ఆప్‌కు ఎదురుదెబ్బ.. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు గుడ్‌బై!
పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ తగిలింది. 2027 అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన మరుసటి రోజే ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు.

Big Shock to AAP in Punjab
పంజాబ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రూలింగ్‌లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ తగిలింది. మరోసారి ఎన్నికల్లో పంజాబ్‌ను క్లీన్ చేసేందుకు రెడీ అవుతోంది చీపురుపార్టీ. 2027 అసెంబ్లీ ఎన్నికల కోసం గ్రౌండ్ వర్క్ స్టార్ చేసింది. ముందస్తుగా ప్రీపేర్ అవుతోంది. అందులో భాగంగా అభ్యర్థుల జాబితానకు సంబంధించిన ఫస్ట్ లిస్ట్‌ను విడుదల చేసింది. లిస్ట్ విడుదలైన 24 గంటల్లో ఆపార్టీకి దిమ్మదిరేగే షాక్ తగిలింది. లిస్ట్ విడుదలైన మరుసటి రోజే ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చీపురు పార్టీకి గుడ్‌బై(Big Shock to AAP in Punjab) చెప్పారు. ఆమ్ ఆద్మీలో కొనసాగలేమంటూ పార్టీకి రాజీనామా చేశారు.
ఎమ్మెల్యేలు హర్మీత్ సింగ్ పఠాన్‌మాజ్రా, చేతన్ సింగ్ జౌరామాజ్రా ఆమ్ఆద్మీకి రాజీనామా చేశారు. దీంతో ఒక్కసారిగా పంజాబ్ రాష్ట్ర రాజకీయాలు హాట్ టాపిక్ అయ్యాయి. పటియాలా జిల్లాలోని సనౌర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హర్మీత్ సింగ్ పఠాన్‌మాజ్రా, సమానా నియోజకవర్గ ఎమ్మెల్యే చేతన్ సింగ్ జౌరామాజ్రా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా(Big Shock to AAP in Punjab) చేశారు. పఠాన్‌మాజ్రా తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు పంపించారు. మరోవైపు మాజీ మంత్రిగా పనిచేసిన జౌరామాజ్రా సోషల్ మీడియా ద్వారా పార్టీకి రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు.
2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ అక్టోబర్ 31న 40 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో పఠాన్‌మాజ్రా, జౌరామాజ్రాల పేర్లు లేవు. ఈ రెండు నియోజకవర్గాలకు పార్టీ ఇంకా అధికారికంగా అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే అంతకుముందే సనౌర్‌లో రంజోద్ హదానా, సమానాలో మాజీ మంత్రి సుర్జీత్ సింగ్ రఖ్రాలకు ఈరెండు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించడం కూడా అభ్యర్థుల ఎంపికపై చర్చనీయాంశమైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు కేటాయించపోవడంతో హర్ట్ అయిన వారిద్దరూ రాజీనామా చేశారు. హర్మీత్ సింగ్ పఠాన్‌మాజ్రాకు గత కొంతకాలంగా పార్టీ నాయకత్వంతో విభేదాలు కొనసాగుతున్నాయి. మరో ఎమ్మెల్యే చేతన్ సింగ్ జౌరామాజ్రా గతంలో భగవంత్ మాన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఇద్దరు ఆమ్ఆద్మీకి గుడ్‌బై చెప్పారు. అధికారంలో ఉన్న పార్టీ.. అందులో సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామ చేయడంతో పంజాబ్‌లో రాజకీయం వేడెక్కింది. 2027 ఫిబ్రవరి–మార్చి మధ్య పంజాబ్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.



