Abhishek Sharma Record Innings

సొంతగడ్డపైనే కాదు.. అటు కివీస్‌ గడ్డపై కూడా టీమ్‌ ఇండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుస విజయాలతో ఆకాశమే హద్దుగా రెచ్చిపోతుంది. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్‌ టార్గెట్‌ను కేవలం 13.2 ఓవర్లలో ఉఫ్ అని ఊదేశింది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ.. బ్యాట్‌తో కివీస్‌ బౌలర్లకు అభిషేకం(Abhishek Sharma Record Innings) చేశాడు. కేవలం 35 బంతుల్లో సెంచరీ చేసి కివీస్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 113రన్స్‌ చేసి భారత్‌ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. సెంచరీ తర్వాత అభిషేక్ చేసిన ధ్యానం ఇప్పుడు వైరల్‌గా మారింది. సెంచరీ పూర్తి కాగానే పద్మాసనంలో కూర్చొని ధాన్యం చేస్తూ ఓం నమః శివాయ అంటూ అతడి నోటి నుంచి శ్లోకం రావడం కెమెరాలో కనిపించింది.

మూడు టీ20లోను ఘన విజయంతో సిరీస్ సొంతం చేసుకుంది టీమ్‌ ఇండియా. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించింది. అంతేకాదు.. ఈమ్యాచ్‌లో అటు అభిషేక్ శర్మ.. ఇటు టీమ్‌ ఇండియా రికార్డుల సునామీ సృష్టించింది. వేగంగా 50 పరుగులుచేసిన భారత బ్యాటర్లలలో టాప్‌ 5లో అభిషేక్ (Abhishek Sharma Record Innings)రెండు సార్లు ఉన్నాడు. ఈమ్యాచ్‌లో 15 బాల్స్‌లో 50 రన్స్ పూర్తి చేశాడు అంతకుముందు 14బంతుల్లోనే రికార్డును క్రియేట్ చేశాడు. పవర్ ప్లేలో ఎక్కువ రన్స్‌ సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. తొలి ఆరు ఓవర్లలో 118 పరుగులు చేసింది టీమ్‌ ఇండియా.

ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్‌ జట్టు.. 20 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 198 రన్స్ చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ 89, ఫిన్ అలెన్ 40, బెవాన్ జాకబ్స్‌ 39, గ్లెన్ ఫిలిప్స్‌ 17 పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో అర్ష్‌దీప్‌, అక్షర్‌, నితీశ్‌కుమార్‌రెడ్డి తలో వికెట్ తీశారు. 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్‌ ఇండియా ఫస్ట్‌బాల్‌ నుంచే వీరవిహారం చేసింది. అభిషేక్ శర్మ 38 బాల్స్‌లో 113 పరుగులు(Abhishek Sharma Record Innings)(9ఫోర్లు, 11 సిక్స్‌లు), వైభవ్ సూర్యవంశీ 19 బంతుల్లో 45( 4ఫోర్లు, 4సిక్స్‌లు)పరుగులతో చెలరేగారు. తొలి వికెట్‌కు 133 రన్స్‌ పార్టనర్‌ర్షిప్ సాధించారు. వీరిద్దరూ పరుగుల వరద పారించడంతో కివీస్ 199 పరుగుల టార్గెట్ చిన్నబోయింది. కేవలం 13.2 ఓవర్లలో టార్గెట్ ఫినిష్‌ చేసింది టీమ్‌ ఇండియా. 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. నాలుగో టీ20 శుక్రవారం జరగనుంది. ఇప్పటికే సొంత గడ్డపై సిరీస్‌ కొల్పోవడంతో కివీస్‌ తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. నాల్గో టీ20లో భారత్‌ ప్రయోగాలు చేసేలా కనిపిస్తోంది. బెంచ్‌కి పరిమితమైన వారిని ఆడించే ఛాన్స్ లేకపోలేదు. కివీస్‌పై టీమ్‌ ఇండియా చరిత్ర తిరగరాసింది. ఒకప్పుడు టీ20లో కివీస్‌పై భారత్ ఉన్న ఓటమి చరిత్రను గత కొన్నేళ్లుగా వరుసగా విజయాలు సాధిస్తూ కివీస్‌పై ఉన్న పాత చరిత్రను తిరగరాస్తోంది టీమ్‌ఇండియా.