Bharat Summit Controversy

హైదరాబాద్‌లో జరిగే భారత్ సమ్మిట్‌ ఇప్పుడు కేంద్రం, తెలంగాణ రాష్ట్రం మధ్య వివాదానికి దారితీసింది. భారత్‌ సమ్మిట్‌లో పాల్గొనేందుకు విదేశాలకు చెందిన వక్తల్లో 115 మందికి భారత్‌లోకి ప్రవేశం నిరాకరించారంటూ కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ విమర్శించారు. మరికొందరి వీసాలు రద్దు చేసినట్లు వెల్లడించారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకే ఇలా జరిగిందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో విమర్శలను సైతం సహించలేని పరిస్థితి నెలకొందంటూ కేంద్ర ప్రభుత్వంపై(Bharat Summit Controversy) విమర్శలు గుప్పించారు.

దావోస్ సదస్సు ఆర్థిక అంశాలకు ఎలా వేదికగా మారిందో, భారత్ సమ్మిట్ రాజకీయ, సామాజిక, ఆర్థిక సమానత్వ అంశాలకు అలాంటి వేదికగా మారలనే లక్ష్యంతో హైదరాబాద్‌ వేదికగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో మూడు రోజుపాటు భారత్‌ సమ్మిట్‌ ఏర్పాటు చేసింది. గురువారం నుంచి శనివారం వరకు ఈసమ్మిట్‌ జరగనుంది. చివరిరోజు సమ్మిట్‌కు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే హాజరువుతున్నారు. సమ్మిట్‌లో పాల్గొనేందుకు వచ్చిన శశిథరూర్‌ ఎక్స్‌ వేదికగా(Bharat Summit Controversy) కేంద్రంపై ఆరోపణలు చేశారు. విదేశాంగ శాఖ అనుమతి ఇచ్చిన 315 మంది వక్తల్లో 115 మందికి ప్రవేశం నిరాకరించడం… వీసాలు రద్దు చేయడం జరిగిందన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ చట్ట నిబంధన కింద ఇలాంటి నిర్ణయం తీసుకుందో స్పష్టత లేదని ప్రశ్నించారు. ప్రపంచం నుంచి విమర్శలు వస్తాయనే భయంతో గొంతులు నొక్కడం సిగ్గుచేటన్నారు.

ప్రగతి శీల రాజకీయ పార్టీలు, మేధావులు, పౌర సమాజ ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ భారత్‌ సమ్మిట్‌ ఉద్దేశం. అంతర్జాతీయ రాజకీయాలతో పాటు, సామాజిక, ఆర్థిక విధానాలపై ఈ సమ్మిట్‌లో చర్చలు జరుగుతాయి. ఇదో అంతర్జాతీయ సదస్సు కావడంతో మోడీ సర్కార్‌ దీనిపై సీరియస్‌ నజర్ పెట్టింది. దాదాపు వెయ్యి మంది దాకా విదేశీ ప్రతినిధులు అతిథులుగా సమ్మిట్‌కు హాజరు కానున్నారు. ఇందులో వంద మందికిపైగా విదేశీయుల వీసాలను ఆకస్మికంగా కేంద్ర మంత్రిత్వ శాఖ రద్దు(Bharat Summit Controversy) చేయడం అందిరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇది అంతర్జాతీయ చర్చకు తెర తీసింది.