పరామర్శించని జగన్.. ఓటు వేయని జగన్!
YS Jagan Controversy: మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై పులివెందులలో కేసు నమోదైంది. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఆర్వో కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా ధర్నా చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.

YS Jagan Controversy: ఏపీలో ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి తీరుపై చర్చ జరుగుతోంది. పులివెందుల ఎన్నికల్లో ఓటు వేయకుండా మౌనంగా వెనుదిరగడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చిన జగన్ (YS Jagan). పులివెందులలోని ఆర్వో కేంద్రం వద్ద కొద్దిసేపు ధర్నా చేసి, నేరుగా మళ్లీ బెంగళూరుకు వెళ్లిపోయారు. విచిత్రం ఏమిటంటే.. ఆయన ఓటు వేయకుండానే వెనుదిరగడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కనీసం పులివెందులలోనైనా (Pulivendula) ఓటు వేసి ఉంటే బాగుండేదని వైసీపీ నేతల్లో చర్చ జరుగుతోంది. పైగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుంటే జగన్ మాత్రం పులివెందుల (Pulivendula)పైనే దృష్టి పెట్టారంటూ వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు. జగన్ వ్యవహారశైలిపై ఎక్కడ చూసినా ఒకటే చర్చ వినిపిస్తోంది. జగన్ ఎందుకు ఇలా చేస్తున్నారు? మాజీ సీఎం అయిన తర్వాత ఆయన అనుసరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గంజాయి బ్యాచ్‌ను పరామర్శించడంతో మొదలు..
మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఏపీలో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి గంజాయి బ్యాచ్‌ను పరామర్శించడంతో వైసీపీకి వచ్చిన మైలేజ్ కంటే వ్యతిరేకతే ఎక్కువగా వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో గంజాయి బ్యాచ్‌పై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని జగన్ (YS Jagan) తీవ్రంగా వ్యతిరేకించారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతటితో ఆగకుండా అనుచరగణంతో తాడేపల్లి నుంచి తెనాలికి బయలుదేరి వెళ్లారు. నలభై నిమిషాల్లో చేరుకోవాల్సిన తెనాలికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. పైగా గంజాయి బ్యాచ్‌కు సానుభూతి వ్యక్తం చేయడమే కాకుండా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అసలు పూర్వాపరాలు తెలియకుండా జగన్ (YS Jagan) పరామర్శకు వెళ్లడంపై అప్పట్లో వైసీపీ నేతలు బాహాటంగానే విమర్శలు గుప్పించారు. ఏంటి జగన్ ఇలా చేస్తున్నారు.. అంటూ తెనాలి వైసీపీ నేతలు పార్టీ సమావేశాల్లోనే చర్చించుకున్నారు.
శ్రీకాకుళం వెళ్లి మాజీ మంత్రిని పరామర్శించని జగన్
శ్రీకాకుళం జిల్లా పలాస మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు బైక్ ప్రమాదం కేసులో అరెస్టై జిల్లా జైలులో ఉన్నారు. ఆ సమయంలో జగన్ (YS Jagan) పరామర్శ పేరుతో విశాఖ విమానాశ్రయం నుంచే బలప్రదర్శన చేపట్టారు. ఉదయం పది గంటలకు విశాఖ నుంచి బయలుదేరితే.. శ్రీకాకుళం చేరుకోవడానికి సాయంత్రం ఐదు గంటలు దాటిపోయింది. తీరా పరామర్శకు వెళ్లిన జగన్.. మాజీ మంత్రిని పరామర్శించకుండానే వెనుదిరిగారు. దీనికి ప్రభుత్వం కారణం కాదు, పోలీసులు కారణం కాదు, అధికారులు కారణం కాదు. ఒకే ఒక్క కారణం.. జైలు సమయం దాటిపోవడం. ఎవరైనా ములాఖత్‌కు వెళ్లాలంటే తప్పనిసరిగా సాయంత్రం ఐదు గంటలలోపు జైలుకు చేరుకోవాలి. నిబంధనల ప్రకారం అప్పుడే ములాఖత్‌కు అనుమతి లభిస్తుంది. అయితే సాయంత్రం ఐదు గంటలు దాటిన తర్వాత జిల్లా జైలు వద్దకు వెళ్లడంతో జైలు సిబ్బంది అనుమతించలేదు. దీంతో జగన్ (YS Jagan) మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించకుండానే నేరుగా విశాఖకు చేరుకుని బెంగళూరుకు వెళ్లిపోయారు. అప్పట్లో జగన్‌పై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు కూడా వేశారు. అక్రమాస్తుల కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్‌కు నిబంధనలు తెలియవా.. అంటూ పోస్టులు పెట్టారు.
ఓటు విలువ జగన్‌కు తెలియలేదా..?
ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుధం. అలాంటి ఓటు వేయడానికి దేశవిదేశాల్లో ఉన్నవారు సొంత ప్రాంతాలకు వెళ్లి మరీ ఓటు హక్కును వినియోగించుకుంటారు. కానీ జగన్ (YS Jagan) మాత్రం బెంగళూరు నుంచి పులివెందులకు వచ్చి.. ఓటు వేయకుండానే వెనుదిరిగారు. పైగా రీపోలింగ్ నిర్వహిస్తేనే ఓటు వేస్తానని చెప్పి మరీ హెలికాప్టర్ ఎక్కి వెళ్లిపోయారు. అయితే ఎన్నికల సంఘం అధికారులు పులివెందులలోని (Pulivendula) కొన్ని వార్డులకు రీపోలింగ్ నిర్వహించారు. అప్పుడైనా జగన్ వచ్చారా? అంటే రాలేదు. పోలింగ్ రోజున జగన్ ఓటు వేస్తారని ఎదురుచూసిన వైసీపీ నేతలకు నిరాశే ఎదురైంది. చివరకు పోలింగ్ రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పరిణామాలపై ఏపీ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా ప్రాంతాల్లో కూడా ఎన్నికలు జరుగుతుంటే జగన్ వాటిపై ఎందుకు దృష్టి పెట్టలేదని పలువురు నేతలు ఆరోపించారు. ఓటు వేయకుండానే వెనుదిరగడం, ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న పోలింగ్ సరళిపై ఆరా తీయకపోవడం వంటి అంశాలు జగన్‌పై విమర్శలకు కారణమయ్యాయి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు ఉన్న ప్రాధాన్యతను గుర్తు చేస్తూ పలువురు ఈ వ్యవహారంపై ప్రశ్నలు సంధించారు. ముఖ్యంగా పులివెందులకు వచ్చి కూడా ఓటు వేయకుండా వెళ్లిపోవడం, రీపోలింగ్ జరిగిన సమయంలోనూ తిరిగి రాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో జగన్ వ్యవహారశైలిపై వైసీపీ శ్రేణుల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జగన్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు
మాజీ సీఎం జగన్‌పై పులివెందుల (Pulivendula) పోలీసులు కేసు నమోదు చేశారు. తమ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించడం లేదంటూ జగన్ పులివెందుల ఆర్వో కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ క్రమంలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్వో కార్యాలయం వద్ద జగన్ చేపట్టిన నిరసన, అక్కడ చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. దీంతో ఇప్పటికే ఎన్నికల సమయంలో జగన్ వ్యవహరించిన తీరుపై కొనసాగుతున్న చర్చకు పోలీసుల కేసు కూడా తోడైంది. ఓటు వేయకుండానే వెనుదిరగడం, రీపోలింగ్ సమయంలోనూ పోలింగ్‌కు హాజరుకాకపోవడం, ఆర్వో కార్యాలయం వద్ద నిరసన చేపట్టడం వంటి వరుస పరిణామాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.



