చలికాలంలో పెరుగు తీసుకుంటే మంచిదేనా?
Curd Benefits in Winter: చలికాలంలో పెరుగు తింటే మంచిదేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. జలుబు, దగ్గు వస్తాయనేది అపోహమాత్రమే అంటున్నారు.

Curd Benefits in Winter: దీపావళి అయిపోగానే.. దేశ వ్యాప్తంగా చలికాలం స్టార్ట్ అవుతోంది. ఈసమయంలో అందరికి కొన్ని ఆహార అలవాట్లపై అనుమానాలు రేకెత్తుతాయి. ఈ సీజన్‌లో మనం రెగ్యులర్‌గా తీసుకునే పదార్థాలు తినోచ్చు. తినకూడదన్న అపోహలు తలెత్తుతాయి. అవి తింటే ఏమవుతోందో.. ఇవి తింటే ఏమవుతుందోనన్న భయంతో కడుపు కట్టేసుకుంటారు. శరీరానికి అందల్సిన పోషకాలు అందక రోగాల భారిన పడతారు. మరి ముఖ్యంగా మన దేశ వంటకాల్లో అంతర్భాగమైన పెరుగు విషయంలో అందరికి చలికాలం వచ్చేసరికి ఎక్కడ లేని అనుమానాలు మెదడుకు తడతాయి. శీతాకాలంలో పెరుగు తినొచ్చా? లేదా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. అలాంటి వారి అనుమానాలు పఠాపంచెలు చేసేలా వైద్య నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.
వ్యాధులు వస్తాయనేది అపోహ
ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్‌గా ఆహారంలో భాగం పెరుగు. అయితే చాలా మంది చలికాలం స్టార్ట్ కాగానే ఇళ్లలో పెరుగు వాడకం తగ్గిస్తారు. అసలే చలికాలం ఇప్పుడు పెరుగు( Curd) తింటే ఇంకేముంది.. జలుబు, దగ్గు దాని తర్వాత కఫం వంటి సమస్యలు తలెత్తుతాయని వారికి వారే డెసిషన్ తీసుకుంటారు. MBBS లాగా ఫీలైపోయి అది తినకూడదు.. ఇది తినకూడదని కండీషన్ష్ పెట్టుకుంటారు. అంతటితో కామ్‌గా ఉండకుండా పక్కనవాళ్లకు ఉచిత సలహాలు ఇస్తుంటారు. పెరుగు చలికాలం తినోచ్చని డాక్టర్లు కుండబద్దలు కొట్టి చెప్తున్నారు.
పెరుగు వల్ల ప్రయోజనాలు..
పెరుగు అనేది ప్రోటీన్లు, కాల్షియం, మిటమిన్ బి వంటి కీలక పోషకాల గని. ఇందులో ఉండే లైవ్ కల్చర్స్ అనే బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరుస్తోంది. పేగులను గ్యాస్, ఎసిడిటి నుంచి కాపాడుతోంది. రోగ నిరోధక శక్తిని సాధారణ స్థాయిలో ఉంచడానికి దోహదపడుతోంది. శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేస్తోంది. అంతేకాదు పళ్లు బలంగా ఉండటానికి కూడా పెరుగు మంచి పోషకం పదార్థమని చెప్తున్నారు. పెరుగు తినడం వల్ల నోటి పూత వంటి రోగాలు కూడా ధరిచేరవని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి సమతుల్య ఆహారంలో భాగంగా చలికాలంలో కూడా పెరుగును తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు చెప్తున్నారు. పెరుగు తీసుకుంటే జలుబు, దగ్గు వస్తుందనేది అపోహమాత్రమేనని కొట్టిపడేస్తున్నారు. అసలు జలుబు రావడానికి వైరస్ కారణం తప్ప.. పెరుగ కాదంటున్నారు.
ఫ్రిజ్ నుంచి తీసిన వెంటనే తినొద్దు..
అయితే పెరుగు తీసుకునే విధానంలో మాత్రం మార్పులు చేసుకోవాలని చెప్తున్నారు. ఫ్రిజ్ నుంచి తీసిన వెంటనే చల్లటి పెరుగును తింటే ఇబ్బందులు తలెత్తుతాయని.. కొంత అసౌకర్యంగా ఉంటుందని చెప్తున్నారు. అందుకే పెరుగును ఫ్రీజ్ నుంచి తీసిన తర్వాత అది రూమ్ టెంపరేచర్‌కి వచ్చాక తీసుకుంటే మంచిదని చెప్తున్నారు. (Curd Benefits in Winter) రాత్రి పూట తినడం కంటే పగటి పూట పెరుగు తీసుకుంటే మంచిదంటున్నారు. అంతేకాదు పెరుగులో కొంత వేయించిన జీలకర్ర, మిరియాల పొడి చేర్చుకుని తింటే జీర్ణక్రియ బాగా పనిచేస్తోందని సూచిస్తున్నారు. పెరుగు తినడం వల్ల జలుబు, దగ్గు రాదని.. కాకపోతే చలికాలంలో తీసుకుంటే అసౌకర్యంగా భావించేవారు తీసుకోకపోవడమే ఉత్తమం అంటున్నారు. మధ్యాహ్నం పూట మాత్రం తీసుకుంటే ఏమి కాదంటున్నారు. అంతేకాని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు.



