ఉసిరి చేసే మేలు ..తల్లి కూడా చేయదా?
Amla Health Benefits: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే సామెత .. ఇప్పుడు ఉసిరి విషయంలోను ఆపాదిస్తున్నారు వైద్యులు. మన శరీరానికి ఉసిరి శ్రీరామ రక్షగా నిలుస్తుందంటున్నారు.

Amla Health Benefits: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే సామెత .. ఇప్పుడు ఉసిరి విషయంలోను ఆపాదిస్తున్నారు వైద్యులు. మన శరీరానికి ఉసిరి శ్రీరామ రక్షగా నిలుస్తుందంటున్నారు. ఈవిషయంలో ఎవరో కాదు.. స్వయాన మన భారత ప్రధాని నరేంద్రమోదీ సైతం చెప్పారు. మన్ కీ బాత్లో ఉసిరి గురించి ప్రస్తావించారు. 138వ ఎపిసోడ్లో ఉసిరికాయ ప్రయోజనాలను ప్రధాని మోదీ దేశ ప్రజలకు వివరించారు. ప్రధాని మాటలతో ఇటీవల ఉసిరికి డిమాండ్ పెరిగింది. ఈ మధ్యన ఉసిరి రసాన్ని చాలామంది ఇష్టంగా తాగుతున్నారంటే అతిశయోక్తి కాదు.
ఉసిరిలో విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయని వైద్యులు చెప్పారు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఎంతో దోహదపడతాయని అధ్యయనంలో తెలిందన్నారు. ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కనుక రోగ నిరోదక శక్తి కావాల్సినంత అందుతుంది. మానవ శరీర వ్యవస్థను బలపరుస్తుంది. జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. అంతేకాదు ఉసిరి రసం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, గ్యాస్ లాంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు.. ఒత్తుగా జుట్టు పెరగాలన్నా.. చర్మం నిగనిగలాడాలన్న .. ఆరోగ్యంగా ఉండాలన్నా ఉసిరి రసం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఉసిరిలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు జుట్టును బలంగా, ఒత్తుగా పెరిగేలా చేయడంతో పాటు జుట్టు రాలడాన్ని పూర్తిగా అరికడతుందని చెప్పారు. ఈ యాంటీఆక్సిడెంట్లు చర్మంపై ముడతలను తగ్గిస్తాయని కూడా చెప్తున్నారు. అంతేకాదు బరువు తగ్గాలంటే రోజూ ఒక ఉసిరి కాయ జ్యూస్ ఒక గ్లాసు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో బరువు తగ్గడంలో ఉసిరి రసం భాగా పనిచేస్తుందని చెప్తున్నారు. ఉసిరి రసం కళ్లకు మేలు చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. రోజుకు ఒక ఉసిరి కాయ కడిగి ముక్కలుగా చేసి వాటిని మిక్సీలో వేసి.. తగినంత నీళ్లు పోసి గ్రైండ్ చేసి ..ఆ రసాన్ని వడగట్టి ఆ రసాన్ని వరుసగా 15రోజులు పరగడుపున తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. షో ఇంకేందుకు ఆలస్యం రేపటి నుంచి మీరు ట్రై చేయండి. మంచి ఫలితాలు పొందండి.



