‘రామాయణ’ టీమ్‌కు బన్నీ విషెస్
దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కించిన భారీ చిత్రం ‘రామాయణ’ టీమ్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా కేవలం వినోదం మాత్రమే కాదని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, గొప్ప కథలను ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నమని ప్రశంసించారు.

Allu Arjun Wishes Ramayana Team
దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కించిన భారీ చిత్రం ‘రామాయణ’ టీమ్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా కేవలం వినోదం మాత్రమే కాదని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, గొప్ప కథలను ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నమని ప్రశంసించారు. సినిమా టీమ్‌కు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రేక్షకులంతా ఈ ప్రయత్నానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.ఇటువంటి గొప్ప ప్రయత్నాలకు పరిశ్రమలకతీతంగా అందరూ మద్దతుగా నిలవాలని బన్నీ పిలుపునిచ్చారు. మన కథలను, మన సంస్కృతిని, మన కీర్తిని ముందుకు తీసుకెళ్లే ఈ స్వచ్ఛమైన ప్రయత్నానికి మనమందరం ఏకమై మద్దతుగా నిలుద్దాం. జై శ్రీ రామ్” అంటూ తన పోస్టును ముగించారు.
ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు. హాలీవుడ్ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సుమారు రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 5న దీపావళి సందర్భంగా రామాయణ పార్ట్ 1 హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైంది. రెండో భాగం 2027 దీపావళికి విడుదల చేయాలని భావిస్తున్నారు.



