ఐపీఎల్‌లో సంచలన ట్రేడ్.. పంజాబ్ దిశా, దశ మారుతుందా?
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు సంచలన ట్రేడ్ జరిగింది. అందరూ ఊహించినట్లుగానే హార్దిక్ పాండ్య పంజాబ్‌కు.. అర్ష్‌దీప్ ముంబయికి మారారు. దీనిపై ఐపీఎల్ అధికారిక ప్రకటన చేసింది.

Hardik Pandya Punjab Kings
ఐపీఎల్‌లో తొలి టైటిల్ కోసం ఎదురుచూస్తున్న పంజాబ్ కింగ్స్ .. ఈసారి ట్రోఫీని ముద్దాడాలనే కసితో కనిపిస్తోంది. జట్టును మరింత పటిష్ఠం చేసే దిశగా కీలక అడుగు వేసింది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకుంది. దీంతో పంజాబ్ టైటిల్ వేటకు కొత్త ఊపునిచ్చింది. ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన భారీ ప్లేయర్ ట్రేడ్ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ట్రేడ్‌లో భాగంగా హార్దిక్ పాండ్యా(Hardik Pandya Punjab Kings) రూ.18 కోట్ల పారితోషికంతో పంజాబ్ కింగ్స్‌కు మారగా.. పంజాబ్ కీలక పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అదే మొత్తానికి ముంబై ఇండియన్స్ జట్టులో చేరనున్నాడు.
నేనున్నా మీకు..!
పంజాబ్ జట్టులోకి స్వాగతం పలుకుతూ హార్దిక్ సోషల్ మీడియాలో ఆసక్తికర సందేశాన్ని పంచుకున్నాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కోచ్ రికీ పాంటింగ్‌తో పాటు జట్టు మొత్తానికి తాను అండగా ఉంటానంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టాడు. ‘నా కెప్టెన్ శ్రేయస్.. నా కోచ్ రికీ.. నా జట్టు.. పంజాబ్ మొత్తం.. మీ వెనక నేనున్నా’ అంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు. పంజాబ్ జెర్సీతో ఉన్న ఫొటోను కూడా అభిమానులతో పంచుకున్నాడు. ఈ వ్యాఖ్యలు పంజాబ్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఎందుకంటే హార్దిక్(Hardik Pandya Punjab Kings) కేవలం పరుగులు, వికెట్లు సాధించే ఆటగాడే కాదు.. ఒత్తిడిలోనూ జట్టును ముందుకు నడిపించగల అనుభవజ్ఞుడు. ఐదు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన అతడి అనుభవం పంజాబ్ కింగ్స్‌కు ఎంతో ఉపయోగపడనుంది.
ముంబైతో అనుబంధం
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు అందరూ ఊహించినట్లుగానే హార్దిక్ పాండ్య పంజాబ్‌కు.. అర్ష్‌దీప్ ముంబయికి మారారు. దీనిపై ఐపీఎల్ అధికారిక ప్రకటన చేసింది. దీనిపై ముంబయి ఇండియన్స్ స్పందించింది. సుదీర్ఘకాలం పాటు తమ ఫ్రాంచైజీలో కొనసాగిన పాండ్య(Hardik Pandya Punjab Kings)కు వీడ్కోలు పలికింది. ఓ వీడియో పంచుకుంది. ముంబై గొలుపోటాములనే ఈ ప్రయాణంలో.. అన్ని దశల్లోనూ ముంబయి ఇండియన్స్ కథలో నువ్వు భాగమయ్యావు. థాంక్యూ హార్దిక్ అని ఫ్రాంచైజీ రాసుకొచ్చింది. దీంతో పాటు జట్టులో కొత్తగా చేరబోతున్న అర్ష్‌దీప్‌కు స్వాగతం చెబుతూ పోస్టర్‌ను పంచుకుంది.
Through the highs, the lows, and everything in between, thank you for being a part of the Mumbai Indians story, Hardik.💙 https://t.co/pUqwrIwebi
— Mumbai Indians (@mipaltan) November 11, 2026
థాంక్యూ అర్ష్ పాజీ..!
మరోవైపు హార్దిక్ రాకపై పంజాబ్ కింగ్స్ సీఈవో సతీశ్ మేనన్ సంతోషం వ్యక్తం చేశారు. ఐపీఎల్ టైటిల్ సాధించాలనే తమ లక్ష్యానికి హార్దిక్ చేరిక ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ముంబైతో నాలుగు, గుజరాత్ టైటాన్స్‌తో ఒకటి కలిపి ఐదు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన అనుభవం హార్దిక్(Hardik Pandya Punjab Kings)కు ఉంది. ఆ విజేత మనస్తత్వం పంజాబ్‌కు కలిసొస్తుందని అభిప్రాయపడ్డారు. పంజాబ్ కింగ్స్ కూడా ఈ డీల్‌పై స్పందిస్తూ అర్ష్‌కు వీడ్కోలు పలికింది. యువ ఆటగాడి నుంచి పంజాబ్ గర్వించదగ్గ స్థాయికి ఎదిగిన ఈ ప్రయాణం అద్భుతం అని కొనియాడింది. 2019లో ఐపీఎల్‌లో నీ మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ఈ జట్టుకు ఎన్నో జ్ఞాపకాలను అందించావు.. థాంక్యూ అర్ష్ పాజీ..! నువ్వు ఎప్పటికీ మావాడివే’’ అని పంజాబ్ రాసుకొచ్చింది.
A journey we’ll always cherish, Arsh paa! 🫶
Forever our 🦁 https://t.co/Ws3Yunaya3
— Punjab Kings (@PunjabKingsIPL) November 11, 2026
రీప్లేస్ చేస్తాడా..!
మొత్తం మీద హార్ధిక పాండ్యా(Hardik Pandya Punjab Kings) 162 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 2,955 పరుగులు చేయడంతోపాటు 82 వికెట్లు పడగొట్టాడు. గుజరాత్ నుండి ముంబైకి మారాకా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 39 మ్యాచ్‌ల్లో 647 పరుగులు, 29 వికెట్లు సాధించాడు. అతడి కెప్టెన్సీలో ముంబై 2025లో ప్లేఆఫ్స్‌కు చేరగా, 2024, 2026 సీజన్లలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. మరోవైపు అర్ష్‌దీప్ 2019లో పంజాబ్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఆ జట్టు తరఫున 96 మ్యాచ్‌ల్లో 111 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. 2025 సీజన్‌లో 21 వికెట్లు, 2026లో 14 వికెట్లు పడగొట్టాడు. కొత్త బంతితో వికెట్లు తీయడంతోపాటు డెత్ ఓవర్లలోనూ బౌలింగ్ చేయగల సామర్థ్యం అతడికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.



