అమెరికా అంటేనే తెలుగోళ్లు. కాలనీలకు కాలనీలు, ఏరియాలకు ఏరియాలు తెలుగోళ్లదే రాజ్యం. ఎందుకంటే మనోళ్ల దగ్గర టాలెంట్‌ ఉంది. వలసలను వ్యతిరేకించే ట్రంప్‌ అయినా, జాత్యహంకారంతో కొట్టుమిట్టాడో మరో అధ్యక్షుడొచ్చినా తెలుగోళ్లని నెత్తిన పెట్టుకోవాల్సిందే. బతుకుజీవుడా అంటూ ఏదో ఒక ఉద్యోగం చేసుకుని బతికేయడం కాదు.. అమెరికన్లకు నాయకత్వం వహించే స్థాయికి ఎదుగుతోంది మన తెలుగుజాతి.

అమెరికాలో మిడ్‌టర్మ్‌ ఎలక్షన్స్‌ జరుగుతున్నాయి. ట్రంప్‌ సంగతెలా ఉన్నా భారత సంతతివారు మాత్రం బస్తీమే సవాల్‌ అంటున్నారు. గవర్నర్‌ నుంచి సెనేటర్‌ దాకా, కౌన్సిల్‌ మెంబర్స్‌ నుంచి మేయర్‌ పదవుల దాకా పోటీపడుతున్నారు. అమెరికా చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించబోతున్నారు. అమెరికన్లు మనోళ్లకు ఓటేస్తారో లేదోనని టెన్షన్‌ పడాల్సినపన్లేదు. అమెరికాలో భారతీయులే 52లక్షలమంది ఉన్నారు. ఎప్పుడో 70ఏళ్లక్రితమే అమెరికా ప్రతినిధులసభకు భారతీయుడు ఎన్నికైన ట్రాక్‌ రికార్డు కూడా ఉంది.

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్‌పార్టీ తరపున వివేక్‌ రామస్వామి ఒహాయో గవర్నర్‌గా పోటీపడుతున్నారు. ఆయన గెలిస్తే బాబీ జిందాల్‌, నిక్కీహేలీ తర్వాత మూడో భారత సంతతి గవర్నర్‌ అవుతారు. ఇక హైదరాబాద్‌లో పుట్టిన అరుణా మిల్లర్‌ మేరిల్యాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా మరోసారి గెలిచేందుకు పోటీపడుతున్నారు. అమెరికాలో రెండో అతిపెద్ద నగరం లాస్ఏంజెల్స్‌ మేయర్‌ పదవికి పోటీపడుతున్న నిత్యారామన్‌ కూడా భారతీయురాలే. ఇక డెమాక్రాట్‌ పార్టీ నుంచి మళ్లీ బరిలో ఉన్న నలుగురు కాంగ్రెస్‌ సిటింగ్‌ సభ్యులు కూడా భారతీయులే.

ఫ్లోరిడా నుంచి పియా దాండియా, ఆరిజోనాలో అమీష్‌ షా, మిషిగన్‌లో రంజీవ్‌పురీ, న్యూయర్స్‌లో సరితా కోమటిరెడ్డి, న్యూయార్క్‌లో లిసాకౌల్‌, విస్సాన్సిన్‌లో జోష్ కౌల్‌, టెక్సాస్‌లో పూజాసేథీ, జార్జియాలో సుచితాపటేల్‌, వాషింగ్టన్ డీసీలో అపర్ణారాజ్‌.. వీళ్లంతా భారతీయులే. భారతీయ మూలాలున్నోళ్లే. అందులో కొందరు మన తెలుగోళ్లే. ఇదికదా అసలు కిక్కంటే!