Australia Indian Pulses Demand

సూపర్ ఎల్‌నినో తెలంగాణ రైతులు సతమతమవుతున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో కేంద్రం చెప్పిన గుడ్‌ న్యూస్‌ తెలంగాణ రైతుల్లో ఆశలు చిగురించాయి. తెలంగాణలో పండించిన పంటకు ఆస్ట్రేలియా డిమాండ్ ఏర్పడడంతో రాష్ట్ర ప్రజలతో పాటు ఆప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి చెందిన జీఐ ట్యాగ్ పొందిన తాండూరు కందిపప్పు తొలిసారి ఆస్ట్రేలియాకు ఎగుమతి అయింది. మొత్తం 2.5 మెట్రిక్ టన్నుల కందిపప్పును ఆస్ట్రేలియాకు పంపారు. అక్కడి అధికారులు ఇకపై తాండూరు కందిపప్పు సరఫరా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌(Australia Indian Pulses Demand) ఇచ్చారు. దీంతో తెలంగాణ వ్యవసాయ రంగంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది.

ఈవిషయాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ప్రీయూష్‌ గోయల్ స్వయంగా సోషల్ మీడియాలో తెలిపారు. భారత జీఐ ఉత్పత్తులు ప్రపంచాన్ని గెలుస్తున్నాయని చెప్పి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎగుమతులతో ఆస్ట్రేలియాలోని ఇళ్లలో భారతీయ వంట రుచులు కనిపిస్తాయన్నారు. తాండూరు కందిపప్పుకు సరికొత్త విదేశీ మార్కెట్ విలువ పెరిగిందని అధికారులు చెప్పారు. తాండూరు కందిపప్పుకు 2022 డిసెంబర్‌లో భౌగోళిక గుర్తింపు లభించింది. తెలంగాణ నుంచి జీఐ ట్యాగ్ పొందిన తొలి పప్పుధాన్యపు పంట కూడా ఇదే . అయితే తాండూరు కందిపప్పుకు ఉన్న ప్రత్యేక(Australia Indian Pulses Demand) ఏంటంటే.. ప్రొటీన్ శాతం అధికంగా ఉంటాయి. అంతేకాదు ప్రత్యేకమైన రుచి, త్వరగా ఉడకడం దీని ప్రత్యేకత. దీంతో తాండూరు కందిపప్పుకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది.

ఇతర ప్రాంతాల్లో పండే కందిపప్పుతో పోలిస్తే తాండూరు పప్పు ప్రత్యేకతమైనది. ఇది ప్రధానంగా వికారాబాద్ జిల్లాలోని తాండూరు మండలం, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పండిస్తారు. ఈ ప్రాంతంలోని లోతైన నల్లరేగడి నేలలు ఈ పంటకు(Australia Indian Pulses Demand) అత్యంత అనుకూలం. వర్షాధార పంట కావడంతో పురుగు పట్టదు. రైతులు కూడా పురుగుమందులు కొట్టరు. దీంతో తాండూరు కందికి ఆస్ట్రేలియా మంచి గిరాకీ పెరిగింది. మన దేశం నుంచి ఎక్కువ శాతం సౌదీ అరేబియాకు బాస్మతి బియ్యం, మసాలా దినుసులు, పండ్లు ఎగుమతి అవుతాయి. అమెరికాకు మసాలాలు, మిర్చి ఉత్పత్తులు, పసుపు, ప్రాసెస్డ్ ఫుడ్స్.. దుబాయ్‌కి మామిడి, అరటి, దానిమ్మ, ఉల్లిపాయలు, కూరగాయలు ఎగుమతి అవుతాయి. బంగ్లాదేశ్‌కి బియ్యం, ఉల్లిపాయలు, పండ్లు, కూరగాయలు, మసాలాలు ఎగుమతి అవుతాయి.