Kriti Sanon Approaches Delhi High Court

ఏఐ సినీ లోకాన్ని కలవరపెడుతోంది. వరుసగా నటీనటులు డీప్‌ ఫేక్‌ వీడియోల భారిన పడి లబోదిబోమంటున్నారు. తాజాగా ఏఐ దుర్వినియోగానికి మరో నటి బలిఅయ్యారు. ఏకంగా ఢిల్లీ (Kriti Sanon Approaches Delhi High Court)హైకోర్టులో పిటిషన్‌ వేశారు ఆమె. ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్‌ ఏఐ దుర్వినియోగంపై కోర్టుకు వెళ్లారు. తన హక్కులను కాపాడాలంటూ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి .. మరీ ముఖ్యంగా తన అనుమతి లేకుండా డీప్‌ఫేక్‌ వీడియోలు, ఫేక్ ఎండార్స్‌మెంట్లు క్రియేట్ చేస్తున్నారంటూ కోర్టుకు తెలిపారు. అలాంటి వారిని చట్టపరంగా శిక్షించి.. చర్యలు తీసుకోవాలని కోరారు.

కృతి పిటిషన్‌పై జస్టిస్ పురుషైంద్ర కుమార్ కౌరవ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. వ్యక్తిత్వ హక్కులకు సంబంధించిన అంశాలపై మరిన్ని వివరాలు(Kriti Sanon Approaches Delhi High Court) ఇవ్వాలంటూ నటి తరపు లాయర్లను ఆదేశించారు. తీర్పును గురువారానికి వాయిదా వేశారు. అయితే ఇటీవల ఓ ప్రొగ్రాంలో పాల్గొన్న కృతి సనన్‌ .. ఏఐ టెక్నాలజీ తనను ఎంతగానో భయపెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ పదునైన కత్తిలాంటిదని.. అది ఎంత పదునుగా ఉంటే అంత గట్టి ప్రమాదం జరుగుతుందని కృతి చెప్పారు. సోషల్‌మీడియాలో ఏఐ ద్వారా సృష్టించిన తన ఫోటోలను రిపోర్ట్ చేయడానికి సరైన నిబంధనలు కూడా లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే టెక్నాలజీని కొందరు దుర్మార్గులు తప్పుగా ఉపయోగిస్తున్నారు. డీప్‌ ఫేక్ వీడియోలతో మరిముఖ్యంగా నటీనటులకు నిద్రలేకుండా చేస్తున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా డీప్‌ ఫేక్ వీడియోల భారిన పడి బాధపడిన నటీనటుల లిస్ట్ చాంతాడంతా ఉంది. ఇది ఇప్పుడు కాదు.. 2023 అంటే గత మూడేళ్ల క్రితమే స్టార్ అయింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న డీప్‌ ఫేక్ దగ్గర నుంచి ఈవ్యవహారం స్టార్ అయింది. అమెతో ఆగకుండా.. ఆలియా భట్, కాజోల్, కత్రినాకైఫ్‌, ఐశ్వర్య రాయ్, మెగాస్టార్ చిరంజీవి, రీసెంట్‌గా జాన్వీ కపూర్ వరకు .. ఇలా చదువుకుంటూ పోతే ఈ లిస్ట్ ఇంకా చాలానే ఉంది. వీరందరివి కూడా అసభ్యకరంగా ఏఐ వీడియోలు సృష్టించి ఆన్‌లైన్‌లో వ్యాప్తి చేసి సునాకానందం పొందుతున్నారు కొంతమంది దుర్మార్గులు. చిరంజీవి సైతం తన ముఖం, రూపాన్ని ఉపయోగించి డీప్‌ఫేక్ వీడియో రూపొందించి పలు వెబ్‌ సైట్లో ప్రచారం చేశారని సైబర్ క్రైమ్‌లో పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇటీవల అయితే జాన్వీ కపూర్ వ్యవహారం మరింత విదాస్పందంగా మారింది. అమెకు జరిగిన అన్యాయంపై దేశ వ్యాప్తంగా సినీ ప్రపంచం తీవ్రంగా ఖండించింది. జాన్వీ కపూర్‌కి అండగా నిలిచింది. ఇప్పుడు కృతి సనన్‌ విషయంలో సినీ నటులు ఎలా స్పందిస్తారో చూడాలి.