కామెంట్స్ కల్లోలం.. నోటీసులు తప్పవా?
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇటీవల చేసిన కామెంట్స్‌పై టీపీసీపీ చీఫ్ మహేష్ గౌడ్ సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలను సీరియస్‌గా పరిగణిస్తున్నామని .. ఈ వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీకి అప్పగిస్తామని స్పష్టం చేశారు.

Telangana Congress May Issue Disciplinary Notice
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి కామెంట్స్ కాంగ్రెస్‌కి తలనొప్పిగా మారాయా? అంటే అవుననే తెలుస్తోంది. ఇటీవల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏకంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ని ఆగ్రహం తెప్పించాయి. అనిరుధ్ రెడ్డి ఇటీవల చేసిన కామెంట్స్‌పై టీపీసీపీ చీఫ్ మహేష్ గౌడ్ సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలను సీరియస్‌గా పరిగణిస్తున్నామని .. ఈ వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీకి అప్పగిస్తామని స్పష్టం చేశారు. దీంతో అనిరుధ్‌రెడ్డికి రెండు మూడు రోజుల్లోనే నోటీసులు(Telangana Congress May Issue Disciplinary Notice) జారీ చేసే అవకాశం ఉందని సూచించారు.
ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి.. బిల్లుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. జడ్చర్లలో నేను చస్తేనే బిల్లులు వస్తాయంటే .. నియోజకవర్గ అభివృద్థి కోసం చావడానికైనా సిద్ధమంటూ కామెంట్స్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు అన్నారంటే ఒక అర్థం ఉంటుంది. కాని అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ఇటువంటి కామెంట్స్ చేయడం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉంది. దీంతో అధిష్టానం సీరియస్ అయింది. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఎవరు వ్యవహారించినా ఊరుకునేదే లేదని.. క్రమశిక్షణా చర్యలు(Telangana Congress May Issue Disciplinary Notice) తప్పవని హెచ్చరించారు. నిధుల కొరత ఒక్క జడ్చర్లలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఉందని.. ఇలా మాట్లాడం సరికాదని మహేష్ గౌడ్ హితవు పలికారు. ఈ అంశాన్ని పార్టీ క్రమశిక్షణ కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తోందన్నారు.
సోమవారం రాజాపూర్ మండలం కల్లేపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో మాట్లాడుతూ వివిధ అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులో ఆలస్యం జరుగుతోందంటూ ప్రభుత్వంపై ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు చేశారు. నా ప్రాణం పోతేనే బిల్లులిస్తారా? అని ప్రశ్నించారు. అవసరమైతే ప్రభుత్వంపై పోరాడైనా బిల్లులు మంజూరు చేయించి అసంపూర్తి పనులు పూర్తి చేయిస్తానని ప్రకటించారు. రోడ్లకు నిధులు మంజూరు చేసి కొబ్బరికాయ కొట్టిపోయిన నా గురువు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జడ్చర్లలో పాదయాత్ర చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను అడుగుతున్నా.. వెంటనే రూ. 40 కోట్ల పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే జడ్చర్లలో 30వేల మందితో ఆమరణ నిరాహర దీక్షకు కూర్చుంటానని హెచ్చరించారు. అందులో నేను చనిపోయినా సరే .. ఆతర్వాతైనా జడ్చర్లకు నిధులివ్వండి .. నేను బతకాలో వద్దో.. ప్రభుత్వమే నిర్ణయించాలంటూ అనిరుధ్‌రెడ్డి కామెంట్స్ చేశారు.
ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి చేసిన ఈవ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఏకంగా అధికారపార్టీ ఎమ్మెల్యేనే ఇలా మాట్లాడం ఏంటని చర్చించుకుంటున్నారు. ప్రతిపక్షాలకు ఊతం ఇచ్చేలా అధికార పార్టీల నాయకులు మాట్లాడం కరెక్ట్ కాదని పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. వెంటనే క్రమశిక్షణ కమిటీ పరిశీలించాలని కోరింది. దీంతో రేపో, మాపో అనిరుధ్‌రెడ్డి నోటీసులు రానున్నాయి. నోటీసుల(Telangana Congress May Issue Disciplinary Notice)కు ఆయన ఎలాంటి వివరణ ఇస్తారనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. అయితే అనిరుధ్ రెడ్డి ఇలా మాట్లాడం కొత్తమే కాదు. గతంలోను కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తే.. వాటికి సపోర్ట్‌గా మాట్లాడారు. పవన్ కల్యాణ్ విషయంలోను పలుసార్లు ఘాటుగా స్పందించారు.



