Indiramma Sarees Distribution

తెలంగాణలో మహిళల సంక్షేమానికి రాష్ట్రం కృషి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మరోసారి చీరల కానుక అందించేందుకు సిద్ధమైంది. ‘ఇందిరా మహిళా శక్తి’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలను పంపిణీ(Indiramma Sarees Distribution ) చేయనుంది. ఈ కార్యక్రమాన్ని నవంబర్ 26న నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే చీరల తయారీ, జిల్లాలకు తరలింపు, పంపిణీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈసారి మహిళలకు ఆకర్షణీయమైన చిలుకపచ్చ రంగు చీరలను అందించనుంది రేవంత్ సర్కార్.

కోటి మందికి చీరలు
ప్రభుత్వం రూపొందించిన పంపిణీ ప్రణాళిక ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కోటి మంది మహిళలకు చీరలు అందించనున్నారు. ఇందులో గ్రామీణ ప్రాంతాలకు చెందిన 65 లక్షల మంది మహిళలు, పట్టణ ప్రాంతాలకు చెందిన 35 లక్షల మంది మహిళలు ఉన్నారు. రేషన్ కార్డు లేదా ఆహార భద్రత కార్డు కలిగిన కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన మహిళలను అర్హులుగా గుర్తించారు. మహిళల అభిరుచులను దృష్టిలో పెట్టుకుని చిలుకపచ్చ(Indiramma Sarees Distribution ) రంగులో చీరలను రూపొందించారు. ఆధునిక డిజైన్లతో పాటు సంప్రదాయ శైలికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు.ఈసారి పంపిణీ చేయనున్న కోటి చీరలను రెండు రకాలుగా తయారు చేశారు. 95 లక్షల పాలిస్టర్ చీరలు.. ఒక్కో చీర పొడవు 6.30 మీటర్లు. 5 లక్షల పాలీ-కాటన్ చీరలు అవి ఒక్కో చీర పొడవు 9 మీటర్లు ఉండనున్నాయి.

చేనేత కార్మికులకు ఉపాధి
ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు చీరలు అందించడంతో పాటు తెలంగాణ చేనేత రంగానికి ప్రోత్సాహం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. సిరిసిల్లతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నేత కార్మికులకు చీరల(Indiramma Sarees Distribution ) తయారీ బాధ్యతలు అప్పగించారు.దీంతో పెద్ద మొత్తంలో చీరల తయారీ ఆర్డర్లు లభించడంతో నేత కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. మహిళా సంక్షేమంతో పాటు స్థానిక చేనేత పరిశ్రమకు ఆర్థికంగా చేయూత అందించడం కూడా ఈ కార్యక్రమంలోని మరో ముఖ్య ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంటోంది.

చీరల పొందడానికి ఏం తీసుకెళ్లాలి?
అర్హులైన మహిళలు తమ గ్రామాలు, పట్టణ వార్డుల్లో ఏర్పాటు చేసే పంపిణీ కేంద్రాల దగ్గర చీరలను తీసుకోవచ్చు. రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు వివరాలు సమర్పించాలి. పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో లబ్ధిదారుల వివరాలను నమోదు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సెర్ప్ (SERP) సిబ్బంది, పట్టణ ప్రాంతాల్లో సంబంధిత సిబ్బంది ప్రజాప్రతినిధుల సమక్షంలో వార్డుల వారీగా చీరలను(Indiramma Sarees Distribution ) పంపిణీ చేయనున్నారు.జిల్లా కలెక్టర్లు, జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు.

కొత్త చేయూత పెన్షన్
మరోవైపు నవంబర్ 26న తెలంగాణలో కొత్త చేయూత పెన్షన్ లబ్ధిదారులకు కూడా ప్రభుత్వం శుభవార్త అందించనుంది. కొత్తగా ఎంపికైన 4,63,857 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ డబ్బులను జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఒకే రోజు మహిళలకు ఇందిరమ్మ చీరల (Indiramma Sarees Distribution )పంపిణీతో పాటు కొత్త పెన్షన్ లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం కూడా జరగనుంది. మొత్తంగా నవంబర్ 26న తెలంగాణలో మహిళా సంక్షేమానికి సంబంధించిన రెండు కీలక కార్యక్రమాలు జరగనున్నాయి.