సంక్రాంతికి కాకాగా వస్తున్న చిరు.. ఆటో జానీ గుర్తు చేస్తూ మాస్ ట్రీట్
Kaka Movie Release Date Announced: బాక్సాఫీస్ బద్దలయ్యే సమయం వచ్చేసింది.. కాకా సినిమాకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవి స్వయంగా అప్డేట్ ఇచ్చారు. జనవరి 13న థియేటర్లలోకి పక్కాగా వస్తుందని ప్రకటించారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

Kaka Movie Release Date Announced: మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. ఆయన తెరపై కనిపిస్తే చాలు.. థియేటర్లలో ఈలలు, కేకలు మామూలుగా ఉండవు. ఇక మాస్ అవతార్‌లో కనిపిస్తే బాక్సాఫీస్ దగ్గర సందడి ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గత కొంతకాలంగా మెగాస్టార్ అభిమానులను ఒక ప్రశ్న తెగ వేధిస్తోంది. అసలు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాకా సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది.. విడుదల తేదీ ఎప్పుడు ప్రకటిస్తారు.. అంటూ ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ ప్రశ్నలకు మెగాస్టార్ స్వయంగా సమాధానమిచ్చారు. సంక్రాంతి బరిలోకి వస్తున్నట్లు స్పష్టం చేస్తూ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.
ఆటో జానీ గుర్తున్నాడా.. మెగాస్టార్ మాస్ అవతార్‌పై ఆసక్తి
తాజాగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను పంచుకున్నారు. ఆటో జానీ గుర్తున్నాడా ఈ సంక్రాంతికి సరికొత్తగా కాకాతో వస్తున్నాడ అంటూ ఇచ్చిన క్యాప్షన్ ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆటో జానీ అనే పేరు వినగానే మెగాస్టార్ అభిమానులకు ఆయనలోని పక్కా మాస్ యాంగిల్ గుర్తుకొస్తోంది. గతంలో చిరంజీవి పోషించిన మాస్ పాత్రలను గుర్తుచేస్తూ ఇప్పుడు మరోసారి అలాంటి ఎనర్జీతో ప్రేక్షకులను అలరించబోతున్నారనే అంచనాలు మొదలయ్యాయి. కొత్త సినిమాలోని తన పాత్రకు సంబంధించిన మాస్ లుక్‌ను పరిచయం చేస్తూ చిరంజీవి ఆ పేరును ప్రస్తావించారు. దీంతో ఈసారి మెగాస్టార్ నుంచి ఎలాంటి వినోదం ఉండబోతోందన్న ఆసక్తి పెరిగింది.
<
పోస్టర్‌లో మెగాస్టార్ లుక్ అదుర్స్
తాజాగా విడుదలైన పోస్టర్‌లో చిరంజీవి లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బ్రౌన్ కలర్ షర్ట్, బ్లాక్ టీ షర్ట్, కార్గో ప్యాంట్, స్టైలిష్ సన్ గ్లాసెస్‌తో మెగాస్టార్ సరికొత్త మేకోవర్‌లో కనిపిస్తున్నారు. నడుముకు తుపాకీ పెట్టుకుని, చేతులకు రిస్ట్ బ్యాండ్స్ ధరించి ఎంతో స్టైలిష్‌గా దర్శనమిచ్చారు. ఆయన బాడీ లాంగ్వేజ్, నిలబడిన తీరు, ముఖంలో కనిపిస్తున్న కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఈ సినిమాలో మాస్ యాక్షన్‌కు ప్రాధాన్యత ఉండబోతోందనే అభిప్రాయం కలుగుతోంది. పోస్టర్ వెనుక కనిపిస్తున్న వ్యక్తుల ఛాయలు కూడా సినిమా కథపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. మొత్తానికి చిరంజీవి ఈసారి సరికొత్త గెటప్‌తో అభిమానులను పలకరించేందుకు సిద్ధమయ్యారు.
బాబీతో మరోసారి మాస్ మ్యాజిక్
చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కాకా. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన వాల్తేరు వీరయ్య ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు మరోసారి మెగాస్టార్‌ను మాస్ యాక్షన్ అవతార్‌లో చూపించేందుకు బాబీ సిద్ధమయ్యారు. కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ కలగలిపిన కథతో చిరంజీవిని కొత్త కోణంలో చూపించబోతున్నట్లు ప్రచార చిత్రాలు అంచనాలను పెంచుతున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి రెండు విభిన్నమైన షేడ్స్‌లో కనిపించనున్నారనే ఆసక్తి నెలకొంది. ఒకవైపు సాధారణ వ్యక్తిగా, మరోవైపు స్టైలిష్ యాక్షన్ అవతార్‌లో ఆయన కనిపించనున్నారనే ప్రచారం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, అనస్వర రాజన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రియమణి, నివేదా థామస్, సునీల్, మురళీ శర్మ, గెటప్ శ్రీను తదితరులు కూడా సినిమాలో భాగమయ్యారు. తమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అభిమానుల ఎదురుచూపులకు తెర.. జనవరి 13న థియేటర్లలోకి
ఇప్పటివరకు సినిమా విడుదల తేదీ కోసం ఎదురుచూసిన అభిమానులకు మెగాస్టార్ ప్రకటనతో స్పష్టత వచ్చింది. కాకా చిత్రాన్ని 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో మెగాస్టార్ అభిమానుల సంక్రాంతి సందడి ఇప్పటి నుంచే మొదలైనట్లయింది. చిరంజీవి సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ దగ్గర సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ సంక్రాంతి సీజన్, బాబీ దర్శకత్వం, తమన్ సంగీతం, మెగాస్టార్ మాస్ అవతార్.. ఇవన్నీ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఇన్నాళ్లూ విడుదల తేదీ కోసం ఎదురుచూసిన అభిమానులకు ఇప్పుడు మెగాస్టార్ స్వయంగా గుడ్‌న్యూస్ చెప్పారు. మరి జనవరి 13న కాకాగా థియేటర్లలోకి అడుగుపెట్టనున్న చిరంజీవి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హంగామా సృష్టిస్తారో చూడాలి..



