దావోస్‌కు విజయ్..! తొలి సీఎంగా సరికొత్త చరిత్ర
తమిళనాడు సీఎం విజయ్ ఆరాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకోని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. యువతకు ఉద్యోగ ఉఫాది, రాష్ట్రానికి పెట్టుబడులు పెద్ద ఎత్తున తీసుకొచ్చేందుకు విజయ్.. వరల్డ్ ఎకనామిక్ ఫోరం(WEF ) వార్షిక సదస్సుకు హాజరయ్యేందుకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Vijay Davos Visit Attend to WEF
తమిళనాడు అభివృద్ధి, ముఖ్యంగా యువతకు ఉద్యోగ ఉఫాది విషయంలో ముఖ్యమంత్రి, TVK అధినేత విజయ్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. యువతకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ వేరకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకు తీవ్ర కృషి చేస్తున్నారు. ఉపాధి కల్పన జరగాంటే ముందుకుగా పెద్ద ఎత్తున పెట్టుబడులు రావలని గ్రహించారు. దీని కోసం ఇప్పటివరకు తమిళనాడు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకోని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. యువతకు ఉద్యోగ ఉఫాది, రాష్ట్రానికి పెట్టుబడులు పెద్ద ఎత్తున తీసుకొచ్చేందుకు విజయ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం(WEF ) వార్షిక సదస్సుకు హాజరయ్యేందుకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు(Vijay Davos Visit Attend to WEF) వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అదే గాని జరిగితే దావోస్ WEF సదస్సుకు హాజరయ్యే తమిళనాడు తొలి ముఖ్యమంత్రిగా విజయ్ చరిత్ర నిలుస్తారు. అయితే తమిళనాడు చరిత్రలో ఇప్పటివరకు ఒక్క సీఎం కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరుకాలేదు. ప్రతీసారి తమిళనాడు తరపున ఈ అంతర్జాతీయ సదస్సుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రులు మాత్రమే హాజరయ్యేవారు. గతంలో డీఎంకే ప్రభుత్వ హయాంలో తంగం తెన్నరసు, ఆ తర్వాత టీఆర్బీ రాజా దావోస్ వేదికగా రాష్ట్ర పారిశ్రామిక సామర్థ్యాన్ని, పెట్టుబడుల అవకాశాలను అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు వివరించారు. అయితే ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి విజయ్ ఈ సదస్సుకు హాజరుకావాలని నిర్ణయించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
భారీగా పెట్టుబడులే లక్ష్యం..
దావోస్ పర్యటన ద్వారా తమిళనాడును ప్రపంచ పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా నిలబెట్టాలని విజయ్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలతో నేరుగా చర్చలు జరిపి రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను తీసుకురావడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. విజయ్ దావోస్ పర్యటనతో తమిళనాడుకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభిస్తుందని TVK భావిస్తోంది. దావోస్(Vijay Davos Visit Attend to WEF) వేదికగా ప్రపంచ దేశాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో విజయ్ సమావేశమై వ్యాపార సంబంధాలను బలోపేతం చేసుకునే అవకాశం ఉంటుందని .. అంతర్జాతీయ స్థాయిలో తమిళనాడుకు కొత్త గుర్తింపు తీసుకురావడంలో ఈ పర్యటన కీలకంగా మారుతుందని అభిప్రాయపడుతోంది.
విజయ్ విశ్లేషణ..
పెట్టుబడుల విషయంలో దేశంలో మిగతా రాష్ట్రాలతో పోటిపడాలంటే తాను చొరవ తీసుకోకతప్పదని గ్రహించారు. అందుకే ముందుచూపుతో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఎక్కువగా విదేశీ పెట్టుబడులు ఆకర్షించిన రాష్ట్రాలను గణాంకాలను .. అక్కడ పెద్ద ఎత్తున రావాడానికి గల కారణాలను విశ్లేషించారు. ఆయా రాష్ట్రాల్లో సీఎంలు దావోస్(Vijay Davos Visit Attend to WEF)కు వెళ్లి వాళ్లే స్వయంగా చొరవ తీసుకోవడం వల్ల అది సాధ్యమైందని గమనించారు. ఈక్రమంలోనే తాను కూడా దావోస్ వెళ్లి పెట్టుబడులు తీసుకురావాలని.. తనకున్న పలుకుబడిని ఉపయోగించి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు తమిళనాడుకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విషయంలో కేంద్ర ప్రభుత్వం తగిన సహకారం అందించడం లేదనేది TVK భావన. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని, తమిళనాడుకు మాత్రం ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, విదేశీ పెట్టుబడుల కోసం ఇతర దేశాలతో చర్చలు జరిపే విషయంలో విదేశాంగ శాఖ (MEA), కేంద్ర ప్రభుత్వం తగిన సహాయం అందించడం లేదని టీవీకే చెప్తోంది.
పర్యటనపై ఆసక్తి..
తమిళనాడులో పెట్టుబడుల ఆకర్షణ విషయంలో రాజకీయ పార్టీల మధ్య చర్చ జరుగుతున్న నేపథ్యంలో విజయ్ దావోస్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అంతర్జాతీయ వేదికపై రాష్ట్ర పారిశ్రామిక సామర్థ్యం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం విజయ్ ప్రభుత్వానికి లభించనుంది. అయితే ఈ పర్యటన ఇంకా ప్రతిపాదిత దశలోనే ఉందని, అధికారిక షెడ్యూల్ ఖరారు కాలేదు. ఒకవేళ పర్యటన ఖరారైతే తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో దావోస్(Vijay Davos Visit Attend to WEF) WEF సదస్సుకు హాజరయ్యే తొలి నేతగా విజయ్ పేరు చరిత్రలో నిలిచే అవకాశం ఉంది.



