జ్ఞానేశ్ తర్వాత మోదీ, షాలే టార్గెట్. రాహుల్ గాంధీ మాస్ వార్నింగ్!
ఢిల్లీ రామ్లీలీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జ్ఞానేశ్ కుమార్ తర్వాత మీ వంతే మోదీజీ అంటూ ప్రధానిని ఉద్దేశించి హెచ్చరించారు.

Rahul Warns Modi, Shah
ఢిల్లీ రామ్లీలీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జ్ఞానేశ్ కుమార్ తర్వాత మీ వంతే మోదీజీ అంటూ ప్రధానిని ఉద్దేశించి హెచ్చరించారు. జ్ఞానేశ్ కుమార్ లేకపోతే అసలు మోదీ ప్రధాని, అమిత్ షా(Rahul Warns Modi, Sha) హోంమంత్రి అయ్యేవారే కాదని విమర్శించారు. జ్క్షానేశ్ కుమార్ చేసిన మోసం వల్లే వారిద్దరూ ఈరోజు పదవుల్లో ఉన్నారని ఆరోపించారు. అందుకే మొదట జ్ఞానేశ్ కుమార్ని పదవి నుంచి తొలగించి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఆ తర్వాత తమ పోరాటం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. 2024 ఎన్నికల తర్వాత దేశంలోని 15 శాతం మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారని.. ఆ ఎన్నికలు చట్టవిరుద్ధంగా జరిగాయన్నారు. ప్రజల తీర్పును దొంగిలించారని ఆరోపించారు. ఓటర్ల పేర్ల తొలగింపు దేశద్రోహంతో సమానమని, ఇది అత్యంత తీవ్రమైన కేసుల్లో ఒకటని అభివర్ణించారు. ఈ ఆరోపణలకు ఎన్నికల సంఘం వెల్లడించిన గణాంకాలే ఆధారమని చెప్పారు.
ఓట్ చోరీపై ప్రతిపక్షాలు చేసే ఆందోళలతో ప్రధాని మోదీ, అమిత్ షా,(Rahul Warns Modi, Sha) సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాత్రుళ్లు నిద్రపోలేకుండా పోతుందని రాహుల్ ఎద్దేవా చేశారు. వాళ్లు దేశానికి ఆత్మలాంటి రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై దాడి చేశారని.. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించే ప్రసక్తే లేదన్నారు. ప్రజాస్వామ్యాన్నీ ఖూనీ చేస్తున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తప్పించుకోలేరని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశ వ్యవస్థ మొత్తం కేవలం ఇద్దరు, ముగ్గురు చేతుల్లోనే ఉండటాన్ని దేశ ప్రజలు కోరుకోవడం లేదన్నారు రాహుల్ గాంధీ. దేశాన్ని గాడిలో పెట్టాలంటే మొట్టమొదటగా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను తప్పించి జైలుకు పంపడమే మార్గం అన్నారు రాహుల్ గాంధీ.
దేశంలో ఓటు చోరీకి పాల్పడ్డ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను కాపాడేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కేంద్రంతో పాటు అనేక రాష్ట్రాల్లో ప్రజాతీర్పును చోరీ చేసి బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారం అడ్డుపెట్టుకుని ఈడీ వంటి సంస్థలతో విపక్షాలను భయపెట్టేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారనని ఫైర్ అయ్యారు. ఈడీలు మోడీలకు భయపడతాయేమో మేముమాత్రం భయపడే ప్రసక్తే లేదన్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసేవరకు పోరాటం ఆపేదేలేదన్నారు. యూపీ ద్వారా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీని త్వరలోనే గద్దె దించుతామని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. యూపీ ఓటర్లు బీజేపీకి వీడ్కోలు పలికేందుకు రెడీ ఉన్నారని చెప్పారు. ప్రతి లాఠీ దెబ్బకు తదుపరి తరం ప్రతీకారం తీర్చుకుంటుందని హెచ్చరించారు. SIR బాధిత రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అని TMC అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. ఓటు చోరీతో మోసాలకు పాల్పడిన బీజేపీని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. త్వరలోనే మళ్లీ ప్రజాస్వామ్యాన్ని తిరగ రాస్తామని చెప్పారు. జ్ఙానేశ్ కుమార్ రాజీనామా కోసం బెంగాల్ ప్రజలు ఎదురుచూస్తున్నారని మమతా విమర్శించారు.



