AP Urban Results Alliance Victory

జగన్‌కి ఎదురుదెబ్బ..

ఏపీలో జరిగిన పుర పోరులో కూటమి ప్రభంజనం సృష్టించింది. దాదాపు అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. జగన్‌ సొంత ఇలాఖా పులివెందులలోనూ పసుపు జెండా రెపరెపలాడింది. ఈ ఫలితాలు వైసీపీకి కోలుకోలేని దెబ్బగా మారాయి. మున్సిపాలిటీల విషయానికొస్తే కూటమి జోరు(AP Urban Results Alliance Victory)కు అడ్డుకట్టే లేకుండా పోయింది. వైసీపీ కేవలం నందికొట్కూరు మున్సిపాలిటీలో మాత్రమే విజయం సాధించి నామమాత్రంగా మిగిలింది. కూటమి మేయర్‌ అభ్యర్థులు.. తిరుపతిలో మన్నె శ్రీనివాస ప్రసాద్‌, చిత్తూరులో కఠారి హేమలత, గుంటూరులో కోవెలమూడి లక్ష్మీ అపర్ణ, మచిలీపట్నంలో షేక్‌ అబ్దుల్లా అబీదా, నెల్లూరులో రూప్‌ కుమార్‌ యాదవ్‌ ఘన విజయం సాధించారు. విశాఖపట్నం, విజయవాడ, కడప కార్పొరేషన్‌లలోను కూటమి అభ్యర్థులు గెలుపొందారు. ఆదోనిలో జనసేన రెబల్‌ స్వప్న విజయం సాధించారు.

ఎవరెక్కడ గెలిచారంటే..!

కూటమి అభ్యర్థులు గెలుపొందిన మున్సిపాలిటీల విషయానికి వస్తే నర్సీపట్నం, పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం, పెద్దాపురం, కొవ్వూరు, మండపేట, ఆకివీడు, నూజివీడు, జగ్గయ్యపేట, జంగారెడ్డిగూడెం, ఉయ్యూరు, నందిగామ, జగ్గయ్యపేట, కొండపల్లి, గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల, రేపల్లె, కనిగిరి, ఆత్మకూరు(నెల్లూరు), ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ, ఆత్మకూరు(నంద్యాల), కళ్యాణదుర్గం, తాడిపత్రి, గుత్తి, పెనుకొండ, కమలాపురం, రాజంపేట, ప్రొద్దుటూరు, బద్వేల్‌, మైదుకూరు, మదనపల్లి, పుంగనూరు, రాయచోటి, వెంకటగిరి, సూళ్లూరుపేట, పలమనేరు, కుప్పం, నగరి, పులివెందుల, బొబ్బిలి, మాచర్ల, బుచ్చిరెడ్డిపాలెం, కల్యాణదుర్గం, డోన్‌, హిందూపురంలో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. గొల్లప్రోలు, తుని, సామర్లకోట, పిఠాపురం, ముమ్ముడివరం, అమలాపురం, నిడదవోలు, నర్సాపూర్‌, పెడన, తిరువూరు, తెనాలి, దర్శి, మడకశిర, పుట్టపర్తి, మడకశిరలో జనసేన గెలుపొందింది. గూడూరు(కర్నూలు), ఎర్రగుంట్ల, ఎలమంచిలిలో బీజేపీ గెలిచింది. . ఈ గెలుపు పట్టణ ప్రాంతాల్లో అధికార కూటమి(AP Urban Results Alliance Victory)కి ఉన్న బలమైన ప్రజామోదాన్ని స్పష్టం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

చీరాల కౌంటింగ్ వాయిదా..!

మురసు తుపాను ప్రభావంతో చీరాల మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్‌(AP Urban Results Alliance Victory)ను అధికారులు వాయిదా వేశారు. భారీ వర్షాల కారణంగా ఓట్ల లెక్కింపును వాయిదా వేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కౌంటింగ్ కేంద్రం వద్ద గంటకు 100 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో పాటు, వరద ముప్పు పొంచి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. దీంతో కౌంటింగ్‌ను నవంబర్ 6వ తేదీకి వాయిదా వేస్తూ ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది. ఆ రోజు ఉదయం 8 గంటలకు మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.