరగొట్టగా.. ఆర్యన్ సవ్‌సానీ రెండు వికెట్లు పడగొట్టాడు.
సూపర్ బ్యాటింగ్..
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ యువ జట్టు అఫ్గాన్ నిర్దేశించిన 228 పరుగుల లక్ష్యాన్ని కేవలం 36.5 ఓవర్లలోనే ఛేదించింది. ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. దీంతో వరుసగా రెండోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. లక్ష్య ఛేదనలో కెప్టెన్ లక్ష్య రాజ్ చందాని 93 పరుగులతో సత్తా చాటాడు. అద్భుత బ్యాటింగ్‌తో భారత్‌ను విజయతీరాలకు(U19 Asia Cup 2026 Final) చేర్చాడు. ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ గెలుచుకున్నాడు. ఇక గత మ్యాచ్‌లో 160 పరుగులతో వీర విహారం చేసిన వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ .. ఈమ్యాచ్‌లో 51 పరుగులతో రాణించాడు. వీకే వినీత్ 57 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు.
ఫైనల్‌ల్లో పాక్‌తో..
తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఓడించిన పాకిస్థాన్ ఇప్పటికే ఫైనల్‌కు చేరుకుంది. దీంతో శనివారం జరిగే టైటిల్ పోరులో భారత్-పాకిస్థాన్ జట్లు(U19 Asia Cup 2026 Final) తలపడనున్నాయి. అయితే గ్రూప్ దశలో పాకిస్థాన్ చేతిలో భారత యువ జట్టుకు ఓటమిపాలైంది. ఇప్పుడు వరుస విజయాలతో ఫామ్‌లో ఉన్న భారత్ ఫైనల్లో.. దాయది దేశంపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది. గత ఆసియా కప్‌లోను పాకిస్తాన్- భారత్ జట్లు తలపడ్డాయి. అప్పుడు భారత్ ఓటమి పాలైంది. ఈసారి గెలిచి .. రెండు ఓటములకు బదులు తీర్చు కోవాలని ఆశిస్తోంది. ఆసియా కప్ టైటిల్‌ను ఈసారి ఎలాగైనా కైవసం చేసుకోవాలని భారత కుర్రాళ్లు పట్టుదలగా ఉన్నారు. మరి ఫైనల్‌లో భారత్ యువ జట్టు ఎలా ఆడుతుందో చూడాలి మరి.



