Padikkal Umpiring Controversy

భారత్‌- న్యూజిల్యాండ్ మధ్య జరుగుతున్న అనధికార తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయం తీవ్ర వివాదానికి దారి తీసింది. భారత్‌ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 199 వ్యక్తి గత పరుగుల దగ్గర బాల్ టచ్ కాకపోయినా.. అంపైర్ తప్పుడు నిర్ణయం ఇచ్చాడు. ఔట్‌గా ప్రకటించాడు. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్‌ గురయ్యారు. ఒకవైపు పడిక్కల్‌ కూడా వాటీజ్‌ దిస్‌.. అంటూ అసహనం(Padikkal Umpiring Controversy) వ్యక్తం చేశాడు. కష్టాల్లో ఉన్న భారత్‌ను చక్కని బ్యాటింగ్‌తో నిలబెట్టిన పడిక్కల్‌.. ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. లెగ్‌ సైడ్ పడిన బంతిని ఆడేందుకు పడిక్కల్ ప్రయత్నించాడు. అది మిస్ అయింది. అంపైర్ మాత్రం ఎడ్జ్‌ తీసుకుందని భావించి ఔట్ ఇచ్చేశాడు. దీంతో పడిక్కల్ తీవ్ర అసహనంతో గ్రౌండ్‌లో నుంచి వెళ్లిపోయాడు. అంపైర్ తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తున్నాయి.

కివీస్‌ గడ్డపై తొలిటెస్ట్‌లో ఓటమి తప్పుదనుకన్న పరిస్థితిలో భారత్ A జట్టు .. న్యూజిలాండ్‌కు షాక్‌ ఇచ్చింది. ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ప్రధాన బ్యాటర్లు విఫలమైనా .. యువ ఆటగాళ్లు మాత్రం సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. దేవదత్‌ పడిక్కల్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 10రన్స్‌కే ఓపెనర్లు అవుట్ అయిన్ పరిస్థితిలో పడిక్కల్ మాత్రం 248 బంతులు ఎదుర్కొని 199 పరుగులు చేశాడు. అందులో 24 ఫోర్లు, 3సిక్స్‌లు బాదాడు. మరోవైపు పడిక్కల్‌కి సాయి సుదర్శన్ అండగా నిలిచాడు. 184 బంతుల్లో 91 పరుగులు చేశాడు. కాస్తలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. వీరిద్దరి భాగస్వామ్యం 216. సుదర్శన్ అవుటయ్యాక.. యశ్ రాథోడ్‌తో కలిసి పడిక్కల్(Padikkal Umpiring Controversy) ఇన్నింగ్ నడిపించాడు. వీరిద్దరు 142 పరుగులు జోడించారు. యశ్ రాథోడ్ 66 పరుగులు చేశాడు. తర్వాత పడిక్కల్ తోపాటు యశ్ అవుట్ అయ్యారు. అన్షుల్ కాంబోజ్ 23, అకిబ్ నబీ 38 పరుగులతో వాషింగ్టన్ సుందర్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈక్రమంలో సుందర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో టీమ్ ఇండియా 500 పరుగులకు చేరువగా వచ్చింది. న్యూజిలాండ్ A జట్టుతో జరుగుతున్న అనధికార మ్యాచ్‌లో పటిష్టంగా నిలిచింది. మూడో రోజు ఆట ముగిసే సరికి భారత్ 8వికెట్ల నష్టానికి 488 పరుగులు చేసింది. క్రీజ్‌లో సుందర్‌తో పాటు ఆకాశ్‌ దీప్ ఉన్నారు. ప్రస్తుతం 284 పరుగుల ఆధిక్యంలో ఉంది భారత్. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ 317 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 113 లకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టి 488 పరుగులు చేసింది. ఇక నాలుగో రోజు త్వరగా ఇన్నింగ్స్ డిక్లర్ చేసి. కివీస్‌ను లక్ష్య ఛేదనకు ఆహ్వానిస్తారమో చూడాలి. చివరి రోజు మ్యాచ్‌కి వాన గండం పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది.