All Partys Target Punjab Election

పంజాబ్‌పై గురి
దేశ రాజకీయాలన్నీ ఇప్పుడు పంజాబ్ వైపు టర్న్‌ తీసుకున్నాయి.  అక్కడ అధికారంలో ఉన్న ఆమ్‌ఆద్మీ పార్టీ ఇప్పటికే 2027 ఎన్నికలకు సర్వం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ముందస్తుగా  క్యాండిడేట్స్‌ను అనౌన్స్ చేసింది. మొన్న తొలి విడత అభ్యర్థుల లిస్ట్‌ అనౌన్స్ చేసింది. ఇప్పుడు సెకండ్ లిస్ట్ ప్రిపరేషన్‌లో ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నికలు జరుగుతాయని తెలుస్తోంది. తొలి లిస్ట్ అనౌన్స్ కావడమే ఆలస్యం ముగ్గురు ఎమ్మెల్యేలు ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్‌బై చెప్పారు. వెంటనే అలర్ట్ అయిన బీజేపీ వారిని ఆపరేషన్‌ ఆకర్ష్‌లో భాగంగా పార్టీలో చేర్చుకుంది. 2027 ఎన్నికలకు గ్రౌండ్ లెవల్‌లో  కేడర్‌ పెంచుకుంటూ పోతుంది. కాంగ్రెస్‌ కంచోటగా భావించే పంజాబ్‌పై మళ్లీ ఆపార్టీ గురి (All Partys Target Punjab Election )పెట్టింది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే నుంచి వెతుక్కోవాలనే కాన్‌సెప్ట్‌తో ముందుకు వెళ్తోంది. పంజాబ్‌తోనే వచ్చే సార్వత్రిక ఎన్నికలను గురి పెట్టాలని చూస్తోంది.
పంజాబ్‌ నుంచే శంఖారావం
పంజాబ్‌లో కాంగ్రెస్ ఎన్నికల సమరశంఖం పూరించింది. సంగ్రూర్‌లో నిర్వహించిన ఇన్సాఫ్ ర్యాలీ వేదికగా ఆమ్‌ఆద్మీ సర్కార్‌తో పాటు కేంద్రంపై మల్లికార్జున ఖర్గే , రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఓట్‌ చోర్‌ – గద్దె చోడ్‌ అంటూ మొన్న ఢీల్లీలో సీఈసీ జ్ఞానేష్‌కు వ్యతిరేకంగా ర్యాలీ చేసిన  కాంగ్రెస్.. లేటెస్ట్‌గా పక్క రాష్ట్రం పంజాబ్‌లో  ఇన్సాఫ్‌ ర్యాలీ నిర్వహించింది. ఓ వైపు SIR ప్రక్రియకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూనే మరోవైపు  2027లో జరుగనున్న పంజాబ్‌ అసెంబ్లీ (All Partys Target Punjab Election )ఎన్నికలపై  కాంగ్రెస్‌ ఫుల్‌ ఫోకస్‌ చేసింది.  ఏకంగా సీఎం భగవంత్ మాన్ సొంత జిల్లా సంగ్రూర్‌లో నిర్వహించిన  ఇన్సాఫ్ ర్యాలీతో  పంజాబ్‌ కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌ నింపారు రాహుల్‌ గాంధీ.
కీలక కామెంట్స్
ర్యాలీ తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో కేంద్రంపై నిప్పులు చెరిగారు రాహుల్, ఖర్గే. అదే స్థాయిలో పంజాబ్ సర్కార్‌పై కూడా మాటల దాడి చేశారు ఖర్గే ,రాహుల్‌. పంజాబ్‌లో నానాటికి డ్రగ్స్ సమస్య, నిరుద్యోగం, శాంతిభద్రతల వైఫల్యం పెరిగిపోతుందని ఆరోపించారు. లాఅండ్‌ఆర్డర్‌ విషయంలో భగవంత్‌మాన్‌ అట్టర్‌ప్లాప్‌ అయ్యారని ఆరోపించారు. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యను ప్రస్తావించారు రాహుల్‌ గాంధీ. ఆయన తండ్రిని వేదికపైకి ఆహ్వానించి, మూసేవాలాతో తన తొలి భేటీని గుర్తుచేసుకున్నారు. ఆప్‌ పాలనలో  గన్‌ కల్చర్‌ ఓ ఫ్యాషన్‌గా మారిందని, గల్లీ గల్లీలో షూటర్ల మైండ్‌సెట్ పెరుగుతోందని  విమర్శించారు రాహుల్‌. పంజాబ్‌లో  సత్తా చాటితే దేశవ్యాప్తంగా  కాంగ్రెస్‌ కు విజయావకాశాలు పెరుగుతాయని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఖర్గే. కాంగ్రెస్‌తోనే పంజాబ్‌కు మళ్లీ మంచి రోజులు వస్తాయన్నారు. పంజాబ్‌(All Partys Target Punjab Election )కు సంబంధించిన కీలక నిర్ణయాలు అన్ని కూడా ఢిల్లీ నుంచి కంట్రోల్‌ చేస్తున్నారని ఆమ్ ఆద్మీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ టార్గెట్‌గా విమర్శలు చేశారు. పంజాబ్‌ అభివృద్ధి, సంక్షేమం సహా హామీల అమలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. ఈ అంశంపై  ప్రధానితో తాను చర్చకు సిద్దమని సవాల్‌ విసిరారు రాహుల్‌.