Mixed Gender T20 League EQUA

క్రికెట్ ప్రపంచంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటివరకు IPL, WPL లాంటి లీగ్‌లు పురుషులు, మహిళలకు వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. అయితే ఇలాంటి లీగ్‌లను క్రికెట్ పోటీలకు భిన్నంగా.. ఇకపై ఇద్దరూ ఒకే జట్టులో కలిసి ఆడే అవకాశం(Mixed Gender T20 League EQUA ) రాబోతోంది. భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ సహ-యాజమాన్యంలో మిక్స్‌డ్ జెండర్ టీ20 లీగ్ ప్రారంభం కానుంది.ఈక్వల్ (EQUAL)పేరుతో నిర్వహించనున్న ఈ వినూత్న టోర్నీ క్రికెట్ ప్రపంచంలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

జహీర్ ఖాన్ భాగస్వామ్యంతో కొత్త లీగ్
జహీర్ ఖాన్ సహ-యాజమాన్యంలోని ‘యాంకర్ స్పోర్ట్స్ ఏబీ’, జర్మన్ క్రికెట్ ఫెడరేషన్ సంయుక్తంగా ఈ లీగ్‌ను నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. వచ్చే ఏడాది ఆగస్టులో తొలి సీజన్ ప్రారంభం కానుంది. మొత్తం ఐదు జట్లు ఈ టోర్నీలో పోటీపడనున్నాయి.పురుష, మహిళా ప్రొఫెషనల్ క్రికెటర్లను ఒకే టీ20 వేదికపైకి తీసుకురావడం ఈ లీగ్ ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా యూరప్‌లో క్రికెట్‌కు మరింత ఆదరణ తీసుకురావడంతో పాటు, మహిళా క్రికెట్‌కు కొత్త అవకాశాలు కల్పించడంపై నిర్వాహకులు దృష్టి పెట్టారు.ఈ వినూత్న ప్రయత్నంపై జహీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలను ఏకం చేసే శక్తి క్రికెట్‌కు ఉందని, యూరప్ వంటి అభివృద్ధి చెందుతున్న క్రికెట్(Mixed Gender T20 League EQUA ) మార్కెట్లలో ఈ ఆటను మరింత మందికి చేరువ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ‘ఈక్వల్’ వంటి కార్యక్రమాల ద్వారా అన్ని వర్గాలకు, అన్ని లింగాల వారికి క్రికెట్‌లో భాగస్వామ్యం కల్పించవచ్చని తెలిపారు. ఇలాంటి ప్రయత్నాలు ఆట అభివృద్ధికి దోహదపడటంతో పాటు కొత్త ప్రేక్షకులను కూడా ఆకర్షిస్తాయని అభిప్రాయపడ్డారు.

లీగ్ ఫార్మాట్ ఎలా?
ఈక్వల్ లీగ్ తొలి సీజన్‌లో ఐదు జట్లు పాల్గొంటాయి. మొత్తం 12 టీ20 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ప్రతి జట్టులో 18 మంది ఆటగాళ్లు ఉండనున్నారు. అయితే మ్యాచ్ ఆడే తుది జట్టులో మహిళలు, పురుషుల సంఖ్యను ముందుగానే నిర్దేశించారు.ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆరుగురు మహిళా క్రికెటర్లు.. ఐదుగురు పురుష క్రికెటర్లు బరిలోకి దిగుతారు.మొత్తం ఐదు జట్లు ఇదేవిధంగా టోర్నీలో పోటీపడతాయి.తొలి ఎడిషన్‌లో 12 టీ20 మ్యాచ్‌లు నిర్వహిస్తారు.సాధారణ క్రికెట్(Mixed Gender T20 League EQUA ) టోర్నీలకు భిన్నంగా ఉండే ఈ మిక్స్‌డ్ జెండర్ లీగ్‌పై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. మహిళా, పురుష క్రికెటర్లకు ఒకే వేదికపై ప్రతిభను చాటుకునే అవకాశం కల్పించడం ఈ టోర్నీ ప్రత్యేకత.