India vs Pakistan U19 Asia Cup Final

క్రికెట్‌లో చివరి బంతి వరకు పోరాడితే ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో భారత యువ క్రికెటర్లు మరోసారి నిరూపించారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా అసాధారణ పోరాటం చేసింది. ఓటమి నుంచి గట్టెక్కి ఆత్మవిశ్వాసంతో పోరాడి ఒక్క వికెట్ తేడాతో సంచలన విజయాన్ని నమోదుచేసింది. లాస్ట్ బాల్‌కి మూడు పరుగులు అవసరమైన సమయంలో మోహిత్ ఉల్వా ఫోర్ కొట్టి టీమిండియాకు కప్ అందించాడు. ఈ విజయంతో భారత్ అండర్-19 ఆసియా కప్(India vs Pakistan U19 Asia Cup Final) టైటిల్‌ను మరోసారి తన ఖాతాలో వేసుకుంది.

పాకిస్తాన్ భారీ స్కోరు..
టాస్ గెలిచిన పాకిస్తాన్‌.. తొలుత బ్యాటింగ్ చేసింది. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఉస్మాన్ ఖాన్ అద్భుతమైన బ్యాటింగ్‌తో సెంచరీ సాధించి పాక్ ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. అతడు 111 బంతుల్లో 107 పరుగులు చేశాడు. అబ్దుల్ ఖాదిర్ 54 బంతుల్లో 80 పరుగులతో మెరుపులు మెరిపించారు. కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ 60 బంతుల్లో 63 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక భారత(India vs Pakistan U19 Asia Cup Final) బౌలర్లలో కావ్య పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టి ఆకట్టుకోగా, చిగురుపాటి వెంకట మూడు వికెట్లతో రాణించాడు.

ఓపెనర్ల మెరుపులు..
338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా యువ జట్టు ఓపెనర్లు అద్భుతంగా ఆడారు. లక్ష్య రైచందాని, ఆర్యవీర్ సెహ్వాగ్ శుభారంభం అందించారు. ఇద్దరూ పాక్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ తొలి వికెట్‌కు 95 పరుగులు జోడించారు. లక్ష్య రైచందాని 101 బంతుల్లో 80 పరుగులు చేయగా, ఆర్యవీర్ సెహ్వాగ్ 61 బంతుల్లో 58 పరుగులతో అర్ధశతకాలు సాధించారు. ఓపెనర్ల అందించిన ఆరంభంతో భారత్ (India vs Pakistan U19 Asia Cup Final)లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. తర్వాత వికే వినీత్ 24 పరుగులు చేయగా, మనల్ చౌహాన్ 32 బంతుల్లో 47 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే పాక్ బౌలర్లు పుంజుకోవడంతో భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఒక దశలో 252 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది.తీవ్ర ఒత్తిడికి గురైంది. చేతిలో వికెట్లు లేకపోవడంతో టార్గెట్ భారీగా కనిపించింది. ఈ సమయంలో మనల్ చౌహాన్, మోహిత్ ఉల్వా జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ ధైర్యంగా ఆడుతూ భారత్‌ను మళ్లీ పోటీలోకి తీసుకొచ్చారు. అయితే 47.2 ఓవర్లలో జట్టు స్కోరు 309 పరుగుల దగ్గర మనల్ చౌహాన్ తొమ్మిదో వికెట్‌గా వెనుదిరగడంతో భారత శిబిరంలో మళ్లీ ఆందోళన నెలకొంది. చేతిలో ఒక్క వికెట్ మాత్రమే మిగిలింది. పాకిస్థాన్ విజయం ఖాయమనే అంచనాలు మొదలయ్యాయి.

మోహిత్ ఉల్వా అద్భుత పోరాటం
క్రీజులో ఉన్న మోహిత్ ఉల్వా అద్భుత పోరాటం చేశాడు. చివరి బ్యాటర్‌గా క్రీజులోకి వచ్చిన చిగురుపాటి వెంకటతో కలిసి వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. మోహిత్ ఉల్వా దూకుడుగా ఆడగా, వెంకట అతనికి అండగా నిలిచి విలువైన పరుగులు జోడించాడు. మోహిత్ ఉల్వా కేవలం 26 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో అజేయంగా 49 పరుగులు సాధించాడు. మరోవైపు చిగురుపాటి వెంకట ఎనిమిది బంతుల్లో రెండు ఫోర్లతో అజేయంగా 11 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఆఖరి వికెట్‌కు అజేయంగా 30 పరుగులు జోడించి భారత విజయావకాశాలను సజీవంగా ఉంచారు. మ్యాచ్‌లో అసలైన ఉత్కంఠ చివరి రెండు ఓవర్లలో మొదలైంది. విజయానికి 17 బంతుల్లో 29 పరుగులు అవసరమైన దశలో మోహిత్ ఉల్వా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఎదురుదాడికి దిగాడు. 49వ ఓవర్లో పాక్ బౌలర్ మొహమ్మద్ సయ్యమ్ బౌలింగ్‌లో మోహిత్ తొలి రెండు బంతులను వరుసగా ఫోర్, సిక్సర్‌గా మలిచాడు. నాలుగో బంతిని చిగురుపాటి వెంకట బౌండరీకి తరలించాడు. సింగిల్స్‌తో కలిపి ఆ ఓవర్లో భారత్(India vs Pakistan U19 Asia Cup Final) ఏకంగా 17 పరుగులు సాధించింది. దీంతో చివరి ఆరు బంతుల్లో విజయానికి ఎనిమిది పరుగులు అవసరమయ్యాయి.

పాక్ కొంప ముంచిన స్పిన్‌
పాక్ కెప్టెన్ చివరి ఓవర్ బాధ్యతను స్పిన్నర్ అహ్మద్ హుస్సేన్‌కు అప్పగించాడు. అప్పటికే దూకుడుగా ఆడుతున్న బ్యాటర్లకు స్పీన్‌ రూపంలో ఊపిరిపోశాడు. అయితే స్పిన్‌లో తొలి బంతికి పరుగులు రాకపోవడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. రెండో బంతి వైడ్ కావడంతో భారత్‌కు కొంత ఊరట లభించింది. ఆ తర్వాతి బంతుల్లో సింగిల్స్ రావడంతో చివరి బంతికి మూడు పరుగులు అవసరమయ్యాయి. అందరి చూపులు మోహిత్ ఉల్వాపైనే నిలిచాయి. ఒత్తిడిని అధిగమించిన అతడు చివరి బంతిని బలంగా బౌండరీకి తరలించాడు. అంతే.. భారత (India vs Pakistan U19 Asia Cup Final)శిబిరంలో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. మైదానంలో సహచర ఆటగాళ్లు పరుగులు తీస్తూ మోహిత్‌ను అభినందించారు. భుజాలపై ఎక్కించుకుని సంబరాలు చేసుకున్నారు.

తొమ్మిదోసారి ఆసియా కప్
ఫైనల్‌ల్లో అద్భుతంగా ఆడి టీమ్‌ ఇండియాకు కప్ అందించిన మోహిత్ ఉల్వాను ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు వరించింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ భారత మాజీ క్రికేటర్ సెహ్వాగ్ తనయుడు .. ఆర్యవీర్ సెహ్వాగ్ ను వరించింది. ఆసియా కప్‌ లో ఆర్యవీర్ 361 పరుగులు చేశాడు. గతేడాది ఆసియా కప్‌ ఫైనల్‌ల్లో భారత్‌ను పాకిస్తాన్ ఓడించి కప్ ఎగరేసుపోయింది. లీగ్ మ్యాచ్లోను పాకిస్తాన్‌.. భారత్‌ను ఓడించింది. ఈసారి ఆసియా కప్ గెలిచిన టీమ్ ఇండియా దాయాది దేశంపై కసి తీర్చుకుంది. ఈ గెలుపుతో టీమ్‌ ఇండియా(India vs Pakistan U19 Asia Cup Final) అండర్-19 ఆసియా కప్ చరిత్రలో తొమ్మిదోసారి టైటిల్‌ భారత్ ఖాతాలో చేరింది.