YS Jagan Pulivendula Repolling Demand

కడప జిల్లా పులివెందులలో మినహాఇస్తే.. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగింది. పులివెందులలో వైసీపీ ఏజెంట్లను అడ్డుకుంటున్నారని ఏకంగా వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ రంగంలోకి దిగారు. దీంతో పులివెందులలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తమ ఏజెంట్లపై జరిగిన దాడులు, రిగ్గింగ్ చేసిన ఘటనలతో రీపోలింగ్ నిర్వహించాల్సిందేనని ఆర్వో ఆఫీసు ముందు జగన్‌ తన 70మంది ఏజెంట్లతో కలిసి ధర్నాకు దిగారు. బూత్ కబ్జా, రిగ్గింగ్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలతో సహా ఆర్వోకు జగన్‌ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. జరుగుతున్న దారుణాలు మీ కళ్లముందు కనిపిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆర్వోను నిలదీశారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకుని రీపోలింగ్(YS Jagan Pulivendula Repolling Demand) నిర్వహించాలని డిమాండ్ చేశారు.

అయితే పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు హెలికాప్టర్‌లో వచ్చిన జగన్.. ఓటు హక్కును వినియోగించుకోకుండానే వెనుదిరిగారు జగన్‌. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకం చూస్తుంటే ఓటు వేసే పరిస్థితులు లేవన్నారు జగన్‌. చంద్రబాబుతో కుమ్మక్కైన ఎస్‌ఈసీ ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేశారని ధ్వజమెత్తారు. పులివెందులలో ఎన్నికలు రద్దు చేసి, రీపోలింగ్ (YS Jagan Pulivendula Repolling Demand)పెడితేనే తిరిగొచ్చి ఓటేస్తానని స్ఫష్టం చేశారు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రజలకు తెలియాలన్నారు. ఇవాళ ఓటు పోతుంది.. రేపు మీ ఆస్తులే పోతాయని ఓటర్లను అప్రమత్తం చేశారు. ఎన్నికల సంఘం, ఎన్నికల అధికారులు చంద్రబాబు చేతిలో తోలుబొమ్మలుగా మారారంటూ ఆయన విమర్శించారు.

తనను మొదటినుంచి పులివెందులకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు జగన్. పులివెందులలో హెలికాప్టర్‌ ల్యాండ్‌ కాకూడదని కుట్ర పన్నారని.. తప్పనిసరి పరిస్థితుల్లో హెలికాప్టర్‌ ల్యాండ్‌ అయ్యిందన్నారు. ఎట్టకేలకు పులివెందుల చేరుకున్నానని చెప్పారు. పులివెందులలో పోలింగ్ కేంద్రానికి వచ్చిన జగన్, అక్కడ నెలకొన్న పరిస్థితులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారుజాము నుంచే టీడీపీ వర్గీయులు బూత్‌లను తమ ఆధీనంలోకి తీసుకుని, ఓటర్లను అడ్డుకుని, ఓటరు స్లిప్పులు లాగేసుకుని దౌర్జన్యాలు చేస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని ఫైర్ అయ్యారు. ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించిన తమ పార్టీ నేతలు, అభ్యర్థులపై లాఠీఛార్జ్ చేశారని జగన్ ఆరోపించారు. ఘటనలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై కూడా దాడులు జరిగాయని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల నిర్వహణ తీరు చూస్తే వ్యవస్థలో సంస్కరణలు ఎంత అవసరమో అర్థమవుతోందన్నారు. తాను ఒక్క పిలుపు ఇచ్చి ఉంటే ఎన్నికలు ఆగిపోయేవని, కానీ ప్రజాస్వామ్య నిబంధనలకు గౌరవం ఇచ్చి సంయమనం పాటించానని అన్నారు. ఈ అక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్క అధికారి భవిష్యత్తులో విచారణ ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.