RGV on Rapthadu School Attack

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాప్తాడులోని జెడ్పీ హైస్కూల్‌లో చదువుతున్న ఓ విద్యార్థినిపై ఓ ప్రేమోన్మాది ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన దారుణ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సినిమాల ప్రభావం వల్లే ఇలాంటి ఘటనలు జరగుతున్నాయంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ ఘటన తర్వాత సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన యానిమల్‌ సినిమాలోని ఓ సన్నివేశంపై సోషల్‌ మీడియాలో ట్రోల్ అవుతోంది. ఆ సన్నివేశంలో రణ్‌బీర్‌ ఏకే-47 తుపాకీతో స్కూల్‌లోని క్లాస్‌లోకి వెళ్లి ఓ స్టూడెంట్‌ని కాల్చిపడేస్తాడు. అదే ఇప్పుడు వివాదాస్పద చర్చకు దారితీసింది. ఇలాంటి సినిమాలు హింసను గొప్పగా చూపిస్తున్నాయని పలువురు విమర్శకులు అభిప్రాయపడ్డారు. హింసను మగవాళ్లకు చిహ్నంగా చూపించడం యువతపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియలో జరుగుతున్న చర్చపై ప్రముఖ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ఘాటుగా(RGV on Rapthadu School Attack) స్పందించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇదే సమయంలో ఈదాడిపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు రామ్‌ గోపాల్ వర్మ. సినిమాల్లో హింసాత్మక సన్నివేశాలు యువతపై ప్రభావం చూపుతున్నాయన్న చర్చ కరెక్ట్ కాదన్నారు. సినిమాల్లో హింసను చూపించడం వల్ల సమాజంలో నేరాలు పెరుగుతున్నాయని విమర్శించడం సరికాదన్నాడు. సినిమాలపై వస్తున్న విమర్శలు సరైన దిశలో లేవంటూ తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. ఈవిషయంలో సందీప్‌ రెడ్డి వంగాకు ఆర్జీవీ సపోర్ట్‌గా నిలిచారు.

ఇదే క్రమంలో రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్ చేశాడు. కిడ్నాప్‌లు పెరుగుతున్నాయని రామాయణాన్ని నిందించలేము కదా అని అన్నారు. అలా అనడం ఎంత తప్పో.. హింస పెరుగుతోందని సినిమాలను నిందించడం కూడా అంతే తప్పని ఎక్స్‌లో పోస్ట్(RGV on Rapthadu School Attack) పెట్టాడు. రామ్ గోపాల్ వర్శ చేసిన పోస్ట్‌పై తీవ్రంగా స్పందిస్తున్నారు నెటిజన్లు. రావణుడి నుంచి మీరు స్పూర్తి పొందారు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామ్‌ గోపాల్ వర్మ ట్వీట్‌పై ఘాటుగా స్పందిస్తూ వందల్లో రిప్లై ఇస్తున్నారు.