క్రికెట్‌కు గుడ్‌బై.. ఆ కోరిక తీరకుండానే..!
విధ్వంసానికి ప్రతిరూపం ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్. తనదైన బ్యాటింగ్ శైలితో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. చాలాసార్లు వన్‌మ్యాన్ షో చేసి ఆస్ట్రేలియాను గెలిపించాడు. మరి ముఖ్యంగా ICC టోర్నీల్లో కంగారు జట్టుకు విశేషమైన సేవలందించాడు. చివరకు నవంబర్ 3న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

Glenn Maxwell Retirement
ఆకాశమే హద్దుగా..
విధ్వంసానికి ప్రతిరూపం ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్. తనదైన బ్యాటింగ్ శైలితో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. చాలాసార్లు వన్‌మ్యాన్ షో చేసి ఆస్ట్రేలియాను గెలిపించాడు. మరి ముఖ్యంగా ICC టోర్నీల్లో కంగారు జట్టుకు విశేషమైన సేవలందించాడు. చివరకు నవంబర్ 3న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు(Glenn Maxwell Retirement) పలికాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. దాదాపు 14 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా టీంకు ఆడాడు మ్యాక్స్‌వెల్. వరుస గాయాలు, తీవ్రవైన ఒత్తిడితో ఇక ఎట్టకేలకు క్రికెట్‌కు టాటా చెప్పాడు. క్రీజ్‌లో ఉన్నంత సేపు బౌలర్‌కి చిక్కులు చూపించడం మ్యాక్స్‌వెల్ స్టైల్. అసాధారణ షాట్లతో బౌలర్లను బెంబేలెత్తించడం మ్యాక్స్‌వెల్ ప్రత్యేకత. అంతేకాదు ఫీల్డింగ్‌లోను అద్భుతమైన క్యాచ్‌లు పట్టడం, బౌలింగ్‌లో కీలకంగా వ్యవహరిస్తాడు. అయితే మ్యాక్స్‌వెల్ క్రికెట్‌కు దూరం కావడానికి ముఖ్యకారణం ఫిటెనెస్. ఐపీఎల్ తొలి దశ తర్వాత తన బరువు సుమారు 9 కిలోలు పెరిగాడు. ఆహార నియంత్రణను నిరంతరం పాటించలేకపోయానని అంగీకరించాడు.
చరిత్రలో ఆ ఇన్నింగ్స్..
2023 వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ మ్యాక్స్‌వెల్(Glenn Maxwell Retirement) కెరీర్‌లో చిరస్మరణీయంగా నిలిచింది. 293 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. అలాంటి పరిస్థితుల్లో మ్యాక్స్‌వెల్ అద్భుతంగా పోరాడి కేవలం 128 బంతుల్లోనే అజేయంగా 201 పరుగులు చేశాడు. ఆమ్యాచ్ ఆడే సమయంలో అతడు తీవ్ర కండరాల నొప్పులతో బాధపడ్డాడు. కాళ్లలోని కండరాలు పట్టేయడం, తొడలు, పిక్కలు, షిన్స్‌లో నొప్పులు రావడంతో పాటు వెన్నునొప్పి కూడా వేధించింది. ఒక దశలో గాయంతో మైదానం వీడాలా అని ఫిజియోథెరపిస్ట్‌ను కూడా సంప్రదించాడు. అయినా పట్టుదలతో బ్యాటింగ్ కొనసాగించి ఆస్ట్రేలియాకు అద్భుత విజయాన్ని అందించాడు.
ఆ రెండు ఫార్మాట్లలో..
మ్యాక్స్‌వెల్‌కు 2022లో జరిగిన కాలి గాయం కూడా అతడి కెరీర్‌పై ప్రభావం చూపింది. ఎడమ కాలి ఫిబులా ఎముక విరగడంతో పాటు చీలమండకు గాయమైంది. అంతేకాదు 2023 వన్డే ప్రపంచకప్ సమయంలో మ్యాక్స్‌వెల్ మరో ప్రమాదాన్ని ఎదుర్కొన్నాడు. గోల్ఫ్ కార్ట్ నుంచి కిందపడటంతో తలకు గాయమై కంకషన్‌కు గురయ్యాడు. దీంతో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమయ్యాడు.
వైద్యుల పర్యవేక్షణలో కోలుకున్న తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు. అనంతరం అఫ్గానిస్థాన్‌పై చారిత్రాత్మక డబుల్ సెంచరీ సాధించాడు. తాజాగా నవంబర్ 3న మ్యాక్స్‌వెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియా తరఫున 14 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన అతడు.. ఇకపై తన శరీరంపై మరింత సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నాడు. అయితే తన సొంత మైదానమైన మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాలని ఆశించినప్పటికీ, ఆస్ట్రేలియా జట్టు భవిష్యత్తు కోసం యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడం కోసం కోరుకున్నాడు. అందుకే రిటైర్మెంట్(Glenn Maxwell Retirement) ప్రకటించారు. అయితే ఫ్రాంచైజీ టీ20 క్రికెట్‌లో మాత్రం కొనసాగనున్నాడు. రాబోయే బిగ్‌బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ తరఫున ఆడేందుకు సిద్ధమవుతున్నాడు.



