Cranberry fruit: యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ ముఖ్యంగా ఆంథోసైనిన్స్, ఫ్లేవనాయిడ్స్‌తో కూడిన ఒకేవొక అద్భుతం ఫలం ఈ క్రాన్‌బెర్రీ పండు. ఇది మూత్రాశయానికి ప్రయోజనకరమైన పండు. ఇది కడుపుకు మేలు చేసే గుణాలను గల ఫలం. ఇది లివర్‌ని రక్షించే ఒక అద్భుతం. దీనికి మధుమేహ నిరోధక గుణాలు ఉన్నాయి. దీనిలో గాయం మాన్పే గుణం ఉంది. క్యాన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులను కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి ఈ పండులోని మూలకాలు అమృతాలు అని చెప్పవచ్చు. మూత్ర నాళాల ఆరోగ్యాన్ని పెంపొందించి, ఇ.కోలి వంటి హానికరమైన బ్యాక్టీరియాను మూత్ర నాళాల గోడలకు అంటుకోకుండా నిరోధించే ప్రత్యేకత క్రాన్‌బెర్రీకి ఉంది. ఒక్క మాటలో ప్రపంచంలో ఇదో ఒక అద్భుత ఫలం అనే చెప్పాలి. ఎంతో గొప్పవి అయిన ఈ క్రాన్‌బెర్రీస్ చిన్నవిగా, గుండ్రంగా ఉంటాయి. ఎరుపు రంగులో ఉంటాయి. రుచిలో కాస్త వగరుగా, పులుపుగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయి. ఆహార నిపుణులు ఇవి ఆల్‌రౌండ్ వెల్‌నెస్‌కు ఎంతో అవసరమని అంటున్నారు.

విటమిన్స్ లోపం ఉన్నవారికి మంచి ఫ్రూట్

క్రాన్‌బెర్రీస్ (Cranberry fruit) తినడానికి కాస్త పుల్లగా ఉంటాయి. కానీ ఇందులోని పోషకాలు మాత్రం అధికం. ఇంకా ఈ పండులో విటమిన్ సి, కె, మాంగనీస్, ఫైబర్ సహా ఎన్నో పోషకాలు లభిస్తాయి. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. మూత్ర నాళాల ఆరోగ్యాన్ని కాపాడటంలో క్రాన్‌బెర్రీస్ సమర్థవంతంగా పనిచేస్తాయని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన పరిశోధనలు సూచిస్తున్నాయి. వీటిలోని అధిక ఫైబర్ జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫైబర్ సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారించడంలోనూ తోడ్పడుతుంది. క్రాన్‌బెర్రీస్‌లో (Cranberry fruit) ఉండే సహజ సమ్మేళనాలు హెలికోబాక్టర్ పైలోరీ పెరుగుదలను, కడుపులోని పొరలకు ఆ బ్యాక్టీరియా అంటుకునే ప్రక్రియను నిరోధించడంలో సహాయపడవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తి సాధారణ పనితీరుకు తోడ్పడుతుంది. ఫలితంగా అంటువ్యాధులు, అనారోగ్యాలతో పోరాడటానికి శరీరానికి సహాయపడుతుంది.

క్రమం తప్పకుండా తీసుకోవాలంటున్న వైద్యులు

క్రాన్‌బెర్రీస్‌ను క్రమం తప్పకుండా సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అవసరమైన పోషకాలు (nutrition tips) అందుతాయి. అయితే, వీటిని తినడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలు తప్పకుండా తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు. నోటి ఆరోగ్యానికి ఈ ఫ్రూట్స్ చాలా మంచివని నిపుణులు చెబుతున్నారు. చిగుళ్ల వ్యాధి, దంతాలపై గార ఏర్పడటానికి కారణమయ్యే హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను క్రాన్‌బెర్రీస్‌లోని కొన్ని సహజ సమ్మేళనాలు ప్రభావితం చేయవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా, దంతాలపై బ్యాక్టీరియా పేరుకుపోవడాన్ని తగ్గించడంలోనూ ఇవి తోడ్పడవచ్చని భావిస్తున్నారు. ఈ ఒక్క ఫ్రూట్ ద్వారా మనిషి శరీరానికి అవసరమైన పోషాకాలు లభిస్తాయంటున్నారు..

క్రాన్‌బెర్రీస్‌.. ఆరోగ్యకరమైన జీవనశైలికి తోడు

క్రాన్‌బెర్రీస్‌లో ఉండే సహజ మొక్కల సమ్మేళనాలు శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడంలో, కణాల ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడవచ్చు. వీటిలోని ప్రోయాంథోసయానిడిన్లు మూత్ర నాళాల్లో కొన్ని రకాల బ్యాక్టీరియా అంటుకోకుండా నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా, ఫైబర్ జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి, విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థ సాధారణ పనితీరుకు తోడ్పడతాయి. అయితే, క్రాన్‌బెర్రీస్‌ను చక్కెర కలపకుండా లేదా తక్కువ చక్కెరతో తీసుకోవడం మంచిది. సమతుల్య ఆహారంలో భాగంగా వీటిని చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలికి మరింత మద్దతు లభిస్తుంది.