బాలీవుడ్ నటిపై మాటల బాంబులు… ఎందుకంటే..?
Dia Mirza controversy: దీపావళి సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై ఇచ్చిన దియా మీర్జా ప్రకటనతో మొదలైన వివాదం.. సోషల్ మీడియా విమర్శలు, బీఎంసీ వీడియో తొలగింపు, రాజకీయ నేతల వ్యాఖ్యలు, చివరకు బాంబే హైకోర్టు జోక్యంతో మరింత చర్చనీయాంశంగా మారింది.

Dia Mirza controversy: బాలీవుడ్ నటి దియా మీర్జా నటించిన దీపావళి ప్రకటన ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువుగా మారింది. పర్యావరణహితంగా దీపావళి పండుగను జరుపుకోవాలంటూ ఆమె ఇచ్చిన సందేశంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసిన ఈ వీడియోపై కొంతమంది నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీపావళి సమయంలోనే పర్యావరణ పరిరక్షణ గుర్తుకొస్తుందా.. మిగతా సమయాల్లో ఎందుకు స్పందించరంటూ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో బీఎంసీ అధికారులు వెనక్కి తగ్గారు. తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ప్రచారం చేసిన దియా మీర్జా వీడియోను తొలగించారు. అయితే ఈ వ్యవహారం అక్కడితో ఆగలేదు. వీడియో తొలగింపుపై పలువురు బాంబే హైకోర్టును ఆశ్రయించడంతో వివాదం న్యాయస్థానం వరకు చేరింది.
DIA MIRZA DIWALI CAMPAIGN ROW: HIGH COURT EXPRESSES DISPLEASURE, ASKS BMC TO RE-UPLOAD VIDEO
The High Court said it was ‘disturbed’ & expresses deep pain, displeasure over the controversy that the BMC had to pull down its pollution-free Diwali campaign video featuring Dia Mirza
Important: The High court has told BMC that it is “ideal” to restore the Dia Mirza video and left it to BMC👇
— Subodh Kumar (@kumarsubodh_) November 3, 2026
దియా మీర్జా వీడియోను మళ్లీ పోస్ట్ చేయాలని హైకోర్టు సూచన
ఈ వివాదంపై స్పందించిన బాంబే హైకోర్టు ధర్మాసనం.. వీడియోను తొలగించడంపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజల్లో కాలుష్యంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో రూపొందించిన వీడియోను తొలగించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. వీడియోను తిరిగి సోషల్ మీడియాలో అందుబాటులోకి తీసుకురావాలని బీఎంసీకి సూచించింది. ఇదే సమయంలో పండుగల సందర్భంగా కాలుష్య నియంత్రణకు సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాలను కూడా న్యాయస్థానం ప్రస్తావించింది. బహిరంగ రహదారులు, వీధులు, ఫుట్‌పాత్‌లపై టపాసులు కాల్చడంపై ఆంక్షలు అమల్లో ఉన్నాయని, ప్రజలకు ఈ విషయంపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించింది.
దియా మీర్జాపై మేయర్, బీజేపీ నేతల విమర్శలు
మరోవైపు దియా మీర్జా నటించిన ప్రకటనపై ముంబయి మేయర్ రీతు తవ్డే తీవ్రంగా స్పందించారు. ఆమెను హిందూత్వ వ్యతిరేకిగా అభివర్ణిస్తూ విమర్శలు చేశారు. ముంబయి బీజేపీ అధ్యక్షుడు అమిత్ సతమ్ సైతం ఈ ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. టపాసులు కాల్చకండి.. పర్యావరణహితంగా పండుగ జరుపుకోండి అంటూ దియా మీర్జా ఇచ్చిన సందేశంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. హిందువులు దీపావళి ఎలా జరుపుకోవాలో దియా మీర్జా చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా దియా మీర్జాను భవిష్యత్తులో బీఎంసీ కార్యక్రమాలకు ఆహ్వానించబోమని, ఆమెను బ్లాక్‌లిస్ట్ చేసినట్లు కూడా ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు వివాదాన్ని మరింత తీవ్రం చేశాయి
VIDEO | Mumbai: Mayor Ritu Tawde, on the controversy over actor Dia Mirza’s pollution-free Diwali video, says, “Dia Mirza shouldn’t teach us how to celebrate Diwali. She may continue working on her selective agenda. Dia Mirza has always sided with divisive forces. She had trolled PM Modi too. She has always been anti-Hindutva.”
(Full video available on PTI Videos – https://t.co/bIyFWTfmBd)
— Press Trust of India (@PTI_News) November 2, 2026
మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ
పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన ఒక వీడియో ఇప్పుడు ముంబయి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు కాలుష్య నియంత్రణ, ప్రజారోగ్యం అంశాలను ప్రస్తావిస్తూ దియా మీర్జా తన అభిప్రాయాన్ని సమర్థించుకుంటుండగా.. మరోవైపు ఆమె సందేశంపై బీజేపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. బీఎంసీ వీడియో తొలగింపు, మేయర్ విమర్శలు, ప్రతిపక్ష నేతల ప్రశ్నలు, బాంబే హైకోర్టు జోక్యంతో ఈ వివాదం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. పండుగ సంప్రదాయాలు, పర్యావరణ పరిరక్షణ, భావప్రకటన స్వేచ్ఛ వంటి అంశాలపై ఈ వ్యవహారం మరోసారి చర్చకు తెరలేపింది. దీపావళికి ముందే ముంబయిలో రాజకీయ ఆరోపణలు ఒక్కసారిగా పేలాయి..



