ఏపీలో పోలింగ్‌కు సర్వం సిద్ధం
ఏపీలో మున్సిపాలిటీలు, నగర పంచాయితీలు, కార్పోరేషన్ కు నవంబర్ 1న పోలింగ్ జరగనుంది. నవంబర్ 1న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 3వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు.

AP Municipal Polling
ఏపీలో గత కొన్నిరోజులుగా మోతెక్కిన మైకులు మూగబోయాయి. ర్యాలీలు, ప్రచారాలకు సాయంత్రం 5గంటలతో ఫుల్ స్టాఫ్ పడింది. మున్సిపాలిటీలు, నగర పంచాయితీలు, కార్పోరేషన్లో శుక్రవారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడింది. నవంబర్ 1న పోలింగ్ (AP Municipal Polling)జరగనుండగా.. నిబంధనల ప్రకారం 47 గంటల ముందే ప్రచారాలను ఆపివేశారు. దీంతో నవంబర్ 1న పోలింగ్ జరగనుంది. నవంబర్ 1న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 3వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పటిష్ఠమైన ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 36వేల 351 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో డ్రోన్లుతో నిఘాపెట్టారు. సీసీటీవీ కెమెరాలు, వీడియో నిఘాతో పాటు వెబ్‌కాస్టింగ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. నవంబర్ 3న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కోసం ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఏర్పాట్లను ఎన్నికల అధికారులు పరిశీలించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్(AP Municipal Polling) కేంద్రాలను జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసు శాఖతో కలిసి అన్ని చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లందరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
పోలింగ్‌కు ముందే అధికార టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 17 మున్సిపల్ ఛైర్మన్ పదవులను కూటమి ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. వీటిలో టీడీపీ 15 స్థానాలు గెలుచుకోగా, జనసేన, బీజేపీ చెరొక స్థానంలో గెలుపొందాయి. కడప జిల్లాలో 6 పట్టణ స్థానిక సంస్థలు అధికార కూటమి ఖాతాలో చేరాయి. అటు ఛైర్మన్ పదవులే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా 21 శాతానికి పైగా వార్డులు, 12 శాతానికి పైగా డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. 13 కార్పొరేషన్ల పరిధిలోని 922 డివిజన్లకు గాను 118 డివిజన్లలో పోటీ లేకుండానే కూటమి అభ్యర్థులు గెలుపొందారు. పిడుగురాళ్ల, దాచేపల్లి, ప్రొద్దుటూరు, కమలాపురం, రాయచోటి వంటి అనేక చోట్ల ఛైర్‌పర్సన్‌తో సహా అన్ని వార్డులూ ఏకగ్రీవం అయ్యాయి. అక్కడ పోటీ చేసేందుకు ప్రతిపక్ష పార్టీ సభ్యులు ముందుకు రాకపోవడంతో అక్కడ ఏకగ్రీవం అయినట్లు అధికారులు వెల్లడించారు.



