Arshdeep Singh T20 Record

టీమ్‌ ఇండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో 150 వికెట్లు తీసిన తొలి భారత్‌ బౌలర్‌గా రికార్డు(Arshdeep Singh T20 Record) క్రియేట్ చేశాడు. కివీస్‌తో ఈడెన్‌ పార్కులో జరిగిన ఫోర్త్‌ టీ20లో ఈరికార్డు సాధించాడు. తను వేసిన 19వ ఓవర్‌లో కివీస్‌ కెప్టెన్‌ శాంట్నర్‌ను ఔట్ చేయడంతో ఈ ఫిట్ అందుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో ఈ రికార్డు అందుకున్న 9వ ప్లేయర్‌ అర్ష్‌దీప్‌ ఉన్నాడు. టీ20లో అత్యంత తక్కువ రోజుల్లో 150 వికెట్లు అందుకున్న తొలి బౌలర్‌గా అర్ష్‌దీప్ నిలిచాడు. 2022 నవంబర్‌లో అంతర్జాతీయ టీ20ల్లోకి అర్ష్‌దీప్ సింగ్ అడుగుపెట్టాడు. కేవలం 1,577 రోజుల్లోనే ఈ ఘనత సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు శ్రీలంక స్పిన్నర్ హసరంగ పేరుమీద ఉండేది. 2,325 రోజుల్లో 150 వికెట్లు పూర్తి చేశాడు హసరంగ.

అర్ష్‌దీప్‌ 2,142 బంతుల్లో 150 వికెట్లు తీశాడు. మూడో వేగవంతమైన బౌలర్‌గా నిలిచాడు. పేసర్లలో మాత్రం అర్ష్‌దీప్‌దే (Arshdeep Singh T20 Record)అగ్రస్థానం. హసరంగ 2,035 బాల్స్‌, రషీద్‌ఖాన్‌ 2,098 బంతుల్లో ఈరికార్డు సాధించారు. బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ 2, 532 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఏడాది టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన పూర్తి సభ్యత్వ దేశాల ఆటగాడిగానూ అర్ష్‌దీప్‌ రికార్డు క్రియేట్ చేశాడు. శాంట్నర్‌ వికెట్‌తో ఈఏడాడి అర్ష్‌దీప్‌ ఖాతాలో 40 వికెట్లు యాడ్‌ అయ్యాయి.

మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌లో అఫ్గానిస్థాన్‌ ఆటగాడు రషీద్ ఖాన్ ఇప్పటి వరకు ఏ బౌలర్‌కూ సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో వికెట్ తీసి… అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు క్రియేట్‌ చేశాడు. కేవలం 120 మ్యాచ్‌లలోనే 200 వికెట్లు సాధించాడు. రషీద్ తర్వాత అదిల్ రషీద్ 171 వికెట్లతో సెంకండ్‌ ప్లేస్‌లో ఉన్నాడు.