నా బిడ్డలా చూసుకుంటా.. రాప్తాడు విద్యార్థినికి లోకేష్ భరోసా
అనంతపురం జిల్లా రాప్తాడులో ప్రమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి బెంగళూరులో చికిత్స పొందుతున్న బాలికను మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

Lokesh visits the Rapthadu school attack victim at Bengaluru
అనంతపురం జిల్లా రాప్తాడులో ప్రమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి బెంగళూరులో చికిత్స పొందుతున్న విద్యార్థిని మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి కుటుంబ సభ్యులకు పరామర్శించి .. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీ( Lokesh visits the Rapthadu school attack victim at Bengaluru) ఇచ్చారు. ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. మరో 48 గంటల పాటు PICUలో మెరుగైన చికిత్స అందిస్తారని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలు దగ్గరుండి బాలిక ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేస్తున్నారన్నారు. బాధిత బాలికను తన సొంత బిడ్డలా చూసుకుంటామని హామీ ఇచ్చారు. నిందితులను వదిలిపెట్టేదే లేదని చెప్పారు. కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.
పాప పట్టుదల వల్లే ఆమె ప్రాణాలతో బయటపడిందన్నారు మంత్రి లోకేష్. ప్రభుత్వం ఆమె కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ఘటనలో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు, టీచర్‌కి 20మందితో కౌన్సిలింగ్ ఇప్పించామని.. పదో తరగతి విద్యార్థులతో పాటు 8, 9, 10 తరగతుల బాలికలకు మానసిక ధైర్యం కల్పించేందుకు కౌన్సెలింగ్ అందిస్తున్నామని చెప్పారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. స్కూళ్లలో ప్రక్షాళన తీసుకొస్తామన్నారు. ఆడబిడ్డలకు రక్షణ కల్పిస్తామని హామీ( Lokesh visits the Rapthadu school attack victim at Bengaluru) ఇచ్చారు. బాలిక తల్లిదండ్రులను పరామర్శించి.. వారి తన పర్సనల్ నంబర్ ఇచ్చానని.. వారికి ఏ అవసరం అయినా అన్ని విధాల అండగా ఉంటానని లోకేష్ చెప్పారు.
మరోవైపు విద్యార్థినికి మణిపాల్ ఆస్పత్రి డాక్టర్లు నిర్వహించిన కీలక శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయి. ఆమెకు ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీలు రెండూ సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు వైద్యులు. బాలిక ప్రాణాలు కాపాడేందుకు అహర్నిశలు కృషి చేసిన డాక్టర్లకు లోకేష్ థ్యాంక్స్ చెప్పారు. చిన్నారి కోలుకునే వరకు ప్రభుత్వం ఆమె కుటుంబానికి అండగా( Lokesh visits the Rapthadu school attack victim at Bengaluru) నిలుస్తుందని, అత్యుత్తమ వైద్య సంరక్షణతో పాటు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తుందని లోకేష్ భరోసా ఇచ్చారు.
హేమంత్ అలియాస్ దుమ్ము (21) అనే యువకుడు చెట్లను కత్తిరించే రంపతో క్లాస్ రూంలోకి ప్రవేశించి ఇద్దరు బాలికలపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడు బాధిత బాలికకు వరుసకు మేనమామ అవుతాడు. గతంలో ఆమెను ప్రేమిస్తున్నానంటూ వేధించడంతో పాటు, ఆమె తిరస్కరించడంతో కక్ష పెంచుకుని ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా, అతడి కోసం పోలీసులు 12 నుంచి 15 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.



