Bollywood Director Sanjay Gupta Die

బాలీవుడ్‌లో విషాదం నెలకుంది. ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ గుప్తా (59) మృతి చెందారు. అక్టోబర్‌ 30న రాత్రి బాత్‌రూమ్‌లో జారిపడటంతో ఆయన తలకు తీవ్ర గాయమైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. సంజయ్ గుప్తా మరణ వార్తను డైరెక్టర్‌ అశోక్‌ పండిట్‌ కన్ఫార్మ్‌ చేశారు. ఇంట్లో గాయం కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందారని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. సంజయ్ గుప్తా మృతి(Bollywood Director Sanjay Gupta Die) సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. ఆయన మృతి పట్ల బాలీవుడ్ నటీనటులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

బాలీవుడ్‌లో సంజయ్‌ గుప్తా అటు రచయితగా, డైరెక్టర్‌గా, నిర్మాతగా రాణించారు. 2025లో సంజయ్ గుప్తా ది మిరాండా బ్రదర్స్ అనే చిత్రాన్ని తీశారు. హర్షవర్ధన్‌ రాణే, మీజాన్‌ జాఫ్రీ నటించిన ఈ సినిమాను సంజయ్‌ గుప్తా(Bollywood Director Sanjay Gupta Die) డైరెక్ట్ చేశారు. అయితే గుప్తా 1994లో సినిమాల్లోకి వచ్చారు. ఆదిత్య పంచోలీ, సంజయ్‌ దత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆతిష్‌ ఫీల్‌ ద ఫైర్‌ సినిమాతో సంజయ్‌ గుప్తా సినీ రంగ ప్రవేశం చేశారు. రామ్‌ శాస్త్ర, ఖౌఫ్‌, జంగ్‌ చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు రచయితగా, నిర్మాతగానూ వ్యవహరించారు. కాంటే, కాబిల్‌, షూటౌట్‌ ఎట్‌ వడాలా వంటి సినిమాలతో సంజయ్‌ గుప్తా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. బాలీవుడ్‌లో తనకంటు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్‌ దత్‌తో .. సంజయ్‌ గుప్తాకు మంచి అనుబంధం ఉంది. వీరిద్దరి కలయికలో కాంటే, ముసాఫిర్‌, జిందా, షూటౌట్‌ ఎట్‌ లోఖండ్‌వాలా సినిమాలు తీశారు. జిందా దక్షిణ కొరియా సినిమా ఓల్డ్‌బాయ్‌కు రీమేక్‌. షూటౌట్‌ ఎట్‌ లోఖండ్‌వాలా, దస్‌ కహానియాన్‌ చిత్రాలను సంజయ్ గుప్తా ప్రొడ్యూస్ చేశారు. షూటౌట్‌ ఎట్‌ వడాలాకు దర్శకత్వం వహించి సహ నిర్మాతగానూ వ్యవహరించారు. సంజయ్ గుప్తా సినిమాలన్నీ .. ముంబై అండర్‌వరల్డ్, గ్యాంగ్‌స్టర్ల జీవితాలు ఆధారంగా రూపొందించారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, స్టైలిష్ కెమెరా పనితనం సంజయ్‌ గొప్పతనం.

1990 ప్రాంతంలో సంజయ్ గుప్తా(Bollywood Director Sanjay Gupta Die) అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో సంజయ్ దత్‌తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ మొదటిసారి సినిమా షూటింగ్ లొకేషన్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాత Thanedaar (1990) సినిమా షూటింగ్ సమయంలో పరిచయం మరింత పెరిగింది. తాను దర్శకుడిగా ఎదగడానికి సంజయ్ దత్ కీలకమైన అవకాశం ఇచ్చారని 2024లో ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజయ్ గుప్తా స్వయంగా చెప్పారు. వీరిద్దరూ కలిసి అనేక సినిమాలు చేశారు. అంతేకాదు.. వీరిద్దరూ కలిసి White Feather Films నిర్మాణ సంస్థను కూడా నడిపారు.