ఫ్లిప్‌కార్ట్‌కు కల్యాణ్ కృష్ణమూర్తి గుడ్‌బై .. 11 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు!
భారత ఈ-కామర్స్ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో నాయకత్వ మార్పు జరగనుంది. ఆసంస్థ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో ఫ్లిప్‌కార్ట్‌లో ఆయన 11 ఏళ్లకు సుదీర్ఘ ప్రయాణానికి తెరపడనుంది.

Flipkart CEO Kalyan Krishnamurthy
భారత ఈ-కామర్స్ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో నాయకత్వ మార్పు జరగనుంది. ఆసంస్థ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో ఫ్లిప్‌కార్ట్‌లో ఆయన 11 ఏళ్లకు సుదీర్ఘ ప్రయాణానికి తెరపడనుంది. కల్యాణ్ కృష్ణమూర్తి నాయకత్వంలో ఫ్లిప్‌కార్ట్ అనూహ్యమైన వృద్ధి సాధించింది. కంపెనీ వ్యాపారం ఐదింతలకు పైగా విస్తరించింది. దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను బలోపేతం చేసుకోవడంతో పాటు, వినియోగదారులు, విక్రయదారులకు ఉపయోగపడే అనేక కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ నిర్వహించే ‘ది బిగ్ బిలియన్ డేస్’ సేల్కు దేశవ్యాప్తంగా భారీ ఆదరణ లభించింది. దీంట్లో ఆయన నాయకత్వం(Flipkart CEO Kalyan Krishnamurthy) కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఈ సేల్ భారత పండుగల షాపింగ్ సీజన్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
కృష్ణమూర్తి సేవలు అమోఘం
వ్యాపార విస్తరణకే పరిమితం కాకుండా సంస్థలో పారదర్శకత, నైతిక విలువలు, పాలనా ప్రమాణాలు, కార్యకలాపాల క్రమశిక్షణకు కల్యాణ్ ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన హయాంలో ఫ్లిప్‌కార్ట్ భారత డిజిటల్ వాణిజ్య రంగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.కల్యాణ్ కృష్ణమూర్తి (Flipkart CEO Kalyan Krishnamurthy)వైదొలగడంపై వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, సీఈఓ క్రిస్ నికోలస్ ప్రశంసలు కురిపించారు. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు వాల్‌మార్ట్ ఎదుగుదలలోనూ కల్యాణ్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.ఆయన నాయకత్వం, సంస్థలో ప్రవేశపెట్టిన ఉన్నత పాలనా ప్రమాణాలు, కంపెనీకి అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. ఫ్లిప్‌కార్ట్ భవిష్యత్తుపై తమకు పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేశారు.
ఎంతో గర్వంగా ఉంది
తన సుదీర్ఘ ప్రయాణంపై కల్యాణ్ కృష్ణమూర్తి భావోద్వేగంగా స్పందించారు. ఫ్లిప్‌కార్ట్ ఎదుగుదలలో భాగస్వామి కావడం తనకు ఎంతో గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. కంపెనీ సాధించిన వ్యాపార వృద్ధి ఎంత సంతోషాన్ని ఇస్తుందో, ఆ వృద్ధిని నైతిక విలువలు, సమగ్రత, ఉన్నత పాలనా ప్రమాణాలతో సాధించడం అంతకంటే ఎక్కువ గర్వంగా ఉందన్నారు. తన ప్రయాణంలో తోడుగా నిలిచిన ఉద్యోగులు, విక్రయదారులు, వ్యాపార భాగస్వాములందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఫ్లిప్‌కార్ట్‌కు బలమైన పునాది ఉందని, సంస్థ భవిష్యత్తు ఎంతో ఆశాజనకంగా ఉందని కల్యాణ్(Flipkart CEO Kalyan Krishnamurthy) విశ్వాసం వ్యక్తం చేశారు.

