తగ్గని జోరు.. సింధు హోరు
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ రెండు టోర్నీల్లో ఫైనల్‌కి చేరారు. మునుపటి సింధు కమ్ బ్యాక్ అనేలా రెచ్చిపోతున్నారు.

PV Sindhu Makes Strong Comeback
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ రెండు టోర్నీల్లో ఫైనల్‌కి చేరారు. మునుపటి సింధు కమ్ బ్యాక్ అనేలా రెచ్చిపోతున్నారు. ఆమె వయస్సు ప్రజెంట్ 31 అయినప్పటికీ.. 21 ఇయర్స్ యువతిలా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే జపాన్, హైలో ఓపెన్ టైటిళ్లు గెలిచి, ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది సింధు. ఇప్పుడు సింధు ఖాతాలో చేరిన రెండో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ ఇది. అంతకుముందు జులైలో జపాన్ ఓపెన్ సూపర్ 750లో విజేతగా నిలిచింది. 2024 డిసెంబరు తర్వాత ఆమె గెలిచిన(PV Sindhu Makes Strong Comeback) తొలి వ్యక్తిగత టైటిల్ కూడా అదే. మొత్తంగా సింధు ఇప్పటివరకు ఏడు వరల్డ్ టూర్ టైటిళ్లు సాధించింది. ఈ సీజన్లో పారిస్‌లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ ఫైనల్ చేరిన ఆమె.. ప్రపంచ నంబర్‌వన్, పారిస్ ఒలింపిక్స్ ఛాంపియన్ అన్ సెయంగ్ చేతిలో ఓడింది.
ఐదేళ్ల తర్వాత
ఐదేళ్ల తర్వాత బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఈ మెగా టోర్నీ చైనాలోని హాంగ్జౌ వేదికగా డిసెంబర్ 9 నుంచి 13 వరకు జరుగనుంది. 2022లో కూడా సింధు బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించినప్పటికీ, గాయం కారణంగా చివరి నిమిషంలో తప్పుకుంది. దీంతో 2021 తర్వాత మళ్లీ ఈ టోర్నీలో ఆడే అవకాశం దక్కింది. 2021లో జరిగిన ఫైనల్లో సింధు.. దక్షిణ కొరియా షట్లర్ అన్ సె యంగ్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. సింధు 2018లో తొలిసారి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్‌ను(PV Sindhu Makes Strong Comeback) గెలుచుకుంది. ఆతర్వాత 2019, 2020లో గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. తిరిగి 2021లో ఫైనల్‌కు చేరినా అన్ సె యంగ్ చేతిలో ఓడిపోయింది. 2022లో అర్హత సాధించినప్పటికీ ఎడమ చీలమండ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగింది.
పూర్తి ఫిట్నెస్
2027 జనవరి 4 నుంచి అమల్లోకి రానున్న 3×15 పాయింట్ల స్కోరింగ్ విధానంపైనా సింధు స్పందించింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న 21 పాయింట్ల విధానంతో పోలిస్తే కొత్త పద్ధతిలో ఆటగాళ్లు ఆరంభం నుంచే అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. తొలి ఐదు, ఆరు పాయింట్లు కోల్పోతే ఆటలో సగం సమయం ముగిసినట్లేనని వివరించింది. ప్రత్యర్థికి సులభంగా పాయింట్లు ఇచ్చే అవకాశం ఉండదని, ప్రతి క్షణం చురుగ్గా ఆడాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. ఇప్పుడు తన శారీరక దృఢత్వంపై(PV Sindhu Makes Strong Comeback) ప్రత్యేక దృష్టి పెట్టింది. డిసెంబరులో జరిగే బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు పూర్తి ఫిట్నెస్తో సిద్ధమయ్యేందుకు కొరియా ఓపెన్ సహా తదుపరి టోర్నీలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది.



