Midterm Election Defeat ..Trump Voice Very Low

అమెరికాలో అనుకున్నదే జరిగింది. చరిత్ర తిరగరాస్తాడని భావించిన అమెరికా అధ్యక్షడు మధ్యంతర ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డాడు. ఒంటెద్దు పోకడతో పోతున్న ట్రంప్‌ రెండు చెంపలకు లెప్ట్‌ అండ్ రైట్ ఇచ్చారు అమెరికా ప్రజలు. హామీలకు అనుగుణంగా కాకుండా నీరో చక్రవర్తిలా పరిపాలన సాగిస్తున్న ట్రంప్‌కు అమెరికా ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఓటర్లు రిపబ్లికన్ పార్టీకి గట్టి గుణపాఠం చెప్పారు. మధ్యంతర ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు. ఫలితాల తర్వాత మాట్లాడిన ట్రంప్ వాయిస్‌లో బేస్‌ (Midterm Election Defeat ..Trump Voice Very Low)తగ్గింది. ఫలితాలకు ముందు డెమోక్రాట్లు ప్రవేశపెట్టే ప్రతీ బిల్లును వీటో చేస్తానని గర్జించిన అధ్యక్షుడు ట్రంప్ వాయిస్ టోన్‌ మారింది. ఘోర పరాజయం తర్వాత స్వరాన్ని సవరించుకున్నాడు. దేశ శ్రేయస్సు కోసం డెమోక్రాట్లతో కలిసి పనిచేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఎన్నికల్లో డెమోక్రాట్లు ట్రంప్‌ అంచనాలకు మించి ప్రతినిధుల సభ, సెనెట్ రెండింటినీ కైవసం చేసుకోవడంతో ట్రంప్ గొంతు సవరించుకున్నారు.

భారీ ఓటమి
ఈ ఎన్నికల్లో తాను బ్యాలెట్‌పై లేను, ఒకవేళ ఉండుంటే మేము భారీ మెజారిటీతో గెలిచేవాళ్లమని తనకు తాను గొప్పలు చెప్పుకున్నాడు. 435 స్థానాల్లో ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు 256 సీట్లు గెలుచుకునే అవకాశం కనబడుతోంది. అలాగే 100 మంది సభ్యులున్న సెనెట్‌లో కనీసం 54 స్థానాలు దక్కించుకుని స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించారు. ధరలు తగ్గిస్తానని, ప్రజల జీవితాలను సులభతరం చేస్తానని 2024 ఎన్నికల్లో ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన ట్రంప్, ఆ తర్వాత ఆ హామీలను పక్కనపెట్టారు. అమెరికాను గొప్పగా మార్చేందుకు టారిఫ్‌లు విధించడం, ఇరాన్‌లో ప్రభుత్వ మార్పు కోసం యుద్ధానికి దిగడం, వైట్‌హౌస్ సుందరీకరణ వంటి భారీ ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ఇవే ట్రంప్ పట్ల ఓటర్లు వ్యతిరేకత(Midterm Election Defeat ..Trump Voice Very Low)) చూపడానికి కారణమయ్యాయి.

పట్టు తప్పుతోంది
రిపబ్లికన్లకు కంచుకోటలైన టెక్సాస్, కాన్సాస్, దక్షిణ కరోలినా వంటి రాష్ట్రాల్లో పార్టీ ఓటమి పాలుకావడం ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు. కాన్సాస్‌లో 95 ఏళ్ల రిపబ్లికన్ల గుత్తాధిపత్యానికి తెరదించుతూ డెమోక్రాట్ అభ్యర్థి ఆడమ్ హామిల్టన్ సెనెటర్‌గా గెలిచారు. టెక్సాస్ గవర్నర్‌గా హినా హినోజోసా ఎన్నికవడంతో 36 ఏళ్ల రిపబ్లికన్ పాలనకు ముగింపు పడింది. ట్రంప్ స్వయంగా ఎంపిక చేసిన అభ్యర్థులు సైతం ఓడిపోవడం ఆయనకు వ్యక్తిగతంగా(Midterm Election Defeat ..Trump Voice Very Low) పెద్ద ఎదురుదెబ్బ. ఈ ఓటమితో పార్టీపై ట్రంప్ పట్టుకోల్పోతున్నాడని ఆయనను వ్యతిరేకించే వారి సంఖ్య పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధ్యక్షుడిగా మిగిలిన రెండేళ్లలో ఆయన దూకుడుకు కళ్లెం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఫలితాల తర్వాత రాబోయే రెండేళ్లలో ట్రంప్ పాలన ఎలా సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది.