ఆఫ్టర్ డైటింగ్ మళ్లీ వెయిట్ పెరిగారా? ఇవే కారణాలు..
After Dieting Weight Gain: ఎంతో శ్రమపడి బరువు తగ్గినా.. మళ్లీ పెరుగుతున్నారా.. అయితే మనం చేసే చిన్న పోరపాట్లే కారణం కాదు.. హార్మోన్ల ప్రభావం కూడా ఉంటుంది. వైద్యుల సలహాలతో నియమాలు పాటిస్తే .. మళ్లీ ఆతప్పు జరగదు.

After Dieting Weight Gain : మనిషి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. పెరుగులు పెడుతున్న ప్రపంచం మనుషులు సృష్టే కదా. షో మనిషి ఏదైనా సాధించాలంటే అది పెద్ద పనేమీ కాదు. ఒక్కసారి మైండ్లోకి వచ్చేందంటే బైండ్గా దూసుకుపోతాడు. సక్సెస్ అయ్యేవరకు దీక్షతో పనిచేస్తాడు. తీరా అనుకున్నది సాధించాక.. కొంత బద్దకిస్తాడు. ఆతర్వాత మళ్లీ యాధామాలవుతోంది. ఇదే అందరూ చేసే పొరపాటు. అయితే ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు బరువు పెరడగం షరామాములైంది. మారుతున్న జీవనశైలి .. దీనికి ముఖ్య కారణం. ఈమాటే ఏ డాక్టర్ దగ్గకు వెళ్లినా చెప్పే మొదటి వాఖ్యం. అలా డాక్టర్ చేప్పారో లేదో.. వెంటనే డైట్ కంటిన్యూ చేస్తాం. బొమ్మరిల్లు సినిమాలో డైలాగ్ లాగా.. వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీలాగా.. మనం కూడా వీలైతే ఉదయం, సాయంత్రం జిమ్.. లేదంటే వాకింగ్ చేస్తాం. ఆహార నియమాలు మన టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు నెలలు తరబడైనా డైటింగ్ కంటిన్యూ చేస్తాం. బిర్యానీలు, చికెన్లు, మరీ రిచ్ అయితే ఫిజ్జాలు, బర్గర్లు మానేస్తాం. కిందమీదపడి ఎట్టకేలకు బరువు కంట్రోల్లోకి తెస్తాం. హమ్మయ్యా అని ఎంతో సంతోషిస్తాం.
ప్రతీ ఒక్కరు చేసే తప్పు ఇదే..!
ఇప్పుడే అందరూ పప్పులో కాలేస్తారు. ఇక బరువు కంట్రోల్లోకి వచ్చింది కాదాని చిన్నగా రిలాక్స్ అవుతారు. ఇంతకు ముందులా కాకుండా చిన్నచిన్నగా వ్యాయామం చేయడం తగ్గిస్తారు. మనకు ఇష్టమతేనో.. లేదంటే పక్కవాళ్లు ఫోర్స్ చేస్తేనో డైట్లో ఉన్నప్పుడు వదిలేసిన ఆహార పదార్థాలు మళ్లీ మెల్లమెల్లగా లాగించేస్తాం. కొంచెం కొంచెంగా తినడం ప్రారంభిస్తారు. ఇది కొందరి లెక్క. అయితే మరికొందరు మాత్రం అలాగే అదే లెగసీ కంటిన్యూ చేస్తారు. అదే డైట్ ఫాలో అవుతారు. అయినా కొంతకాలానికి తగ్గిన బరువు మళ్లీ పెరగడం స్టార్ట్ అవుతోంది. దీంతో మనం చేసిన ప్రయత్నంలో ఎక్కడో లోపం ఉందని భావిస్తారు. ఏం చేయాలో తెలిక ఆందోళన చెందుతారు. వెంటనే మళ్లీ తీవ్ర కసరత్తులు చేస్తారు. అలా చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. తగ్గిన బరువు పెరగడానికి హార్మోన్లలో మార్పులు కారణం అంటున్నారు. బరువు తగ్గాక.. శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులు, ఆకలి పెరగడం శక్తి వినియోగం తగ్గడం వల్ల మళ్లీ వెయిట్ పెరగడానికి కారణం కావచ్చని వైద్యులు చెబుతున్నారు.
హార్మోన్ల ప్రభావం కావచ్చు!
మనం చేసిన హెవీ డైట్ వల్ల మన బాడీలో ఉన్న ఫ్యాట్ తగ్గి.. లెప్టిన్ అనే హార్మోన్ స్థాయిలు పడిపోతాయంటా. ఇది మెదడుకు శరీరంలో ఉన్న శక్తి గురించి సంకేతాలిస్తుంది. దీని స్థాయిలు తగ్గితే ఆకలి మళ్లీ పెరుగుతోంది. ఆకలిని పెంచే గ్రెలిన్ హార్మోన్ స్థాయి కూడా రెట్టింపు అవుతోంది. దీంతో తిన్నా కూడా కడుపు నిండిన భావన తగ్గి.. మళ్లీ తినాలనిపిస్తోంది. బరువు తగ్గినప్పుడు శరీర పరిమాణం తగ్గుతోంది. రోజువారీ పనులకు అవసరమయ్యే కేలరీలు కూడా తగ్గుతాయి. కొందరిలో శరీరం అంచనా వేసిన దాని కంటే తక్కువ శక్తిని వినియోగించేలా మారుతుంది. ఈమార్పును అడాప్టివ్ థర్మోజెనెసిస్ అంటారు. ఫలితంగా బరువు తగ్గడం, తగ్గిన బరువును అలాగే ఉంచుకోవడం కష్టమవుతుందని చెప్తున్నారు నిపుణులు.
ఎక్కువ శ్రమ లేకపోవడం!
కేలరీలను మరీ ఎక్కువగా తగ్గించడం, ఎక్కువసేపు ఆహారం తీసుకోకపోవడం, కొన్ని ఆహార పదార్థాలు కంప్లీట్‌గా మానేయడం వల్ల అలసట పెరుగుతుందని చెప్తున్నారు వైద్యనిపుణులు. రోజువారీ పనులు, నడక వంటి శారీరక కదలికలు తగ్గడం.. ఖర్చయ్యే కేలరీలు కూడా తక్కువ కావడం .. తగినంత ప్రొటీన్ తీసుకోకపోవడం, కండాలకు వ్యాయమం లేకపోవడం వల్ల కండరాల పరిమాణం తగ్గుతోంది. నిద్రలేమీ, ఒత్తిడి, రోజువారీ అలవాట్లలో మార్పుతు కూడా బరువు మళ్లీ పెరగడానికి కారణమవుతాయంట. షో ..అయితే బరువు తగ్గాలనుకునే వాళ్లు కొన్ని నియమాలు పాటిస్తే సరిపోతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఒకేసారి ఎక్కువ బరువు తగ్గాలని కాకుండా పోషకాలు అందే ఆహారంతో నెమ్మదిగా కొవ్వు తగ్గించుకోవడం ఉత్తమం అని చెప్తున్నారు. వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి ఎక్సర్సైజులు చేయడంతో పాటు కండరాలను పెంచే వ్యాయామం చేయాలంటున్నారు డాక్టర్లు. తగినంత ప్రొటీన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. కంప్లీట్‌గా ఒత్తిడిని దూరం చేసుకుని.. మంచి నిద్రపోతూ, హార్మోన్లు పెరుగుతుంటే డాక్టర్లను సంప్రదిస్తే మళ్లీ బరువు పెరిగే అవకాశాలు ఉండవని చెప్తున్నారు నిపుణులు.



