BCCI 1st ODI Shifted to Visakha

ఆంధ్రప్రదేశ్‌కు, అటు ఏపీలోని క్రికెట్ ప్రియులకు బీసీసీఐ గుడ్‌ న్యూస్ చెప్పింది. భారత్, శ్రీలంక మధ్య డిసెంబర్‌లో జరగనున్న వన్డే మ్యాచ్ వేదిక మారింది. డిసెంబర్‌లో భారత్, శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్‌ను విశాఖకు షిఫ్ట్ చేసింది. టీమ్‌ ఇండియా, శ్రీలంక మధ్య జరిగే తొలి వన్డే మ్యాచ్‌ని ఢిల్లీ నుంచి విశాఖపట్నంకు(BCCI 1st ODI Shifted to Visakha) మారుస్తూ బీసీసీఐ అధికారికంగా అనౌన్స్ చేసింది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 13న యధావిధిగా ఫస్ట్ వన్డే మ్యాచ్‌ జరుగుతుందని ప్రకటించింది. కాకపోతే వెన్యూ మాత్రమే ఛేంజ్‌చేసినట్లు ప్రకటించింది బీసీసీఐ. భారత్, శ్రీలంక మధ్య తొలి వన్డే విశాఖలో జరగనుండటంతో ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన ACA-VDCA స్టేడియంలో మరోసారి టీమిండియా ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించనుంది.

మార్పు ఎందుకు..!
ఢిల్లీలో డిసెంబర్ నెలలలో మంచు విపరీతంగా కురుస్తోంది. దీపావళి దాటాక అక్కడ పొగమంచు, పొల్యుషన్‌ విపరీతంగా ఉంటుంది. అంతేకాదు అరుణ్ జైట్లీ స్టేడియంలో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) మ్యాచ్ వేదిక(BCCI 1st ODI Shifted to Visakha)ను మార్చాలని బీసీసీఐని రిక్వెస్ట్ చేసింది. దీంతో DDCA అభ్యర్థనను పరిశీలించిన బీసీసీఐ, తొలి వన్డేను విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియానికి తరలించాలని నిర్ణయించింది. దీంతో డిసెంబర్ 13న జరగనున్న తొలి వన్డేకు వైజాగ్ ఆతిథ్యం ఇవ్వనుంది.

విశాఖలో రికార్డు!
విశాఖపట్నంలోని ACA-VDCA క్రికెట్ స్టేడియం టీమిండియాకు మంచి రికార్డులు ఉన్నాయి. ఇక్కడ 3టెస్టులు, 11వన్డేలు, 5టీ20లు ఆడింది టీమ్‌ ఇండియా. ఇప్పటివరకు మొత్తం 19 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో భారత్ 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒక వన్డే టైగా ముగిసింది. విశాఖ(BCCI 1st ODI Shifted to Visakha)లో భారత్ ఇప్పటివరకు ఒక్క టెస్టు కూడా ఓడిపోలేదు. మూడు టెస్టుల్లోనూ విజయం సాధించింది. భారత్ ఆడిన 11వన్డేల్లో రెండు, 5 టీ20ల్లో రెండిట్లో ఓడింది. 2019 లో భారత్‌ వెస్టిండీస్‌ మధ్య జరిగిన వన్డేలో 5వికెట్లు నష్టానికి 387 పరుగులు చేసింది. భారత్ 107 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆమ్యాచ్‌లో రోహిత్ శర్మ 159 పరుగులు చేశాడు.

వన్డే, టీ20 షెడ్యూల్‌
భారత్‌ పర్యటనలో భాగంగా శ్రీలంక జట్టు భారత గడ్డపై మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. తొలి వన్డే డిసెంబర్ 13, ఆదివారం (మధ్యాహ్నం 2:00) – విశాఖపట్నం(BCCI 1st ODI Shifted to Visakha),
రెండో వన్డే డిసెంబర్ 16, బుధవారం (మధ్యాహ్నం 2:00) – బెంగళూరు ,మూడో వన్డే డిసెంబర్ 19, శనివారం (మధ్యాహ్నం 2:00) – అహ్మదాబాద్‌లో జరగనున్నాయి. ఇక తొలి టీ20 డిసెంబర్ 22, మంగళవారం (రాత్రి 7:00) – రాజ్‌కోట్, రెండో టీ20 డిసెంబర్ 24, గురువారం (రాత్రి 7:00) – కటక్, మూడో టీ20 డిసెంబర్ 27, ఆదివారం (రాత్రి 7:00) – పుణెలో జరగనుంది.