RS Praveen Kumar Interview

రేవంత్‌రెడ్డికి సవాల్
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. తెలుగు పాపులర్ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి, బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు.అమరవీరుల ఆస్తులు తరగిపోతున్నాయి.. బీఆర్ఎస్ నేతల ఆస్తులు పెరుగిపోతున్నాయంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఆరోపణలు చేయడం కాదు.. దమ్ముంటే విచారణ చేయించాలని ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. అంతేకాదు అమరవీరుల సంక్షేమం విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తున్న నేపథ్యంలో అమరవీరుల కుటుంబాల కోసం ప్రభుత్వం ఏం చేసిందని నిలదీశారు(RS Praveen Kumar Interview). తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వారి కుటుంబాల సంక్షేమానికి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో.. ఎన్ని జీవోలపై సంతకాలు చేశారో చూపించాలని సూటిగా ప్రశ్నించారు.

ఓటు బ్యాంకుగా వాడుకున్నారు!
బీసీ, ఎస్సీ వర్గాల విషయంలో కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకున్నారని ఆరోపించారు. బీసీలకు న్యాయం చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.కాంగ్రెస్ చేసిన కులగణనతో రాష్ట్ర ప్రజలకు, బీసీలకు ఎలాంటి ప్రయోజనం చూకూరదని(RS Praveen Kumar Interview) ఆరోపించారు. ఇంకా కాంగ్రెస్ ఉన్న అగ్రకుల నాయకులు.. ఎస్సీ, ఎస్టీలను ఎదగనివ్వకుండా వారి చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూస్తున్నారంటూ విమర్శలు చేశారు.

ఎస్సీ, ఎస్టీ మంత్రులు, ఎమ్మెల్యేలపై సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఎస్సీ, ఎస్టీ మంత్రులు, ఎమ్మెల్యేల పాత్రపైనా ప్రవీణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో వారికి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని, కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని ఆరోపించారు. అధికారంలో ఉన్న కొందరి ప్రాధాన్యత ప్రజాసేవ కంటే దోపిడీకే పరిమితమైందంటూ విమర్శించారు.ప్రశ్నించేవారే లేకుండా పోయారని విమర్శించారు.మరోవైపు సిద్దిపేట పర్యటన అంశాన్ని కూడా ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar Interview) ప్రస్తావించారు. సీఎం రేవంత్‌రెడ్డి సిద్దిపేటకు వెళ్లడానికి భయపడుతున్నారని, ఒంటరిగా వెళ్లలేక పెద్ద సంఖ్యలో మందిని, మార్బాలన్ని వెంట తీసుకెళ్లారని విమర్శించారు.

సీఎంను బీజేపీ కాపాడుకుంటోందా?
కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ సంబంధాలు కొనసాగుతున్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.కేసుల విషయంలో రేవంత్‌రెడ్డిని బీజేపీ ప్రొటెక్ట్ చేస్తోందన్నారు. బీఆర్ఎస్ సాక్ష్యాలతో సహా కాంగ్రెస్ నేతల అవినీతిపై కంప్లైంట్ చేసినా చర్యలు తీసుకోవడం లేదని.. తాము చేసే కంప్లైంట్ కాపీలను చెత్తబుట్టలో(RS Praveen Kumar Interview) వేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ తప్పులను పదేపదే ఎత్తిచూపుతున్న తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

రాజగోపాల్‌రెడ్డి బీఆర్ఎస్‌లోకి వస్తారా?
కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత పార్టీ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై కూడా పాపులర్ టీవీకి ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి వస్తారా? అనే ప్రశ్నపై ఆయన ఆసక్తికరంగా స్పందించారు. ఆయన బీఆర్ఎస్‌లోకి వస్తారా లేదా అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని,తనదగ్గర సమాచారం లేదన్నారు. ఇదే క్రమంలో బీజేపీపై విమర్శలు గుప్పించారు ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar Interview). అక్షింతల పేరుతో తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, రాజకీయంగా చేసిన ప్రచారంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్‌ను వీడుతున్నారా?
ఇటీవల బీఆర్ఎస్ ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీడుతున్నారనే ప్రచారం నేపథ్యంలో పాపులర్ టీవీ యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పష్టమైన సమాధానం చెప్పారు. బీఆర్ఎస్‌ను వీడాలనే ఆలోచన తనకు లేదన్నారు. బీఆర్ఎస్‌లో తనకు పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. తన ఆంకాంక్షలకు అనుగుణంగా పార్టీ నడుచుకుంటోందని చెప్పారు. అలాగే తనకు ముందుకుగానే ఎదో పెద్ద పదవులపై ఆశలేదని.. ఫస్ట్ ఎమ్మెల్యేగాని ఎమ్మెల్సీగా గాని అసెంబ్లీలో అడుగుపెట్టాలనే ఆశ ఉందన్నారు. అంతేకాదు.. తనను ఆదరించిన సిర్పూర్‌ (RS Praveen Kumar Interview)నుంచి మళ్లీ పోటీచేయాలనే భావనలో ఉన్నట్లు చెప్పారు. ముఖ్యంగా బీఆర్ఎస్‌లో తన భవిష్యత్తుపై ఆయన చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.