Aishwarya Rai Fitness Secrets

ప్రపంచ సుందరీ, బాలీవుడ్‌ నటి ఐశ్వర్యారాయ్‌ తాజాగా 53 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. నవంబర్ 1న ఆమె పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు.. ఈవయస్సులో ఆమె అందంగా.. ఫిటెనెస్‌గా(Aishwarya Rai Fitness Secrets) ఉండడానికి గల కారణాలను చెప్పారు. తన అందం, తన ఫిటెనెస్ వెనుక ఉన్న సీక్రెట్ అభిమానులకు రివీల్ చేశారు. తానేమి కాస్ట్లీ ఫుడ్ తీసుకోనని చెప్పారు.

పప్పు,అన్నమే ఇష్టం..

ఇంట్లో వండే ఆహారం తినడమే తన గ్లామర్ రహస్యమని చెప్పారు ఈప్రపంచ సుందరీ. అంతేకాదు ఆమె పాటించే కొన్ని హెల్త్ ట్రిప్స్ అభిమానులకు షేర్ చేశారు. మొదటగా ఆహారం విషయానికి వస్తే.. తనకు ఇంట్లో వండే పప్పు, అన్నం, కూరగాయల వంటి సంప్రదాయ ఆహారమే ఇష్టమని చెప్పారు. ఉదయం లేవగానే.. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకొని తాగుతానని తెలిపారు. టిఫిన్ మాత్రం అసలు స్కిప్‌ చేయనన్నారు. బ్రౌన్‌ బ్రెడ్‌ టోస్ట్‌, ఓట్స్‌ వంటి పీచు పదార్థాలు, ప్రొటీన్లు ఉండే ఆహారాన్ని టిఫిన్ రూపంలో తీసుకుంటానని తెలిపారు.

నో జంక్ ఫుడ్..

ఇక మధ్యాహ్నం లంచ్‌లో పప్పు, చపాతీ, ఉడికించిన కూరగాయలకు ఎక్కువగా తీసుకుంటానని చెప్పారు. అన్నం, పప్పు, కూరలతో కూడిన సాధారణ భారతీయ భోజనం తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. అది కూడా లిమిటెడ్‌గా తీసుకుంటానని తెలిపారు. ఇక రాత్రిపూట తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకుంటానని చెప్పారు. బ్రౌన్‌ రైస్‌, గ్రిల్డ్‌ ఫిష్‌, ఉడికించిన కూరగాయలు వంటి పదార్థాలు డిన్నర్‌లో ఉండేలా చూసుకుంటానన్నారు. రోజంతా ఒకేసారి ఎక్కువగా తినకుండా చిన్న చిన్న పరిమాణాల్లో ఆహారం తీసుకోవడం తన అలవాటనిచెప్పారు. జంక్ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటానని చెప్పారు. నూనెలో వేయించిన పదార్థాలు, జంక్‌ ఫుడ్‌ మ్యాగ్జిమం అవైడ్ చేస్తానని చెప్పారు. వాటి కంటే తాజా పండ్లు, కూరగాయలు, నట్స్‌ ఎక్కువగా తీసుకుంటానని చెప్పారు. ఇక రోజులో కావాల్సినంత వాటర్ తీసుకుంటానని.. యోగా, వాకింగ్, జిమ్ కు ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. ఇవే తన అందానికి, ఫిట్‌నెస్‌(Aishwarya Rai Fitness Secrets)కి ముఖ్య కారణమని తెలిపారు.