పరిషత్ ఎన్నికలు.. పోలింగ్ షురూ!
ఏపీలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు యాధావిధిగా కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది.. బ్యాలెట్ బాక్కులతోపాటు.. ఎన్నికల సామాగ్రి చేరుకుంది. ఉదయం 6గంటలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. 7గంటలనుంచి పోలింగ్ స్టార్అవుతోంది.

AP MPTC ZPTC Elections
ఏపీలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు యాధావిధిగా కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది.. బ్యాలెట్ బాక్కులతోపాటు.. ఎన్నికల సామాగ్రి చేరుకుంది. ఉదయం 6గంటలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. 7గంటలనుంచి పోలింగ్ స్టార్(AP MPTC ZPTC Elections) అవుతోంది. పోలింగ్ కేంద్రాల దగ్గర పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. గుర్తింపు ఉన్న పోలింగ్ ఏజెంట్‌ను మాత్రమే అనుమతిస్తారు. పోలింగ్ కేంద్రాల దగ్గర అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అధికారులకు ఆదేశాలు
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పటిష్ఠ ప్రణాళిక అమలు చేశామని ఏపీ ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మెజారిటీ ప్రాంతాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మురసు తుఫాన్, వాతావరణ పరిస్థితులపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా విజయవాడలో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులకు పలు కీలక అంశాలపై ఎస్‌ఈసీ దిశానిర్దేశం చేశారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు(AP MPTC ZPTC Elections) జరిగాలా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఓటర్లు, ఎన్నికల సిబ్బందికి అసౌకర్యం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా మార్గనిర్దేశం చేశారు.
అదనపు బలగాలు..
మురసు తుపాన్ నేపథ్యంలో పోలింగ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని.. స్వయంగా పర్యవేక్షించాలని .. ఇబ్బందులు తలెత్తేదగ్గర ముందస్తుగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేశారు. ఇబ్బంది కరపరిస్థితిలు ఏర్పడితే వెను వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించినట్లే MPTC, ZPTC ఎన్నికలు(AP MPTC ZPTC Elections) కూడా ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయాలని సూచించారు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తుగా అవసరమైన చోట అదనపు బలగాలు ఏర్పాటు చేసుకోవాలని డీజీపీ హరీష్‌గుప్తా అధికారులను ఆదేశించారు.
ఏకగ్రీవం ఎన్ని?
ఇక మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 2.81 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 31, 460 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2.52 లక్షల మంది సిబ్బంది నియమించారు. కౌంటింగ్ కోసం 52మందిని రెడీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,821 ఎంపీటీ స్థానాలు ఉండగా.. వాటిలో 2051 స్థానాలు ఏకగ్రీవం (AP MPTC ZPTC Elections) అయ్యాయి. 659 జెడ్పీటీసీలు ఉండగా.. వాటిలో 77 ఏకగ్రీవం అయినట్లు పంచాయితీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ తెలిపారు. పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా .. ప్రస్తుత పరిస్థితులపై పర్యవేక్షణ చేస్తున్నారు.



