Jayesh Ranjan VRS

తెలంగాణలో ఐఏఎస్‌ అధికారి జయేశ్‌ రంజన్‌ వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారన్న వార్త ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.మరో ఏడాది పాటు సర్వీసులో కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ, ముందుగానే పదవీ విరమణ చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వానికి వీఆర్‌ఎస్‌ దరఖాస్తు సమర్పించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఐటీ, పారిశ్రామిక రంగాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్‌ ఐఏఎస్‌ సెడన్‌గా ఈనిర్ణయం ఎందుకు తీసుకున్నారనే టాక్ నడుస్తోంది. ఈయన తదుపరి అడుగుపై రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.ముఖ్యంగా ప్రభుత్వ సర్వీసు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన సొంతంగా కన్సల్టెన్సీ(Jayesh Ranjan VRS) సంస్థను ప్రారంభించనున్నారనే ప్రచారం అధికార, పారిశ్రామిక వర్గాల్లో వినిపిస్తోంది. హైదరాబాద్‌లో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలని భావించే దేశీయ, అంతర్జాతీయ కంపెనీలకు సలహాలు, సూచనలు అందించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యంగా ఉండవచ్చని తెలుస్తోంది. అయితే, కన్సల్టెన్సీ ఏర్పాటుపై ఇప్పటివరకు జయేశ్‌ రంజన్‌ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఈ ప్రచారంలో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

కన్సల్టెన్సీపై ఆసక్తి!
తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకునే సంస్థలకు ప్రభుత్వ విధానాలు, పారిశ్రామిక అనుమతులు, పెట్టుబడుల ప్రక్రియ, వ్యాపార విస్తరణకు సంబంధించిన అంశాల్లో మార్గదర్శకత్వం అందించే దిశగా ఆయన ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ను తమ తదుపరి వ్యాపార కేంద్రంగా ఎంచుకునే కొత్త కంపెనీలకు స్థానిక వ్యాపార వాతావరణం, ప్రభుత్వ వ్యవస్థలు, పెట్టుబడుల అవకాశాలపై అవగాహన కల్పించడం ఈ కన్సల్టెన్సీ(Jayesh Ranjan VRS) కార్యకలాపాల్లో భాగం కావచ్చని సమాచారం. ప్రభుత్వ పాలనలో, ముఖ్యంగా ఐటీ, పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణ రంగాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న జయేశ్‌ రంజన్‌ కన్సల్టెన్సీ రంగంలోకి వస్తే ఆయన అనుభవం ఉపయోగపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఐటీ రంగంలో ప్రత్యేక గుర్తింపు
1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి జయేశ్‌ రంజన్‌ తన సుదీర్ఘ పరిపాలనా ప్రస్థానంలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కడప, గుంటూరు, మెదక్‌ జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. జిల్లా స్థాయి పరిపాలన నుంచి రాష్ట్రస్థాయి విధాన రూపకల్పన వరకు వివిధ విభాగాల్లో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆయనకు ఐటీ, పరిశ్రమల శాఖల్లో కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ శాఖల కార్యదర్శిగా పనిచేసిన సమయంలో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, హైదరాబాద్‌ను అంతర్జాతీయ ఐటీ గమ్యస్థానంగా మరింత అభివృద్ధి చేయడం, స్టార్టప్‌ వ్యవస్థను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు.ముఖ్యంగా టీ-హబ్‌ వంటి ప్రతిష్ఠాత్మక స్టార్టప్‌ ప్రోత్సాహక సంస్థల ఏర్పాటులో ఆయన పాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది. యువ పారిశ్రామికవేత్తలకు అవకాశాలు కల్పించడం, కొత్త ఆవిష్కరణలకు వేదికలు ఏర్పాటు చేయడం, ప్రపంచ స్థాయి కంపెనీలతో తెలంగాణకు సంబంధాలు పెంపొందించడం వంటి అంశాల్లో ఆయన పనిచేశారు. అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో చర్చలు(Jayesh Ranjan VRS) జరపడం, పెట్టుబడిదారులకు రాష్ట్రంలోని అవకాశాలను వివరించడం, ప్రభుత్వ విధానాలను పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్లడం వంటి బాధ్యతల్లోనూ ఆయనకు విశేష అనుభవం ఉంది. ఈ అనుభవమే భవిష్యత్తులో ఆయన ప్రైవేటు రంగంలోకి అడుగుపెడితే కీలకంగా మారవచ్చనే చర్చ సాగుతోంది.

ఏడాది ముందే ఎందుకు..!
జయేశ్‌ రంజన్‌ సాధారణ పదవీ విరమణ తేదీ 2027 సెప్టెంబర్‌ 30వరకు ఉంది. ఇంకో ఏడాది ప్రభుత్వ సర్వీసులో కొనసాగేందుకు అవకాశం ఉంది. అయినప్పటికీ, దాదాపు ఏడాది ముందుగానే వీఆర్‌ఎస్‌ కోరుతూ దరఖాస్తు సమర్పించినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఐటీ, పారిశ్రామిక రంగాల్లో కీలక పాత్ర పోషించిన జయేశ్‌ రంజన్‌ వీఆర్‌ఎస్‌ దరఖాస్తు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రభుత్వ సర్వీసుకు వీడ్కోలు పలికిన తర్వాత ఆయన కన్సల్టెన్సీ(Jayesh Ranjan VRS) రంగంలోకి అడుగుపెడతారా? హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని కొత్త వ్యాపార ప్రయాణం ప్రారంభిస్తారా? లేక మరో రూపంలో ప్రజా, పారిశ్రామిక రంగాలకు సేవలందిస్తారా? అన్నది వేచి చూడాలి.