Telangana Congress Internal Politics

కాంగ్రెస్‌లో అంతర్గత అసంతృప్తి రోజురోజుకు రచ్చకెక్కుతోంది. మొన్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. నిన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీని ఇరకాటన పెడుతున్నాయి. ప్రతిపక్షానికి ఊతం ఇచ్చేలా ఉన్నాయ్‌ అనే టాక్‌ కాంగ్రెస్‌లో నడుస్తోంది. అధికార కాంగ్రెస్‌లో వరుసగా జరుగుతున్న కల్లోలం(Telangana Congress Internal Politics) ఇప్పుడు ఆపార్టీని కలవర పెడుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ నేతలు ఇలా వరుసగా చేస్తున్న స్టేట్మెంట్స్‌ కాంగ్రెస్‌ను ఆందోనలో నెట్టివేస్తోంది.

ఉత్తమ్‌పై విమర్శలు..
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వంత ప్రభుత్వంపైనే బహిరంగంగా విమర్శలు చేశారు. అవినీతి పెద్దఎత్తున జరుగుతోందని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోందన్నారు. నిధుల కేటాయింపులో తీవ్ర వివక్ష చూపుతున్నారంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శి స్థాయి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయి వరకు లంచాలు ఇస్తేనే తప్ప ఏ ఫైలు కదలడం లేదన్నారు. సొంత పార్టీ అధికారంలో ఉన్నా.. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలా పోరాడాల్సి వస్తోందన్నారు. మంత్రి పదవి ఇస్తామని నమ్మించి మోసం చేసినా ఓర్చుకున్నానని.. కానీ ఇప్పుడు నిధుల కూడా ఇవ్వకుండా మునుగోడు అభివృద్ధిని అడ్డుంటున్నారని ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేవలం హుజూర్‌నగర్ నియోజకవర్గానికే మంత్రా? లేక రాష్ట్రం మొత్తానికా? (Telangana Congress Internal Politics)అని ప్రశ్నించారు. ఫ్లోరోసిస్ పీడిత మునుగోడుకు మాత్రం కనీసం 300 కోట్లు కూడా కేటాయించలేదని మండిపడ్డారు. మునుగోడు అభివృద్ధికి తక్షణమే నిధులు విడుదల చేయాలి లేదంటే… ప్రజల కోసం అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా వెనుకాడబోనని ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక నిధుల లేమి పేరుతో సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

చావడానికైనా సిద్ధం..
మరోవైపు జడ్చర్ల ఎమ్మెల్యే సైతం సేమ్‌టూ సేమ్. తన నియోజకవర్గం జడ్చర్ల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయడం లేదని.. పనులు చేసిన కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులో ఆలస్యం జరుగుతోందంటూ ప్రభుత్వంపై ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు చేశారు. నా ప్రాణం పోతేనే బిల్లులిస్తారా? అని ప్రశ్నించారు. అవసరమైతే ప్రభుత్వంపై పోరాడైనా బిల్లులు మంజూరు చేయించి అసంపూర్తి పనులు పూర్తి చేయిస్తానని ప్రకటించారు. రోడ్లకు నిధులు మంజూరు చేసి కొబ్బరికాయ కొట్టిపోయిన నా గురువు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జడ్చర్లలో పాదయాత్ర చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Telangana Congress Internal Politics)ను అడుగుతున్నా.. వెంటనే రూ. 40 కోట్ల పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే జడ్చర్లలో 30వేల మందితో ఆమరణ నిరాహర దీక్షకు కూర్చుంటానని హెచ్చరించారు. అందులో నేను చనిపోయినా సరే .. ఆతర్వాతైనా జడ్చర్లకు నిధులివ్వండి .. నేను బతకాలో వద్దో.. ప్రభుత్వమే నిర్ణయించాలంటూ అనిరుధ్‌రెడ్డి కామెంట్స్ చేశారు.

స్ట్రాంగ్ వార్నింగ్
అయితే ఇప్పటికే అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్ సిరీయస్‌గా స్పందించారు. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఎవరు వ్యవహారించినా ఊరుకునేదే లేదని.. క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. నిధుల కొరత ఒక్క జడ్చర్లలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఉందని.. ఇలా మాట్లాడం సరికాదని మహేష్‌ గౌడ్ హితవు పలికారు. ఈ అంశాన్ని పార్టీ క్రమశిక్షణ కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తోందన్నారు. ఇదిలా ఉంటే ఎవరికీ రాని సమస్యలు ఈ ఇద్దరికే వస్తున్నాయా అన్న చర్చ గాంధీ భవన్ వర్గాల్లో వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై పదేపదే విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జె. అనిరుధ్ రెడ్డిపై చర్యలు(Telangana Congress Internal Politics) తీసుకోవాలని బీసీ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నించారు. గతంలో కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించిన కాంగ్రెస్ నాయకత్వం.. ఇప్పుడు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీసీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఎంపీతో తలనొప్పి! 
ఇక ఇదే సమయంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సైతం కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారారా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఆయన వరుస వివాదాలతో ఎప్పుడూ మీడియాకెక్కుతున్నాడు. ఇప్పటికే మంచిర్యాలలో ఎమ్మెల్యే, వర్సెస్ ఎంపీ అన్నట్లుగా సాగుతోంది అక్కడి వ్యవహారం. ఇద్దరి మధ్య వివాదం లోకల్‌ నాయకుల మధ్య దాడులు చేసుకునేంత వరకు వెళ్లింది. ఇప్పుడు తాజా మంత్రి శ్రీధర్‌బాబు టార్గెట్‌గా ఎంపీ లేఖ సంధించడం తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత విభేదాలు బయటపడేలా చేశాయి. శ్రీధర్‌బాబుకు ఎంపీ(Telangana Congress Internal Politics) రాసిన లేఖ మరో చర్చకు తెరలేపింది. ఢిల్లీ సభకు వెళ్లని ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వద్దంటూ, గతంలో కాకా వెంకటస్వామి ట్రస్టు కార్యక్రమానికి వెళ్లిన వారిపై చర్యలు తీసుకోవడంపై సెటైరిక్ గా లేఖాస్త్రం సంధించారు ఎంపీ. అంటే ఇక్కడ సమస్య కేవలం బిల్లులు కాదు.. పార్టీలో ప్రాధాన్యత, నిధుల పంపిణీ, క్రమశిక్షణ, నాయకుల మధ్య సమన్వయం. ఈ అసంతృప్తికి పరిష్కారం అంతర్గత చర్చలతో వస్తుందా? లేక బహిరంగ విమర్శలు మరింత పెరుగుతాయా? చూడాలి. వీటిని కట్టడి చేయాల్సిన బాధ్యత టీపీసీసీదే. ఇకనైనా వరుస వివాదాలకు ఫుల్‌ స్టాప్‌ పెడుతుందా? అయితే వివాదాలకు చెక్ పెట్టేందుకు ఎలా చర్యలు తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.