ఆసియా కప్‌లో భారత్‌కు షాక్.. పాక్ విన్
అండర్ 19 ఆసియా కప్‌లో భారత్‌కు షాక్ తగిలింది. దాయాది దేశం పాకిస్తాన్‌పై భారత్ ఓడింది. పాక్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.

India Pakistan U19 Match Result
అండర్ 19 ఆసియా కప్‌లో భారత్‌కు షాక్ తగిలింది. దాయాది దేశం పాకిస్తాన్‌పై భారత్ ఓడింది. పాక్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఒమన్‌లోని అల్ అమ్రత్ క్రికెట్ గ్రౌండ్‌లో టాస్ గెలిచి భారత్.. 208 పరుగులకు ఆలౌటైంది. యువ బ్యాటర్ అర్జున్ రాజ్‌పుత్ 85 బంతుల్లో 107 పరుగులు చేశాడు. సెంచరీతో చెలరేగాడు. 11 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో మెరుపు వేగంతో 107 పరుగులు సాధించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. సెంచరీ పూర్తయిన కాసేపటికే రిజ్వానుల్లా బౌలింగ్‌లో ఫర్హాన్ యూసఫ్‌కు క్యాచ్ ఇచ్చి అతడు పెవిలియన్ చేరాడు. వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్(22), ఆఖరిలో కావ్య పటేల్(23) పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. పాక్ బౌలర్లలో అలీ రజా 3, రిజ్వానుల్లా 3, నికాబ్ షాఫిక్ 3, సయ్యమ్ ఒక వికెట్ చొప్పున పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాక్.. భారత్ నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాక్ బ్యాటర్ హంజా జహూర్ అజేయ సెంచరీ చేశాడు. నాటౌట్‌గా నిలిచాడు. అయితే భారత పేసర్ మనల్ చౌహాన్ అద్భుతమైన స్పెల్‌తో నిప్పులు చెరగడంతో పాక్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. దీంతో పాకిస్థాన్ జట్టు కేవలం 61 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓటమి తప్పదనుకున్న దశలో క్రీజులోకి వచ్చిన హంజా జహూర్.. హస్నైన్ అబ్బాస్ దార్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వీరిద్దరూ ఆరో వికెట్‌కు 107 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను పాక్ వైపు తిప్పారు. ఫలితంగా పాకిస్థాన్ 48.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. భారత బౌలర్లలో మనల్ చౌహాన్ 3 వికెట్లు పడగొట్టగా, మోహిత్ ఉల్వా 2, ఇషాన్ సూద్, కావ్య పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.



