భారత్ తొలి పంచ్.. కోహ్లీ మరో రికార్డు
కివీస్ గడ్డపై భారత్ జైత్రయాత్ర కొనసాగుతుంది. ఆక్లాండ్ వేదికగా జరిగిన కివీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఫస్ట్ వన్డేలో టీమ్ ఇండియా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 5 వికెట్ల తేడాతో గెలిచింది.

India Beat New Zealand First OneDay
కివీస్ గడ్డపై భారత్ జైత్రయాత్ర కొనసాగుతుంది. ఆక్లాండ్ వేదికగా జరిగిన కివీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఫస్ట్ వన్డేలో టీమ్ ఇండియా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 5 వికెట్ల తేడాతో గెలిచింది. పదేపదే వర్షం అంతరాయం కలిగినా.. భారత్ ఛేజింగ్ స్టార్ విరాట్ కోహ్లీ క్లాస్ ఇన్నింగ్ ముందు కివీస్ టార్గెట్ చిన్నబోయింది. దీంతో ఫస్ట్ వన్డేలో (India Beat New Zealand First OneDay)భారత్ గెలుపొందింది. ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
రెచ్చిపోయిన బౌలర్లు..
టాస్ గెలిచిన గిల్ సేన ఫీల్డింగ్ ఎందుకున్నాడు. తొలి వన్డేలో భారత్ యువ పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, అన్షుల్ కంబోజ్ అద్భుతంగా రాణించడంతో కివీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి భారత్ బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. కివీస్ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టారు. అర్ష్‌దీప్ సింగ్ 4 వికెట్లు.. గుర్నూర్ 3, అన్షుల్ 2 వికెట్లు పడగొట్టారు. దీంతో న్యూజిలాండ్ జట్టు 40.2 ఓవర్లలో 185 పరుగులకే ఆలౌట్(India Beat New Zealand First OneDay) అయింది. కివీస్ బ్యాటర్లు.. టిమ్ సీఫెర్ట్ (38), గ్లెన్ ఫిలిప్స్ (30), బ్లెయిర్ టిక్నర్ కేవలం (34 ) పరుగులు చేశారు.
సునాయాసంగా..
186 రన్స్ టార్గెట్‌తో క్రీజ్‌లోకి దిగిన టీమ్ ఇండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లీ తన క్లాస్ ప్లేతో ఆకట్టుకున్నాడు. 54 బంతుల్లో 74 పరుగులు చేశాడు. వన్డే ఫార్మాట్‌లో 80వ అర్ధశతకాన్ని పూర్తి చేశాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (37)తో కలిసి రెండో వికెట్‌కు 113 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. కివీస్ టార్గెట్‌ను చేధించే క్రమంలో రెండు సార్లు వర్షం అంతరాయం కలిగింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం లక్ష్యాన్ని 32 ఓవర్లలో 143 పరుగులుగా సవరించారు. దీంతో 22.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది భారత్. సునాయాసంగా విజయాన్ని(India Beat New Zealand First OneDay) అందుకుంది.న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ 3, జేమీసన్, నాథన్ స్మిత్ చెరో వికెట్ పడగొట్టారు. భారత్ బౌలర్ అన్షుల్ కంబోజ్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అందుకున్నాడు. రెండో వన్డే వెల్లింగ్టన్‌లో శనివారం జరగనుంది.
కోహ్లీ రికార్డు..
ఈమ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మరో ప్రపంచ రికార్డును తన పేరిట క్రియేట్ చేశాడు. వన్డే క్రికెట్‌లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేస్తూ 13,000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా కోహ్లి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద విరాట్ ఈ ఫీట్ సాధించాడు. నంబర్ 3 స్దానంలో బ్యాటింగ్ చేసి.. ఏకంగా 48 వన్డే సెంచరీలు సాధించి తిరుగులేని రాజుగా చరిత్రకెక్కాడు.



