అభిమానమా.. అరాచకమా..
ప్రముఖ నటి కీర్తి సురేశ్ తనకు జరిగిన ఓ చేదు అనుభవాన్ని తెలియజేశారు. తనకు ఎప్పుడూ అభిమానులతో ముచ్చటించడం .. చాలా సరదా అని చెప్పారు. కాని ఓ సందర్భంలో తనను ఓ అభిమాని ఇబ్బందిపెట్టాడని తెలిపారు.

Keerthy Suresh Fan Incident
ఇటీవల కాలంలో సినీ నటుల పట్ల అభిమానుల దురుసు ప్రవర్తన ఆందోళన కలిగిస్తోంది. నటుల పట్ల అభిమానుల దురుసు ప్రవర్తన అనేది చర్చనీయాంశంగా మారుతోంది. సెల్ఫీల కోసం ఎగబడటం, భద్రతా సిబ్బందిని తోసుకుంటూ వెళ్లడం, నటీనటులను ఇబ్బంది పెట్టడం వంటి ఘటనలు తరుచూ జరగుతున్నాయి. ఆమధ్య నటి నిధి అగర్వాల్ ది రాజా సాబ్ పాట విడుదల కార్యక్రమానికి వెళ్లినప్పుడు అభిమానులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. దీంతో ఆమె కారువద్దకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఘటనపై నిర్వాహకులు, మాల్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అభిమానుల అత్యుత్సాహం, అనుచిత ప్రవర్తనతో సినీ తారలు పలు సందర్భాల్లో ఇబ్బంది పడుతున్నారు. తాజాగా ప్రముఖ నటి కీర్తి సురేశ్ తనకు జరిగిన ఓ చేదు అనుభవాన్ని(Keerthy Suresh Fan Incident) తెలియజేశారు. తనకు ఎప్పుడూ అభిమానులతో ముచ్చటించడం .. చాలా సరదా అని చెప్పారు. కాని ఓ సందర్భంలో తనకు చేదు అనుభవమే ఎదురైందన్నారు.
తన భర్త ఆంటోని థట్టిల్తో కలసి మిలాన్ నుంచి భారత్కు తిరిగి వస్తుండగా ఓ అభిమాని తనన ఇబ్బందికి గురి చేసినట్లు చెప్పింది. ఫ్టైట్లో ఓవ్యక్తి మద్యం మత్తులో పదే పదే సెల్ఫీ కోసం తనను అసౌకర్యానికి గురిచేశాడని చెప్పింది. సెల్ఫీ అడిగాడు కదాఅని నిల్చుంటే అతడు మద్యం మత్తులో సరిగా నిలబడలేని స్థితిలో ఉండి తనను ఇబ్బందిపెట్టాడని తెలిపింది. కాసేపు ఆగమని చెప్పినా.. అతడు వినిపించుకోకుండా, ఇప్పుడే సెల్ఫీ తీసుకుంటానంటూ తనను ఒత్తిడికి(Keerthy Suresh Fan Incident) గురిచేశాడని కీర్తి తెలిపారు. తీరా నాకు కోపం వచ్చి ఫోటో ఎప్పుడు తీసుకోవాలన్నది మీరు కాదు.. నేను నిర్ణయించాలని అన్నట్లు చెప్పారు. అయినా అతడు వినిపించుకోక పోవడంతో చివరకు తన భర్త కల్పించుకుని అతడిని వారించాడు. కాని అతడిలో మార్పు రాకపోవడంతో.. ఫైనల్గా తాము విమాన సిబ్బంది దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లామని తెలిపింది. ఇలాంటి ఫ్యాన్స్ ఎదురైనప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుందని చెప్పారు. అయితే తనతో చాలామంది ఫ్యాన్స్ సరదాగా మాట్లాడాతారని.. కొందరు సెల్ఫీలు కూడా అడగరని.. చెప్పారు కీర్తి సురేష్.



