ZPTC MPTC Elections Postponed

అర్నబ్ తుపాను నేపథ్యంలో ఎన్నికల ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ZPTC, MPTC ఎన్నికలు వాయిదా వేసింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్‌లో SEC మార్పులు చేసింది. పోలింగ్‌తో పాటు ఓట్ల లెక్కింపు తేదీలను కూడా రెండు రోజులు పోస్ట్ పోన్ చేసింది. గతంలో SEC ప్రకటించిన ప్రకారం నవంబర్‌ 3, ZPTC, MPTC ఎన్నికలు జరగాల్సి ఉంది. కాని ఎన్నికల కమిషన్‌ తాజా నిర్ణయంతో అవి నవంబర్‌ 5 తేదీకి మార్చారు. అదే విధంగా నవంబర్ 5 చేపట్టాల్సిన ఓట్ల లెక్కింపు ప్రక్రియను రెండు రోజు వెనక్కి జరిపి నవంబర్ 7న నిర్వహించనున్నట్లు ఎన్నిక సంఘం అధికారులు తెలిపారు. పాలనా సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రెండు రోజులు ఆలస్యంగా ZPTC, MPTC ఎన్నికలు జరగనున్నాయి. ఈ మార్పులను అభ్యర్థులు, అధికారులు, ప్రజలు గమనించాలని ఎన్నిక సంఘం సూచించింది.

మున్సిపాలిటీ ఎన్నికలు ఈనెల 28న నిర్వహించాల్సి ఉండగా.. అవి నవంబర్ 1కి .. లెక్కింపు నవంబర్‌ 3కి ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ZPTC, MPTC ఎన్నికలు 3వ తేదీన ఉన్నందున ఎన్నికల నిర్వహణ పరంగా తలెత్తే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని SEC ZPTC, MPTC ఎన్నికలను మరో రెండు రోజుల పాటు వాయిదా వేసింది. మరోవైపు నిన్నటితో ఎన్నికల ప్రచారానికి తెరపడింది.