Mumbai Indians Coaching Changes

గత నాలుగైదు సీజీన్‌లకు ముందు IPL అంటే ముంబై, చెన్నై జట్లదే హవా. ఇప్పటివరకు 19సార్లు ఐపీఎల్ టోర్నీ జరిగితే ఈ రెండు టీంలే చెరో 5 సార్లు కప్ గెలిచాయి. దీన్ని బట్టే చెప్పొచ్చు వీటి ట్రాక్ రికార్డు ఏంటో. అయితే ఈటీంలు గత నాలుగైదు సీజన్‌లుగా గతి తప్పుతున్నాయి. కనీసం ప్లే ఆప్‌కూడా చేరుకోలేని పరిస్థితిలోకి వచ్చాయి. అలా అని ప్లేయర్ల కొరతా అంటే అదీకాదు. మంచి మంచి హిట్టర్లు.. జెన్‌జీ కుర్రాళ్లు ఉన్నా .. అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని అన్నట్లుగా ఈరెండు టీంల పరిస్థితి తయారైంది. ఇలా ఉంటే కాదని ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్. మొన్నటికి మొన్న బ్యాటింగ్ కోచ్ మహేలా జయవర్దనే (శ్రీలంక మాజీ కెప్లెన్‌)ను తప్పింది. అతడి ప్లేస్‌లో ముంబై సీనియర్ ప్లేయర్ .. టాప్ హిట్టర్ కీరన్‌ పోలార్డ్‌కి ఆ బాధ్యతలు అప్పగించింది. ఇక అంతటితో ఆగకుండా బౌలింగ్ కోచ్‌ను సైతం పక్కనబెట్టింది. బెల్లెట్‌లా బంతులు వేసే శ్రీలంక మాజీ కెప్టెన్‌ మలింగ(Mumbai Indians Coaching Changes)ను సైతం తప్పింది. ఇప్పుడిదే ఐపీఎల్ క్రికెట్‌లో పెద్ద ట్రెండింగ్ టాపిక్ అయింది.

ఐపీఎల్ చరిత్రలో ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ .. తమ కోచింగ్ స్టాప్‌ విషయంలో భారీ మార్పులు చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. బౌలింగ్ కోచ్‌లైన లసిత్ మలింగ, పరాస్‌ మాంబ్రేతో పాటు ఫీల్డింగ్ కోచ్ కార్ల్ హోప్‌ కిన్‌సన్‌ను జట్టు నుంచి తప్పింది. కీరన్‌ పొలార్డ్ హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన వారం రోజుల క్రమంలోనే ఈ మార్పులు జరగడం హాట్ టాపిక్ అయింది. ముంబై ఐపీఎల్ చరిత్రలో లసిత్ మలింగ(Mumbai Indians Coaching Changes) ఐకానిక్ ఆటగాడు. ఈజట్టు నాలుగు సార్లు కప్ సాధించడంలో మలింగది కీలక పాత్ర. లసిత్ ముంబై జట్టు నుంచి తప్పుకోవడంతో ఒక శకం ముగిసినట్లైంది. ఆటగాడిగా తప్పుకున్నాక 2018 నుంచి ముంబై జట్టుకు మెంటార్‌గా, ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఇక టీమిండియా మాజీ పేసర్ పరాస్‌ మాంబ్రే కూడా ముంబై జట్టుకు సేవలందించాడు. వీరిద్దరు తప్పుకోవడంతో ముంబై టీం అఫీషియల్‌గా ప్రకటన చేసింది. జట్టుకు, ముంబై జట్టు ఫ్యామిలీకి లసిత్‌, పరాస్‌, కార్ల్‌ అందించిన సేవలకు మనస్పూర్తిగా ధన్యవాదాలు చెప్పింది. ఇక సరికొత్త టీంతో .. సరికొత్త హెడ్ కోచ్‌లతో ముంబై 2027 సీజన్‌కి రెడీ కాబోతుంది.

ఐపీఎల్‌లో ముంబై టీం తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. లేటెస్ట్‌గా స్పోర్టికో నివేదిక ప్రకారం ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీ 2.1 బిలియన్‌ డాలర్ల విలువతో ప్రపంచంలోనే అత్యంత కాస్ట్‌లీ ఐపీఎల్ జట్టుగా నంబర్‌ వన్‌ ప్లేస్‌లో నిలిచింది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 20,008 కోట్లుగా ముంబై టీం విలువ ఉంది. ఈనివేదిక ప్రకారం ముంబై ఫ్రాంచైజీ తర్వాత స్థానంలో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిలిచింది. ఈజట్టు విలువ 1.85 బిలియన్ డాలర్లు(రూ. 17,626 కోట్లు), మూడో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్‌ 1.75 బిలియన్‌ డాలర్లు(రూ. 16,674 కోట్లు), నాల్గో స్థానంలో కోల్‌కతా, 5వ స్థానంలో ఢిల్లీ, ఆరో స్థానంలో రాజస్థాన్‌, 7వ స్థానంలో SRH, 8వస్థానంలో గుజరాత్, 9వ స్థానంలో పంజాబ్ జట్లు నిలిచాయి.