నీటి వృథాపై నిరంతర నిఘా.. యాప్‌తో జలమండలి కొత్త ప్లాన్
హైదరాబాద్ సిటీలో నీటి వృధాను అరికట్టేందుకు హైదరాబాద్ జలమండలి ప్రత్యేక చొరవ తీసుకుంది. నీటి దుర్వినియోగాన్ని అరికట్టేలా ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా పానీ యాప్‌ను ప్రారంభించింది

Paani App Hyderabad
సూపర్ ఎల్‌నినోను తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. రానున్న గడ్డుకాలన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే అధికారులు నీటి వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. మరిముఖ్యంగా హైదరాబాద్‌లో రానున్న రోజుల్లో తీవ్ర నీటి తీవ్రత ఏర్పడే అవకాశం ఉందని అధికారులు ఇప్పటికే ముందస్తు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా సిటీలో నీటి వృధాను అరికట్టేందుకు హైదరాబాద్ జలమండలి ప్రత్యేక చొరవ తీసుకుంది. నీటి దుర్వినియోగాన్ని అరికట్టేలా ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా పానీ యాప్‌ను(Paani App Hyderabad ) ప్రారంభించింది.
పానీ యాప్ ద్వారా సిటీలో నీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకే యాప్ తీసుకొచ్చినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అధికారుల ద్వారా అన్నిచోట్ల పర్యవేక్షణ సాధ్యం కాదని .. అందుకే ప్రజలను కూడా భాగస్వామ్యం చేసేందుకు యాప్ తీసుకువచ్చినట్లు తెలిపారు. పానీ యాప్ ద్వారా ప్రతి ఒక్కరు సేవ్ వాటర్ వలంటీర్‌గా మారొచ్చని చెప్పారు. యాప్‌లో ప్రతి ఒక్కరూ వలంటీర్‌గా నమోదుచేసుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఈయాప్ (Paani App Hyderabad )ద్వారా వలంటీర్లు ఫిర్యాదు చేస్తే జలసంరక్షణ చేసినట్లేనని తెలిపారు. క్టిష్ట సమయాల్లో సమాజం బాగోగు కోసం ప్రతి ఒక్కరు నడుంబిగించాలని పొన్నం పిలుపునిచ్చారు. నీటి సంరక్షణకు పాటుపడాలని సూచించారు.
ఇప్పటికే నగరంలో జలసంరక్షణపై అధికారులు ఎన్నిసార్లు అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ప్రజలు అందుకుతగ్గనట్లు నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు. మరిముఖ్యంగా హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసినప్పుడు ఎవరూ జల సంరక్షణ చేయడం లేదని .. అందువల్లే భూగర్భ జలాలు అడుగంటి పోయాయన్నారు మంత్రి పొన్నం. భూగర్భజాలాలు పెంచుకునే బాధ్యత ఇకనుంచి ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కోరారు. దీని కోసం ప్రతి ఇల్లు, ప్రతి అపార్ట్మెంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రూల్స్ అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఫైన్లు వేసి ప్రజలను వేధించాలనే ఉద్దేశం ప్రభుత్వానిక లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రజల బాగుకోసమే ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. నీటి పొదుపుపై అవగాహన కల్పించడమే ఈయాప్(Paani App Hyderabad ) ముఖ్య ఉద్దేశమన్నారు.
ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో తీవ్ర పరిస్థితిపై భట్టి అధ్యక్షతన బుధవారం అఖిలపక్షం సమావేశం జరిగింది. ఈభేటీకి పలువురు మంత్రులతోపాటు ఉన్నతాధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రంలో ఉన్న కరువు పరిస్థితులపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన సహాయాన్ని సాధించుకునేందుకు అవసరమైతే అన్ని పార్టీల నేతలతో కలిసి అఖిలపక్ష బృందంగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలుస్తామని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు.



